అంధకారం నుండి వెలుతురు లోకి తీసుకువెళ్ళమని అర్ధించే ప్రార్ధనల గురించి మనకు తెలుసు. కాని వెలుతురుకు ఆవల ఏమున్నదో, ఆ పరమసత్యాన్ని దర్శింపజేయుమని ఈ ఉపనిషత్కర్తయైన ఋషి భగవంతుని ప్రార్ధిస్తున్నాడు. లోకంలో జీవించడం ఎలా ,తేజోవిరాజమానుడయిన భగవంతుని పొందడం యెలా, ఆ తేజస్సునకు ఆవల యేమున్నదో మున్నగు అంశాలను ఈ ఉపనిషత్తు ప్రస్తావిస్తూంది. ఉన్నతమైన ఆధ్యత్మిక జీవనాన్ని చవిచూడగోరేవారికి ఈ ఉపషత్ మంత్రాలు మార్గదర్శకం కాగలవని ఆకాంక్ష.
ఒక అవలోకనం:-
ఉపనిషత్తులను గురించి తెలుసుకొనబోయే నునందు మనం వేదాలను గురించి స్వల్పంగా తెలుసుకొనాలి
ప్రపంచంలో అత్యధిక అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్నప్పుడు భారత దేశం ఆధ్యాత్మిక ప్రకాశంతొ జాగృతమై విరాజిల్లింది. తపోసంపన్నులైన భారతీయ ఋషి పుంగవులు ఈ విధంగా వివరించడం జరిగింది.
“వేదాహమేతం పురుషం మహాంతం
ఆదిత్య వర్ణం తమసః పరస్తాత్|
తమేవ విదిత్వా2తి మృత్యుమేతి
నాన్యః పంధా విద్యతే2 యనాయ||
“సమస్తమైన అంధకారానికి అతీతమైన సూర్య దీప్తితో ప్రకాసించే ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని నేను సాక్షాత్కరించుకున్నాను ఆయనను ప్రత్యక్షం చేసుకొనడం వలన మాత్రమే మానవుడు మృత్యువునకు అతీతుడవుతాడు. ఈ జననమరణవలయాలను తప్పించుకొనుటకు మరొక మార్గం లేదు”.”అమృత పుత్రులారా! ఆలకించండి” అని భూలోక వాసులనే గాక పరలోక వాసులను సయితం ఆహ్వానించారు. చాలా పూర్వ కాలం చరిత్ర రచనగానీ, సాప్రదాయక కథల అనుసృజన గానీ జరుగని పురాణ కాలం నుండి ఈ లోకాన్ని పునీతం గావించే రీతిలో జీవనం సాగించిన మహనీయులగు ఋషుల దివ్యానుభూతుల సమాహారమే వేదాలు.
లోకంలో అత్యంత ప్రాచీనమైన గ్రంథాలు ఈ వేదాలే! “ఇవి ఎప్పుడు ఆవిష్కరింపబడినవో ఇదమిర్ధంగా తెలియకపోయినా ఇవి కనీసం ఎనిమిది తొమ్మిది లక్షల వత్సరాల పూర్వమే వెలువడినట్లు భావింపబడుచున్నవి. అయినప్పటికీ వేదములు నేటికినీ నిత్యనూతనముగా విరాజిల్లుచున్నవి. వేదాలకు “అపౌరుషేయా”లని పేరు, అనగా సాస్వతంగా విరాజిల్లేవని అర్ధం. ” భూమ్యాకర్షణ శక్తిని గూర్చి కనుగొనుటకు పూర్వమే ఆ శక్తి యున్నది, అదే విధంగా ఆధ్యాత్మిక లోకంలోని విధులు కూడా వాటిని గూర్చి మనకు తేలియక పూర్వమే ఉండి ఉంటాయి. అట్లే మనం విస్మరించినా ఉంటాయనడంలో సందేహం లేదు.
ఋషులు ఆవిష్కరించిన ఆ సత్యాలను తదనంతర కాలంలో వ్యాస మహర్షి నాలుగు భాగాలుగా క్రోడీకరించారు. అవే ఋగ్, యజుర్, సామ, అదర్వణ వెదాలు. ప్రతి వేదము మూడు ప్రధాన భాగాలుగా వర్గీకరించబడినది. అవి సంహిత(దైవ ప్రార్ధనలు), బ్రాహ్మణం(యాగవివరములు) మరియు అరణ్యకం(ఉపనిషత్తులు,చరమసత్యం గురించిన వివరణ).
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.