Loading...
You are here:  Home  >  Community Events  >  Current Article

ఆయ‌న రావ‌డంతో ధైర్యం వ‌చ్చింది

By   /  April 15, 2016  /  Comments Off on ఆయ‌న రావ‌డంతో ధైర్యం వ‌చ్చింది

    Print       Email

Chandyఆయ‌న రావ‌డంతో ధైర్యం వ‌చ్చింది

 

InCorpTaxAct
Suvidha

 

కేరళలోని పుట్టింగల్‌ దేవి ఆలయంలో జ‌రిగిన ప్ర‌మాదంలో 114 మంది చ‌నిపోగా వంద‌ల మంది క్ష‌త‌గాత్రులైన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు పెట్టెడు దుఃఖంలో ఉన్న కేర‌ళ రాష్ట్రానికి భ‌య‌ప‌డ‌వ‌ద్దు నేనున్నానంటూ వ‌చ్చాడు ఒక పెద్ద‌మ‌నిషి. ఆ వ్య‌క్తి రావ‌డంతో ఆ రాష్ట్ర సీఎం కొండంత ధైర్యం వ‌చ్చింది. ఇదంతా ఎవ‌రో చెప్పిన మాట‌లు కాదు. స్వ‌యాన కేర‌ళ రాష్ట్ర సీఎం ఉమెన్‌చాందీ అన్నారు. సహాయ కార్యక్రమాల్లో అలసివున్న పోలీసులకు వీవీఐపీల భద్రత సవాలుగా మారిందని ప్ర‌ధాని ఒక‌రోజు ఆల‌స్యంగా వ‌స్తే బాగుండేద‌ని కేరళ పోలీస్‌ చీఫ్‌ అభిప్రాయపడిన వార్త‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో శుక్ర‌వారం సీఎం ఉమెన్ చాందీ ఆ అభిప్రాయాన్ని ఖండీస్తూ స్పందించారు.
పుట్టింగల్‌ దేవి ఆలయంలో ప్రమాదం జరిగిన రోజునే ప్రధాని నరేంద్ర మోదీ సంఘటన స్థలానికి రావడం తమకు ఎంతో వూరటనిచ్చిందన్నారు. ప్రధాని ఇక్కడికి రావడం గొప్ప విషయమని.. జాతీయ స్థాయి నాయకుడు కేరళకు రావడం చాలా పెద్ద రిలీఫ్‌ అని ముఖ్యమంత్రి అన్నారు. తక్షణం స్పందించి జరిగిన విపత్తుకు మోదీ ఇచ్చిన ప్రాధాన్యం, సహాయం గొప్పదని చాందీ పేర్కొన్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ ఘటనతో కేరళలో ఆలయ ఉత్సవాల్లో బాణసంచా నిషేధించాలన్న డిమాండ్‌ను అఖిల పక్ష నేతలు తిర‌స్క‌రించార‌న్నారు. నిబంధనల మధ్య బాణసంచా పేల్చవచ్చని తెలిపారు. దీంతో త్వరలో జరగబోయే త్రిస్సూర్‌ పోరమ్‌ ఉత్సవాల్లోనూ పరిమిత సంఖ్యలో బాణసంచాకు అనుమతి ఇచ్చిన‌ట్లుతెలిపారు. ఏది ఏమైనా మ‌ళ్లీ ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా చూసుకోవాల్సిన బాధ్య‌త మాత్రం కేర‌ళ ప్ర‌భుత్వం ఉంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →