ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, శ్రీమద్భగవద్గీత – ఈ మూడింటినీ కలిపి ప్రస్థాన త్రయంగా పేర్కొంటారు. ప్రస్థాన త్రయం అనగా చరమప్రమానంగా విరాజిల్లుతున్న మూడు ఉద్గ్రంధాలని అర్ధం. వేదకాల చింతనాసరళిలో మకుటాయమానంగా విరాజిల్లినవి ఉపనిషత్తులు. చరమసత్యాన్ని గురించిన విచారణలో మనిషి మనస్సు అందుకోగలిగిన ఎల్లలను ఉపనిషత్తులు అందుకొన్నవని లోకంలోని చింతనాశీలురు అభిప్రాయ పడుతున్నారు.
ఉపనిషత్తులు అనెకం ఉన్నాయి. సామాన్యంగా వాటిలో 108 ఉపనిషత్తులను మాత్రమే గణనలోకి తీసుకొంటున్నారు వీటియందు కూడా 14 ఉపనిషత్తులని ప్రధానంగా పరిగణిస్తున్నారు. అవి :
ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, ఐతరేయ, తైత్తరీయ, ఛాందోగ్య, బృహదారన్యక, శ్వేతాశ్వతర, కౌసీతకీ, మహానారాయణ, మైత్రాయణి. మొదటి పది ఉపనిషత్తులకు ఆది శంకరాచార్యులు బాష్యం వ్రాయడం జరిగినది. అలాగే ఈ పదునాల్గు ఉపనిషత్తులూ నాలుగు వేదాలలో పొందుపరచబడ్డాయీ.
ఐతరేయ, కౌసీతకీ -ఋగ్వేదం
ఈశ, కఠ, తైత్తరీయ, బృహదారన్యక, శ్వేతాశ్వతర, మహానారాయణ, మైత్రాయణి – యజుర్వేదం
కేన, ఛాందోగ్య, – సామవేదం
ప్రశ్న, ముండక, మాండూక్య – అధర్వణవేదం
విద్యలు:
మనిషి, లోకం, భగవంతుడు అనేవి మూడు మౌలిక సత్యాలు. ఉపనిషత్తులు ఈ మూడింటినీ, వాటిమధ్య నెలకొన్న సంబంధాన్ని విచారణ చేస్తున్నాయి. ప్రతి వ్యక్తి, ప్రతి ప్రాణి చరమ సత్యమైన భగవంతుడిని పొందటమే జీవిత లక్ష్యం. అందుకొఱకు సిద్ధం చేయబడిన రంగ స్థలమే లోకం. ఈ లోకం అందిస్తున్న అనుభవాలను గుణపాఠంగా గ్రహించి ఈ లోకంలో జీవిస్తూనే లక్ష్యాన్ని సాధించాలని ఉపనిషత్తులు నొక్కివక్కాడిస్తున్నాయి.ఇందుకు ప్రతి ఉపనిషత్తు తనదైన కొన్ని మార్గాలను చూపుతున్నది. ఆ మార్గాన్నే విద్య అని పేర్కొంటారు ఈ విద్యలు కోకొల్లలు. పదునాల్గు ప్రధాన ఉపనిషత్తులలో ముప్పది ఐదు విద్యలు గుర్తింపబడుతున్నవి.
ఈశావాస్య ఉపనిషత్తులో మనకు గోచరించేది ఈశ విద్య. 15-16 మంత్రాలు దీనిని గురించి చెపుతున్నాయి. తన ప్రకాశాన్ని ఉపసమ్హరించుకొమని సూర్య భగవానుని ప్రార్ధించే మంత్రాలివి.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.