విండీస్‌తో సీరీస్ ప్రారంభానికి ఇంకా సమయం ఉండడంతో ఆటగాళ్లు బీచ్‌లలో ఎంజాయ్ చేస్తున్నప్పటికీ పెద్దగా పట్టిం చుకోని టీమిండియా కోచ్ కుంబ్లే… ప్రాక్టీస్ విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరిస్తున్నాడట. శిక్షణతో పాటు క్రమశిక్షణ కూడా ఉండాలని కుంబ్లే ఆటగాళ్లకు హెచ్చరికలు జారీ చేస్తున్నాడట. విండీస్‌కు వెళ్లకముందు బెంగళూరులో ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరంలో ఆటగాళ్లకు… ట్రైనింగ్ సెష న్‌తో పాటు యోగాసా నాలు చేయించిన కుంబ్లే… రోజువారీ కార్యక్రమంలో భాగంగా క్రమశిక్షణపై దృష్టి సారిస్తున్నాడట. బస చేసిన హోటల్ నుంచి స్టేడియం వద్దకు నిర్ణీత సమయంలోపు రావాలని, స్టేడియంకు బయలుదేరే ముందు రూమ్‌లను వదలడంలో ఎవరైనా ఆలస్యం చేస్తే రూ. 3 వేలు జరిమానా చెల్లిం చాల్సి ఉంటుందని హెచ్చరించాడట.
అంతే కాదు విండీస్ పర్యటనలో ఉన్నన్ని రోజులు ఆటగాళ్లందరితో ప్రతి నాలుగో రోజు అధికారికంగా సమావేశం నిర్వహించాలని ఆర్డర్ వేశాడని తెలుస్తోంది. సీరీస్‌కు, క్రికెట్‌కు సంబంధించిన ఎలాంటి సమస్యగాని, సందేహాలు గాని ఉన్నట్లైతే… ఆటగాళ్లు ఏ సమ యంలోనైనా తనతో కలసి మాట్లాడవచ్చని చెప్పాడు. ఇలా ఓ ప్రణాళికా బద్ధంగా జట్టుకు పెద్దన్నగా… అన్ని విషయాలపై పూర్తి సమీక్షతో ముందుకు సాగుతున్న కుంబ్లే విండీస్ టూర్లో ఎలాంటి ఫలితాలో సాధిస్తాడో వేచి చూడాలి.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.