లోకే2స్మిన్ ద్వివిధా నిష్టా పురా ప్రోక్తా మయా2నఘ|
జ్ఞాన యోగేన సాంఖ్యానా౦ కర్మయోగేన యోగినాం||
‘ లోకే2స్మిన్ ద్వివిధా నిష్టా పురా ప్రోక్తా మయా అనఘ’ ఇంతకు పూర్వం నా చేత జ్ఞానులకు సాంఖ్యం, యోగులకు కర్మను మార్గంగా చెప్పబడింది. యోగులు కర్మయోగాన్ని అనుసరిస్తారు. ఆధ్యాత్మిక ఉన్నతికి ఈ రెండు మార్గాలు కావాలి. బాహ్యంగా కర్మ చేస్తూ, అంతరంగికంగా లోనికి చొచ్చుకుపోవడమే రెండు మార్గాలున్నాయి. ఆంతరంగిక ధ్యానం, ఇది సాంఖ్య మార్గం. ‘నేతి నేతి’ అంటే ఇది కాదు, ఇది కాదు అంటూ ఉండేదాన్ని, జ్ఞానయోగ మార్గం అంటాం. అద్భుతమయిన ఆనందాన్ని పొందడానికి, ఆ ఆనందానికి బాహ్యంగా వ్యతిరేకంగా ఉన్నవాటిని వదిలి వేయాలి.
సమత్వం కలిగిన బుద్ధి మీద ఆధారపడ్డ దానిని గురించి చెబుతాను. దీనికి కూడా అద్భుతమైన విలువ ఉంది. జ్ఞానికి మోక్షం ప్రాప్తిస్తే కర్మయోగికీ మోక్షం ప్రాప్తిస్తుంది. గీతలో ఈ రెండు మార్గాల్లోనూ కర్మయోగం విశేషమయినది అని చెబుతున్నాడు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.