Loading...
You are here:  Home  >  Community News  >  Telugu Community News  >  Current Article

క్రమశిక్షణ – ఆవశ్యకత

By   /  February 18, 2015  /  No Comments

    Print       Email

క్రమశిక్షణ – ఆవశ్యకత
కొన్ని కొన్ని పరిస్థితులలో మనం కొన్ని పదార్ధాలకు తీక్షణత లేదా అసాధారణమైన శక్తి కలగడాన్ని గమనిస్తూ ఉంటాం ఉదాహరణకి సామాన్య పదార్ధమైన గాలి అతి పీడనానికి లోనుచేయబడితే దానికి బండలను సైతం బ్రద్దలు చేసే శక్తి వస్తుంది. అంతటి శక్తివంతమైన ఆయుధంగా గాలిని మార్చగలిగే మానవుడు తన మనస్సుకు మాత్రం సవ్యమైన శిక్షణనివ్వడంలో విఫలం అవుతాడు ఆకారణం చేత మనస్సులో దౌర్భల్యం, చంచలత ప్రభలి దాని యొక్క తీక్షణత మరియు శక్తి లుబ్ధమౌతాయి. ఏ రీతిలో అయితే కొన్ని పోగుల దారములు కలిపి పేనితే తాడుగా మారి మదగజాన్ని సైతం బంధించగలావో అదే రీతిలో మనస్సుకు కూడా సరైన శిక్షణ ఇచ్చి బలాన్ని కలుగజేస్తే అనేక విషయాలలో చక్కని సామర్ధ్యాన్ని పెంపొందించవచ్చని శాస్త్రాలలో చెప్పబడినది.
దీని సారాంశం మానసిక క్రమశిక్షణ మాత్రమే సత్యాన్వేషణకు, కార్యసాధనకు ముఖ్యాంశం. మనస్సును ఇచ్చవచ్చినట్లు వదిలేసి ఇంద్రియాల శాశనానుసారం పరిగెత్తడం గొప్పనుకుంటుంటాం. స్వాతంత్ర్యం అంటే ఇష్టం వచ్చినట్లు చేయడం కాదు, స్వతంత్రత అనేది ఎల్లప్పుడూ ఆత్మసమ్యమాన్ని కలిగిస్తుంది. క్రమశిక్షణారాహిత్యం వల్ల మనస్సు క్రమక్రమంగా క్షీనిస్తూ చివరకు ఇహాపరాలకు రెంటికీ యోగ్యం కాకుండా పోతుంది. అందువల్ల మన మనస్సు యొక్క ఏకాగ్రతకు, సత్యం మార్గాన గమనమునకు క్రమశిక్షణ అతి ఆవశ్యకం. ఈ క్రమశిక్షణ మనకు వైధిక జ్ఞానం ద్వారా పెంపొందుతుంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Shailesh Lakhtakia’s Journey

Read More →