ఆధ్యాత్మిక శాస్త్రం – ఆవశ్యకత
చురుగ్గా శ్రమిస్తే సిరిసంపదలు కలుగుతాయన్నది అందరు ఎరిగిన సత్యం. జ్ఞానాన్ని ఫలవంతంగా, సమర్ధతతో జోడిస్తే మాత్రమే సిరిసంపదలు లభిస్తాయి. అంతేతప్ప కేవలం మంత్ర జ్ఞానం తదితరాలవల్ల ప్రయోజనం సూన్యమ్. కాంతినొసగే శాస్త్రం విజ్ఞాన శాస్త్రం మాత్రమే. విజ్ఞానాన్ని సాంకేతిక రంగంలో ధక్షతగా వాడితే శక్తి, సంవృద్ధి కలుగుతాయి. ధనార్జనకు సవ్యమైన మార్గం ఇదే దీనివల్ల మాత్రమే మనం ఈ ప్రపంచం నుండి భయాన్నీ, లేమినీ దూరం చేయగలం. కానీ ఆంతరంగిక జీవనంలో సమన్వయం లోపించినట్లైతే బాహ్య ప్రపంచం లోని గెలుపూలన్నీ ఓటములౌతాయి.
అదేగనక ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ఆసరాగా తీసుకున్న వారికి అంతరంగం స్వాధీనమై జ్ఞానాన్ని ఆర్జించి లేమిపైన విజయాన్ని సాదిన్చగలుగుథారు. ఇదే పరమ శ్రేయం. ఈ విధంగా ఆచంచల నీతి, నిజాయితీలు వర్ధిల్లుతాయి. గీతాచార్యుడు చెప్పిన నీతి కూడా ఇదే.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.