‘ఓంకారం’
ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ
ఇది శ్రుతి వాక్యం. దీనర్ధం, ఓం అనే అక్షరం ఒక్కటే పరబ్రహ్మస్వరూపం అని చెప్పబడుతున్నది. ఓంకారానికి సంబంధించిన విశేష వివరణ మాండూక్యోపనిషత్లో వివరంగా చెప్పబడుచున్నది. అందలి మొదటి శ్లోకం;
శ్లో|| ఓం ఇత్యేతదక్షరమిదగ్౦ సర్వం, తస్యోపవ్యాఖ్యానం, భూతం భవద్భవిష్యదితి సర్వామోంకార ఏవ|
య చ్చాన్యత్ త్రికాలాతీతం తదప్యోంకార ఏవ||
కనిపించే యావత్తు విశ్వము ఓంకారమే అని ఈ శ్లోకం తెలియజేస్తున్నది. అనగా భూత, భవిష్యత్, వార్తమాన కాలాలలో ఉన్నటువంటి సర్వాముకూడా ఓంకార స్వరూపంగానే భావన చేయాల్సి ఉంటుంది. అంతేకాక వీటికి అతీతంగా ఇంకేదైనా ఉన్నాను అది కూడా ఓంకారమనే ఈ శ్లోకార్ధం. అనగా వేదంలో చెప్పబడిన సృష్టిక్రమం ప్రకారం మూల శక్తి అయిన ప్రకృతి యొక్క కంపన ద్వారా విశ్వ సృష్టి మొదలౌతుంది, ఈ శబ్ద ప్రతీక “ఓంకారం”.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.