ప్రతి ఇంటికీ వెళ్లండి
వైసీపీ నాయకులకు పిలుపునిచ్చిన వైయస్ జగన్
“ గడప-గడపకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జూలై 8 నుంచి 5 నెలల పాటు కొనసాగుతుంది. ప్రతి నాయకుడు మీ నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికీ వెళ్లండి. వాళ్లతో కనీసం 3 నిమిషాలైన గడపండి. ఏపీ సీఎం చంద్ర బాబు నాయుడు చేస్తున్న అవినీతి అక్రమాల గురించి చెప్పండి. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటాల గురించి వివరించండి. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏంటి? ఎన్ని నెరవేర్చాడు అనే దానిపై మీకు ఇచ్చిన ప్రజా బ్యాలెట్లో బాబుకు మార్కులు వేయించండి. అప్పుడు మీకే అర్థమవుతుంది చంద్రబాబుపై ఎంత వ్యతిరేక ఉందనేది. నాయకుడంటే ప్రజలతో, ప్రజల కోసం ఉండాలి అనేది మీరు చేసి చూపించగలిగితే మీ గెలుపునూఎవరూ అడ్డుకోలేరు“ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్‌రెడ్డి ఆ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. విజయవాడ బందరు రోడ్డులోని ‘ఎ’ కన్వెన్షన్‌లో జరిగిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి స్థాయి సమావేశంలో జగన్మోహన్రెడ్డి నాయకులకు, కార్యకర్తలకు దశ దిశ నిర్దేంచారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై కూడా తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. చంద్రబాబు నాయుడు తాను సంపాదించిన అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొంటున్నాడని, తాను మళ్లీ అధికారం కోసం ఇలా చేస్తున్నాడని జగన్ విమర్శించారు. డబ్బుతో అన్నీ కొనొచ్చని చంద్రబాబు భావిస్తున్నాడని, ప్రజల మనసును గెలుచుకున్నప్పుడు ఈ డబ్బులు గిబ్బులు పని చేయవనే విషయాన్ని బాబు గుర్తు పెట్టుకోవాలన్నారు. 2004 ఎన్నికల్లో బాబు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఆ మహానేత విజయాన్ని ఎవరూ ఆపలేకపోయారనే విషయాన్ని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. 294 సీట్లకు గాను టీడీపీ కేవలం 46 సీట్లు మాత్రమే వచ్చాయని, కనీసం డిపాజిట్‌కూడా దక్కలేదన్నారు. పార్టీ స్థాపించిన రోజున అమ్మా.. తాను కదిలామని, తర్వాత ప్రజల ఆశీస్సులతో ఇప్పుడు 67 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలకు ఎదిగామన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టడానికి, మనం దూరం కావడానికి కేవలం 5 లక్షలు ఓట్లు మాత్రమేనని, మనం కష్టపడితే అధికారం చేపట్టడం పెద్ద కష్టమేమీ కాదని కార్యకర్తలను ఉత్సాహపరిచారం.
చేయని వాళ్లకు చీపుర్లుచూపిస్తే తప్పేంటి?
చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని, రైతుల రుణమాఫీ కానీ, డ్వాక్రా సంఘాల రుణాలు కానీ, ఇంటికో ఉద్యగం కానీ.. నిరుద్యోగభృతి కానీ ఇవేవీ నెరవేర్చని చంద్రబాబుకు చీపుర్లు చూపిస్తే తప్పేంటని జగన్ మరోసారి చీపుర్ల గురించి ప్రస్తావించారు. రాజకీయాల్లో మార్పు రావాలంటే అలా చూపించాలన్నారు. ఇది ఒక్క చంద్రబాబు నాయుడుకే వర్తించదని, తనతో పాటు అందరి నాయకులకు వర్తిస్తుందన్నారు. ఎన్నికల ముందు కాపులను బీసీల్లో చేరుస్తానని మాట ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు చేయకపోడంతోనే ముద్రగడ పద్మనాభం దీక్ష చేస్తున్నారని, దీక్ష చేస్తుంటే బలంతంగా ఆస్పత్రికి తరలించడం ఎంతవకు సబబు అని బాబును ప్రశ్నించారు. సినిమాలో విలన్‌ను చూస్తే చంద్రబాబు గుర్తుకు వస్తారని, సినిమాలో ఉండే 14 రీళ్లలో 13 రీళ్ల వరకు విలన్ ఆధిపత్యం కొనసాగుతుందని, 14వ రీల్ వచ్చేసరికి క్లైమ్యాక్స్ వస్తుందని, అప్పుడు కథ అడ్డం తిరుగుతుందని, విలన్ జైలుకు వెళ్లితే హీరో రాజు అవతాడని బాబునుద్ధేశించి చెప్పారు. చంద్రబాబును ఇప్పుడు క్షమిస్తే వచ్చే ఎన్నికల్లో ప్రతి ఇంటికీ విమానం కొనిస్తానని కూడా చెబితే ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. కష్టాల్లో కూడా తనతో పాటు అడుగులు వేస్తూ ఇంతటి ఆప్యాయత చూపిస్తున్న ప్రజలకు తాను ఎప్పుడూ రుణపడిఉంటానని, రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలుతెలిపారు వైయస్‌జగన్.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.