కేడీఎక్స్ తో తెలంగాణ సర్కార్ ఒప్పందం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖా మంత్రి తారకరామారావు పాలనలో స్పీడును పెంచాడు. విశ్వనగరమైన హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా మార్చాలని కంకణం కట్టుకున్న కేటీఆర్ రోజూ ఏదో ఒక ఐటీ కంపెనీ ప్రతినిధులతో మీటింగ్ పెట్టుకుంటూ ఐటీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే శుక్రవారం కేటీఆర్‌తో చైనాకు చెందిన ఎల్రక్టానిక్ సంస్థ కేడీఎక్స్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో కేడీఎక్స్ యూనిట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కేడీఎక్స్ సంస్థ ప్రపంచంలో మొట్ట మొదటి సారిగా కళ్ల అద్దాలు లేకుండా త్రీడీ చిత్రాలనుచూసే విధంగా తెరలను తయారు చేసిన సంస్థగా పేరు పొందడంతో పాటు ఇప్పటి అలాంటి సదుపాయం కలిగిన మొబైల్స్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ సందర్భంగా కేడీఎక్స్ ప్రతినిధులు మాట్లాడుతూ తెలంగాణ పారిశ్రామిక విధానం, ఐటీ పార్క్‌లు, ఐటీ సెజ్‌లు సైతం తమ భవిష్యత్కారాచరణలకు ఊతం ఇస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ పాలన, పారిశ్రామిక విధానం బాగుండడం వలన అనేక అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌లోపెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. పెట్టుబడులకు హైదరాబాద్ సరైన వేదిక అన్నారు. హైదరాబాద్‌తో పోటీగా వరంగల్‌ను కూడా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు. కాగా ప్రపంచంలోనే త్రీడీ తెరతో కలిగిన మొబైల్‌ను ఇంకా మార్కెట్లోకి రాక ముందే కేడీఎక్స్ సంస్థ ప్రతినిధులు కేటీఆర్‌కు బహూకరించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.