Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

ఆడువారి మాటలకు అర్థాలే వేరులే

By   /  March 16, 2016  /  Comments Off on ఆడువారి మాటలకు అర్థాలే వేరులే

    Print       Email
ఆడువారి మాటలకు అర్థాలే వేరులే
MISSAMMA_2156262f
సంగీతం-సాలూరు రాజేశ్వరరావు
సాహిత్యం-పింగళి నాగేంద్రరావు
సినిమా -మిస్సమ్మ 1955
********
ఈ పాట  మిస్సమ్మ (1955) సినిమా లోనిది . దీనిని పింగళి నాగేంద్రరావు రచించగా, సాలూరు రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో ఏ.ఎం.రాజా మధురంగా గానం చేశారు.
నేపధ్యం
మేరీ మరియు రావు భార్యాభర్తలుగా నటించటానికి సమ్మతిస్తే ఒక పాఠశాలలో ఉపధ్యాయ దంపతులుగాచేరే అవకాశం ఉందని పత్రికా ప్రకటనను రావు మేరీకి చదివి వినిపిస్తాడు. ఇద్దరి ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా ఇద్దరికీ అలా నటించటం అవసరం. ఆ ప్రతిపాదనను మేరీ మొదట తిరస్కరిస్తుంది. ఆ సందర్భంలో రావు, రేలంగికి ఆడువారి మాటలలోని అంతరార్ధాన్ని పాట పాడుతూ వివరిస్తాడు.  
పాటలో కొంతభాగం-అనుపల్లవి
అవునంటె కాదనిలే కాదంటె అవుననిలే
అవునంటె కాదనిలే కాదంటె అవుననిలే
పల్లవి
 
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే
అర్ధాలే వేరులే అర్థాలే వేరులే….అర్థాలే వేరులే అర్థాలే వేరులే
 
 
చరణం
 
అలిగి తొలగి నిలిచినచో చెలిమి జేయ రమ్మనిలె
అలిగి తొలగి నిలిచినచో చెలిమి జేయ రమ్మనిలె
 
చొరవ చేసి రమ్మనుచో మరియాదగా పొమ్మనిలె
చొరవ చేసి రమ్మనుచో మరియాదగా పొమ్మనిలె
 
ఆడువారి మాటలకు అర్థాలే వేరులే
ఆడువారి మాటలకు అర్థాలే వేరులే
 
సాహిత్యం

తెలుగు సాహిత్యంలో ఈ పాట ఒక క్రొత్త ఒరవడిని సృష్టించి ఆడువారి మాటలకు అర్ధాలు వేరు అనేది ఒక సామెతలాగా ప్రజాదరణ పొందింది. ఆడువారు ఔనంటే కాదని, అలిగి తొలగితే దగ్గరకు రమ్మని, రమ్మన్నచో మద్యాదగా పొమ్మని అర్ధం చేసుకోవాలని కొత్త భాష్యం చెప్పారు పింగళి.ఆడువారి మనస్తత్వాన్ని బాగా 

అధ్యయనం చేసిన పింగళి మాత్రం ఆజన్మ బ్రహ్మచారి కావటం విశేషం!​

 

InCorpTaxAct
Suvidha
ఈ పాటను ఇక్కడ https://www.youtube.com/watch?v=G1wd7MaXLwE&list=PL0__z7c1lf8tbw33nP6Y30_7oKRIk_dPZ&index=10 వినండి!
*****
ఏ.యం.రాజా
amraja
ఏ.యం.రాజా (అయిమల మన్మథరాజు రాజా) (జూలై 1, 1929 – 1989) 1950వ దశకములో తమిళ, తెలుగు సినిమా రంగాలలో విశిష్టమైన నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు, నటుడు. విప్రనారాయణ, చక్రపాణి, ప్రేమలేఖలు, మిస్సమ్మ పాటలు రాజా గాత్ర మాధుర్యానికి కొన్ని మచ్చు తునకలు. ఈయన వివిధ భాషలలో 10,000 పాటలు పాడి, వందకు పైగా సినిమాలకు సంగీతం సమకూర్చాడు.
ఏ.యం.రాజా 1929, జూలై 1 న చిత్తూరు జిల్లాలోని రామచంద్రపురంలో మన్మధరాజు, లక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు.మూడు నెలల ప్రాయంలోనే తండ్రి మరణించడంతో ఈయన కుటుంబం
రేణుకాపురంకు తరలి వెల్లింది. అక్కడే రాజా తన చదువు ప్రారంభించాడు. 1951లో మద్రాసు పచ్చయప్ప కళాశాల నుండి బి.ఎ. పట్టా పొందాడు. ఈయన చదువుకునే రోజుల్లోనే సంగీతంపై ఆసక్తితో మూడేళ్ళపాటు సాధనచేసి నేర్చుకున్నాడు. పచ్చయప్ప కళాశాల సంగీత పోటీల్లో ప్రథమ బహుమతి గెలుచుకున్నాడు. 1951లో కుమారి సినిమాకు నేపథ్యగాయకునిగా పనిచేయటానికి ఒప్పందం కుదిరింది. ఆ తరువాత సంసారంలో సినిమాలో పాడాడు. ఆ తరువాత అప్పట్లో విడుదలైన దాదాపు సినిమాలన్నింటిలో రాజా గొంతు వినిపించేది. ఈయన గాత్రం 1954, 1955 సంవత్సరాల్లో ఆంధ్రదేశంలో విపరీతంగా విహారం చేసింది.
రాజా, ప్రముఖ గాయని జిక్కీని, ఎం.జీ.రామచంద్రన్ హీరోగా నటించిన జెనోవా సినిమా సెట్స్‌లో కలిశాడు. జిక్కిని వివాహం చేసుకున్న సమయంలో వీరిద్దరూ పాడిన ప్రేమలేఖలు సూపర్ హిట్ కావటం ఒక విశేషం. వీరికి 4 కుమార్తెలు మరియు ఇద్దరు కుమారులు. రాజా సరదాగా నటించి, పాడిన హాస్యరస చిత్రం పక్కింటి అమ్మాయి. అశ్వత్థామ స్వరకల్పనలో రూపొందిన ఆ చిత్రంలోని గీతాలు హాయి గొలిపే లలిత గాన మాధుర్యానికి సంకేతాలు. అలాగే అమర సందేశం గీతాలు కూడా రాజా శక్తిని నిరూపించాయి. శోభ, పెళ్ళి కానుక చిత్రాలకు, మరికొన్ని తమిళ చిత్రాలకు ఏ.యం.రాజా సంగీత దర్శకత్వం వహించారు. పెళ్ళికానుక లోని నేపథ్య సంగీతం కూడా ఎంతో భావగర్భితంగా ఉండి చిత్ర విజయానికి దోహదం చేసాయి.
ఈయన కన్యాకుమారి జిల్లాలోని ఒక గుడిలో సంగీతకచ్చేరి చేసి తిరిగి వస్తుండగా తిరునల్వేలి జిల్లాలోని వల్లియూరులో జరిగిన రైలు ప్రమాదంలో 1989, ఏప్రిల్ 9న మరణించాడు.
(సేకరణ)
టీవీయస్.శాస్త్రి 
TVS SASTRY 
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →