ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతికి రాజు అని, అంత అవినీతి పరుడు దేశంలోనే ఎవరూ ఉండరని వైయస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు అవినీతి, పార్టీ ఫిరాయింపుల విషయాన్ని ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు `సేవ్ డెమోక్రసీ` పేరుతో వైయస్ జగన్ నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లారు. ఈ సందర్భంగా మంగళవారం ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని, కేంద్రం హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను వేర్వేరుగా కలిశారు. చంద్రబాబు అవినీతిపై ముద్రించి `చంద్రబాబు ఎంపరర్ ఆఫ్ కరెప్షన్` అనే పుస్తకాన్ని ఆ నేతలకు ఇచ్చి బాబు అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో దాదాపు లక్షా 34 వేల కోట్లకు పైగా సంపాధించారని చెప్పుకొచ్చారు. ఆ పుస్తకంలో ఆధారాలతో సహా పొందుపరిచినట్లు ఆ నేతలకు వివరించారు.
బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత తర్వాత 34 స్కాంలు చేశారని, అందులో రాజధాని భూ దందా ఒక్కటే లక్ష కోట్ల స్కాం అని పేర్కొన్నారు. అలా సంపాదించిన నల్ల ధనంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి రూ.30 కోట్లు పెట్టి కొంటున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూని చేస్తున్నారన్నారు. తెలంగాణలో ఓటుకు కోట్లు వ్యవహారంలో తెలంగాణ లో ఎమ్మెల్యేలను కొనబోయి అడ్డంగా ఆడియో టేపుల్లో.. వీడియో టేపుల్లో పట్టబడినా అతనిపై చర్యలు తీసుకోలేదన్నారు. అధికారాలన్నీ స్పీకర్ చేతిలో ఉండడం వలనే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. చంద్రబాబుకు తన పాలనపై తనకే నమ్మకం లేకపోవడం వలనే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడం లేదని దుయ్యబట్టారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.