Loading...
You are here:  Home  >  Community News  >  Telugu Community News  >  Current Article

ఈశావాస్య ఉపనిషత్తు

By   /  May 25, 2015  /  No Comments

    Print       Email

“ఈశావాస్య మిదగ్గ్ సర్వం” అనే మంత్రంలో ప్రారంభం కావడం చేత దీనికి ” ఈశావాస్య ఉపనిషత్తు” అనే పేరు కలిగినది. Upanishad_Quotes1ఈశా ఉపనిషత్తు అని కూడా పేర్కొనబడే 18 మంత్రాలతో కూడుకున్న చిన్న ఉపనిషత్తు ఇది. యజుర్వేదంలో కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం అనే రెండు విభాగాలున్నాయి. శుక్ల యజుర్వేదంలోని వాజసనేయ సం హితలో ఈ ఉపనిషత్తు పొందుపరచబడియున్నది. ఈ సం హితలోని నలభై అధ్యాయాలలో చివరి అధ్యాయం ఇది. తత్యన్ అథర్వణుడనే మహర్షి తన పుత్రునికి దీనిని ఉపదేసించాడు అతడు కాక్ష్యారహితుడైనందువలన, ముక్తి పొందాలనే తీవ్ర ఆకాంక్ష గలవాడైనందు వలన మహర్షి ఈ ఉపనిషత్తును తన పుత్రునికుపదేసించాడు.

ఉపనిషత్ సారాంశం

InCorpTaxAct
Suvidha

“అంధకారానికి అతీతమైన సూర్య దీప్తితో ప్రకాసించే పర బ్రహ్మ స్వరూపాన్ని నేను సాక్షాత్కరించుకున్నాను.” అంటూ ఆనందపారవశ్యంతో ఋషి ఉద్ఘాటించడం శ్వేతాశ్వతర ఉపనిషత్తులో మనం చూస్తాం కానీ ఆ తేజస్సుకు ఆవల ఉన్న దానిని అన్వేషించే ప్రయత్నాన్ని ఇక్కడ చూడవచ్చు. ఈశ విద్య అని ఈ ఉపనిషత్తు పేర్కొనే ఈ అభిప్రాయమే ఈశావాస్య ఉపనిషత్తుకు కేంద్రమైన అంశంగా అమరి ఉంది. ఆ తేజస్సుకు ఆవల ఉన్న దానిని అన్వేషించే ప్రయత్నాన్ని, ఆ తేజస్సుకు ఆవల ఉన్న దేమిటి అన్న దానిని కూడా క్రమ క్రమంగా ఇక్కడ మనం చూస్తాము.
ఋషుల అనుభవ పూర్వక సత్యాలే ఉపనిషత్తులు కేవలం శాస్త్ర జ్ఞానం తోనో, సంస్కృత పాడిత్యం వలనో వాటి నిజమైన అర్ధాన్ని గ్రహించడం సాధ్యం కాదు. నిజమైన సాధనామయ జీవితంలో పాల్గొని, మనస్సుని పావనం చేసుకుని మనం భగవధభి ముఖంగా ముందుకు సాగే కొద్ది ఉపనిషత్తుల అంతరార్ధం మరింతగా మనకు అవగతం అవుతుంది.

పదే పదే పఠించి మంత్రాల అర్ధాన్ని లోతుగా ఆలోచించడంతో పాటు ఆధ్యాత్మిక సాధనలను కూడా అనుష్టించినపుడే ఉపనిషత్తులను యదార్ధ రీతిలో అర్ధం చేసుకోగలం, వాటిలో నిగూఢంగా ఉన్న అద్భుతాలలో మునిగి ఆనందించగలం.
కాల ప్రవాహంలో పలు యుగాలు గడిచిపోవడం వలన కోన్ని మంత్రాల అర్ధం సులభంగా అవగతం చేసుకొనేటట్లుగా లేవు. అర్ధం కావడం లేవని విసుగు చెందకుండా అర్ధమైన మంత్రాల అర్ధాన్ని లోతుగా ఆలోచిస్తూ సాధనలతో ఉన్నతిని పొందడానికి ప్రయత్నించాలి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Shailesh Lakhtakia’s Journey

Read More →