Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

టీడీపీ బాట‌లోనే వైసీపీ!

By   /  April 25, 2016  /  Comments Off on టీడీపీ బాట‌లోనే వైసీపీ!

    Print       Email

ysrcp_ycpఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తెలుగుదేశం పార్టీ బాట‌లోనే వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ న‌డుస్తోంది. వాళ్లు చూపిన దారిలోనే వెళ్తోంది. గ‌తంలో ఎలాగైతే టీడీపీ అవినీతిపై పుస్త‌కాలు ప్ర‌చురించిందో.. ఇప్పుడు వైయ‌స్ఆర్‌సీపీ కూడా అలాగే అధికార పార్టీపై పుస్త‌కాలు ప్ర‌చురించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. దివంగ‌త వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ముఖ్య‌మంత్రి ఉన్న స‌మ‌యంలో రాష్ట్రంలో ఎక్కువ‌గా అవినీతి జ‌రుగుతోందంటూ తెలుగుదేశం పార్టీ వైయ‌స్‌పై  ` రాజా ఆఫ్ క‌ర‌ప్ష‌న్‌` పుస్త‌కాన్ని విడుద‌ల చేసి దాన్ని రాష్ట్రంతో పాటు జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద నాయ‌కుల‌కు ఇచ్చి దాన్ని విస్తృత‌స్థాయి ప్ర‌చారం క‌ల్పించారు. అలాగే వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చంద్ర‌బాబు అవినీతి అక్ర‌మాల‌పై పుస్త‌కం వేసేందుకు రంగం సిద్ధ‌చేసుకుంటోంది. రాజధాని అమరావతిలో చంద్రబాబు – ఇతర మంత్రులు అడ్డగోలుగా కొనుగోలు చేశార‌ని,  పట్టిసీమ- హెచ్ ఎన్ ఎస్ ఎస్; జీఎన్ ఎస్ ఎస్ – పోలవరం ప్రాజెక్టులో అంచనాల పెంపు – విద్యుత్ ప్రాజెక్టుల కుంభకోణాలు ఇలా అవినీతి – అక్రమాలకు పుస్తక రూపం ఇవ్వనున్న‌ట్లు తెలుస్తోంది.

కాగా వీటికి సంబంధించి పక్కా ఆధారాలు కూడా ఇందులో పొందుపరుస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ పుస్తకాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ – ప్రధాని నరేంద్రమోడీతో పాటు అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులకు అందజేయాలని జగన్ నిశ్చయించుకున్నార‌ని తెలుస్తోంది. ఈ పుస్త‌కంతో పాటు అక్రమంగా సంపాదించిన డబ్బుతోనే తమ పార్టీ  ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఖూనీ చేస్తున్నారని వారికి ఫిర్యాదు చేయనున్న‌ట్లు స‌మాచారం. కాగా నేడో.. రేపో వైయ‌స్ జ‌గ‌న్ త‌న ఎమ్మెల్యేల‌తో ఢిల్లీ వెళ్లి  రాష్ట్ర‌ప‌తిని, ప్ర‌ధానిని క‌ల‌వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ముల్లును ముల్లుతోనే తీయాల‌నే నీతిని జ‌గ‌న్ బాగా ఫాలో అవుతున్న‌ట్లు క‌నిపిస్తోంది.

InCorpTaxAct
Suvidha
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →