Loading...
You are here:  Home  >  Community News  >  Telugu Community News  >  Current Article

ఓం శివం

By   /  March 16, 2015  /  No Comments

    Print       Email

“నిజమైన నేను దేహం కాదు, పంచేంద్రీయాలు కావు, ప్రాణం, మనస్సు లేక ఇవేవీ తెలియని సుషుప్తి కాదు. వీటన్నింటినీ ఒకదాని వెంట మరొక దానిని ” నేను ఇది కాను” అని విడిచిపెడితే కడకు మిగిలేది నేను అది చైతన్యం.
ఆ చైతన్యమే సచ్చిదానందం. ఆ స్థితిలో “నేను” అన్న భావావేశం కూడా ఉండదు. దీనినే మౌనమని, ఆత్మ అని అంటారు. ఉండేది అది ఒక్కటే. సృష్టి, అహము, ఈశ్వరుడు ఇత్యాదులన్నిటిని వేరువేరుగా పరిగణించడం ఒక భ్రాంతి మాత్రమే. యదార్ధానికి భగవంతుడు, జీవుడు, యావత్తు విశ్వము, సమస్తమూ కూడా ఆత్మ స్వరూపమయిన, శివ స్వరూపమయిన సత్యం గానే గ్రహించాలి.
అట్టి సత్యమైన శివ స్వరూపం యొక్క సాక్షాత్కారం ఎలా కలుగుతుందన్న సందేహం కలుగవచ్చు. దృశ్యమైనదంతా అదృశ్యమైతే గోచరించే నిజ తత్థ్వ౦ వీటన్నింటికి ద్రష్ట అయిన సత్య స్వరూపమె.అనగా కనపడేదంతామిధ్య, అందుకు కారణభూతుడయిన ద్రష్ట మాత్రం కేవలం సత్యమని అర్ధం చేసుకోవాలి. వస్తుజాలాన్ని చూచేటప్పుడు శివ స్వరూపాన్ని సాక్షాత్కరంపజేసుకోవడం సాధ్యపడదు ఎందువల్లనంటే సహజంగామనం తాడును చూసి పాముగా భ్రమిస్తూ వుంటాం, ఎప్పుడు మనం నిజదృష్టితో ఆ భ్రాంతిని తొలగించుకొని చూస్తామో అప్పుడు మనకు తాడుకనబడిన మాదిరిగా కనుపించే మాయా మోహితమైన వస్తు జాలానికి అతీతంగా దృష్టిసారిస్తే నిత్యము,సత్యము అయిన శివ స్వరూపమే గోచరమవుతుంది అన్ని భావాలకు, చేష్టలకు హేతువయిన మనస్సు మాయమయితే బాహ్యావస్తుజాలం దానంటతదే మాయమవుతుంది.
అయితే మనస్సు అనే దాని నైజం ఏమిటి? అది యెలా మాయమవుతుంది అన్న సందేహం కూడా సహజంగా మనకు కలుగుతుంది. మనస్సు అనేది ఒక వస్తుస్వరూపం కాదు, అది ఒక శక్తి, భావాల యొక్క సమాహారం,సమూహం. అదే ప్రపంచరూపం దరిస్తుంది, లేదా ప్రపంచంగా వ్యక్తమవుతుంది. ఆ మనస్సు ఆత్మలోలయమయితే అపుడునిజతత్థ్వ౦ అగుపడుతుంది. అదే శివస్వరూపం. ప్రపంచం అనే పదానికి లోకమనే గాక ‘మాయ’ అని మరో అర్ధం కూడావుంది. ఆ రకంగా చూసినా మాయ తొలగిపోతే మిగిలేదంతా “సత్యం-శివం-సుందరం.”
స్పూర్తి- భగవాన్ రమణమహర్షుల బోధనలు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Shailesh Lakhtakia’s Journey

Read More →