Loading...
You are here:  Home  >  Community News  >  Telugu Community News  >  Current Article

అల్పత్వము యొక్క వివిధరూపములు

By   /  May 1, 2015  /  No Comments

    Print       Email

అల్పత్వము మూడు విధములుగా నున్నది. ఉదాహరణకు గులాబీపువ్వు అనే ఒక పదార్థమును పరిశీలించుడు. దానికి ఒక రూపము గలదు. ఆ రూపము కొంత స్థలమునాక్రమించును. కావున, అది దేశము దృష్టిలో పరిచ్ఛిన్నమై యున్నది. అది ఏకకాలములో రెండు వేర్వేరు స్థలములలో నుండలేదు. దీనికే దేశపరిచ్ఛేదము. అని పేరు. ఆ పువ్వు కాలములో కూడ పరిచ్ఛిన్నమై యున్నది. అది లేని కాలము ఒకటి ఉండెడిది. అది లేకుండా పోయే కాలము ఒకటి రాబోతున్నది. ఈ రకమైన పరిచ్ఛేదమునకు కాలపరిచ్ఛేదము అని పేరు. ఇక మూడవ పరిచ్ఛేదమును చూద్దాము. కొన్ని లక్షణములుండుటచే అది గులాబీ పువ్వు అయినది. ఆ లక్షణములు ఇతర పదార్థముల లక్షణములకంటె విలక్షనమైనవి. పుష్పమునకు పుష్పత్వము అనే లక్షణమే గాని, మరియొక లక్షణము ఉండదు. ఈ విధముగా వస్తువుయొక్క లక్షణములకు ఉండే పరిచ్ఛేదమునకు వస్తుపరిచ్ఛేదము అని పేరు.Slide95

మానవదేహముతో సహా ఈ సృష్టిలోని ప్రతి వస్తువు ఈ మూడు విధముల పరిమితులచే పరిచ్ఛిన్నమై యున్నది. మానవులలో ఈ పరిచ్ఛేదము దుఃఖమునకు కూడ హేతువు అగుచున్నది. నేను ఇక్కడ ఉన్నాను. అనగా, నేను దేశమునకు పరిమితమై యున్నాను. నేను పుట్టినాను. అనగా, నేను ఒకానొక కాలఖండమునకు పరిమితమై యున్నాను. నాకు పక్షివలె ఎగురుటకు రెక్కలు ఉండిన బాగుండును. నాకు చేప వలె నీటిలో ఈదే సామర్థ్యము ఉంటే బాగుండెడెది. ఈ విధమగు భావనలు వ్యక్తియొక్క లక్షణములలో గల పరిమితులను సూచించును.

InCorpTaxAct
Suvidha

మానవుని దేహము, ఆలోచనలు, జ్ఞానము, జ్ఞానేద్రియములు మొదలగునవి అన్నీ పరిమితులకు లోబడియున్నవి. వ్యక్తి ఈ కార్యకరణ సంఘాతమే అయి ఉన్నచో, పరిచ్ఛిన్నుడనుటలో సందేహము లేదు. కానిమానవుడు ఈ అల్పత్వమును ఆనందముగా స్వీకరించలేడు. మానవుడు ఈ అల్పత్వమునుండి విముక్తుడు కాగోరుచున్నాడు. ఇట్టి విముక్తి సంభవమే అయినచో, అది వ్యక్తి యొక్క స్వరూపముకంటె భిన్నము కాజాలదు. వ్యక్తి యొక్క స్వరూపము నిత్యసిద్ధము. బాహ్యవస్తువులను సంపాదించుట ద్వారా వ్యక్తి స్వతంత్రుడు కాలేడు. ఏలయన, ప్రతి లాభము వెనుక కొంత నష్టము కూడ గలదు. కావున, విముక్తి వ్యక్తి యొక్క స్వరూపమై యుండవలెనని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు వివరించుచున్నాడు.

ఆయన అర్జునునితో ఇట్లు చెప్పుచున్నాడు:

నీవు ఈ దేహేంద్రియమనస్సంఘాతము కావు. ఈ సంఘాతమును నీవు ఇతరవిషయములను వలెనే తెలుసుకొనుచున్నావు. నీవు నీచే తెలియబడే సకల విషయములకంటె విలక్షణుడవైన జ్ఞాతవు. నీవు రూపము లేని చైతన్యమే స్వరూపముగా గలవాడవు. చైతన్యమునకు రూపము లేదు గనుక, అది దేశకాలపరిచ్ఛేదములకు అతీతమైనది. దేశకాలపరిచ్ఛేదములకు కార్యకరణసంఘాతమునకు మాత్రమే వర్తించును. అవి ఆత్మకు వర్తించవు. శాస్త్రములో బోధించబడిన తీరులో నీవు నీ స్వరూపమునరయుము. నీవు అల్పుడవు కావు. అనంతమగు తత్త్వమే నీవు.

 

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Shailesh Lakhtakia’s Journey

Read More →