దేశంలోని 29 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలితప్రాంతాల్లో ఉన్న ముఖ్యమంత్రుల పనితీరు, పథకాల అమలు, పాలన తదితర అంశాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన సర్వేలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నంబర్ 1 ర్యాంకు వచ్చింది.
వివిధ పథకాలు అమలు చేస్తూ దేశానికే దిశానిర్దేశం చేస్తున్న కేసీఆర్ దేశంలోనే ఉత్తమ సీఎంగా నిలిచినట్లు సర్వే స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ రెండో స్థానంలో, ఛత్తీస్గడ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ మూడోస్థానంలో నిలిచారు. గుజరాత్ ముఖ్యమంత్రి ఆనంది బెన్ నాలుగోస్థానంలో, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఐదోస్థానంలో నిలిచారు. ప్రజలను మెప్పించడంలో, ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయడంలో, ప్రజాభిమానం చూరగొనడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు ఉండగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మాత్రం 13వ ర్యాంకు రావడం గమనార్హం. కాగా ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని ముఖ్యమంత్రుల పనితీరుపై ప్రతి మూడు నెలలకు ఒకసారి త్రైమాసిక నివేదికలు తెప్పించుకుంటారన్న సంగతి తెలిసిందే.
అయితే ఈ సారి చాలా మంది ముఖ్యమంత్రుల ర్యాంకులు పడిపోయాయి. అందులో చంద్రబాబు నాయుడు ఒకరు. ఉదయం లేచిన దగ్గరి నుంచి పడుకునే వరకు అభివృద్ధి… అభివృద్ధి అని జపం చేస్తున్న బాబుకు 13వ ర్యాంకు రావడంపై టీడీపీ నాయకులు బాధపడుతున్నారట. తమ నాయకుడిని నంబర్ వన్ ర్యాంకు ఇచ్చి ఉంటే బాగుండేదని వాళ్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చేయని కేసీఆర్‌కు ఎలా ఫస్ట్ ర్యాంకు ఇస్తారని వారు ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నిస్తున్నారు. కాగా ప్రధాని నిర్వహించిన ఈ సర్వే వివరాలు ఈ నెల 16న ప్రకటించనున్నట్లు సమాచారం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.