గురు శిష్యుల అన్యోన్యత
ఓం సహనావవతు; సహనౌ భునక్తు;సహవీర్యం కరవావహై,
తేజస్వినావధీతమస్తు; మా విద్వి షావ హై
ఓం శాంతిః శాంతిః శాంతిః
పై శ్లోకం కేనోపషిత్తులోని మొదటి మంత్రం.
దీనికి తాత్పర్యం చూసినట్లైతే ఈ రకంగా సాగుతుంది.
ఓంకార స్వరూపుడైన పరబ్రహ్మ మన ఇరువురినీ కాపాడుగాక మనలను పోషించుగాక మనమిరువుర౦ శక్తిని, తేజస్సుని పోందుదము గాక. ఈ అద్యాయనం మనిద్దరినీ తేజోవంతులను చేయుగాక మనం పరస్పరం విద్వేషరహితంగా ఉందుము గాక.
ఓం శాంతిః శాంతిః శాంతిః
ఈ శ్లోకంలో ఇద్దరం అన్న ప్రయోగానికి గురు శిష్యులు అని అర్ధం. ఋషి పరంపరలో పూర్వం విద్య అనేది గురు శిష్యుల అన్యోన్యతపైనా, అనురాగం పైనా ఆధారపడి ఉండేది. నెటికినీ విద్య లౌకికమైనా, ఆధ్యాత్మికమైనా ఇట్టి అన్యోన్యత ద్వారానే ఫల ప్రదమౌతుందని గ్రహించాలి సాధారణ నేర్పరితనానికీ నైపుణ్య పూర్వకమైన విద్యార్జనకూ తేడా కూడా ఈ అన్యోన్యతే అందువల్లనే బాల్యం నుండి మనకు విద్య నేర్పిన గురువులు, ఉపాద్యాయులలో కూడా కొందారినే మనం మనస్సులో నిలుపుకోవడానికి కారణం.
ఈ సామాజిక ఆవశ్యకతను వేల సంవత్సరాలనాడే గుర్తించిన మహనీయులైన ఋషి పూంగవులకు శతకోటి వందనాలు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.