ఎడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి! పేరు వింటేనే ఒక మహానాయకుడు, యోధుడు గుర్తుకొస్తాడు! నిత్య కృషీవలుడు, రూపాయి డాక్టరుగా ఎంతో మంచి పేరు సంపాదించిన మహా మనిషి! 1978నుండి ఓటమేలేకుండా, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నిత్యం ప్రజాసేవలో తరించిన మానవోత్తముడు డాక్టర్ వైఎస్సార్!
రాజకీయ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మనోనిబ్బరంతో తెగువతో ఎదుర్కొని ప్రజాపక్షాన పోరాడిన యోధుడు వైఎస్సార్! ప్రాణానికి తెగించి 1600 వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల గుండె చప్పుడు విని, వారి కష్టాలను తెలుసుకొని వాటి పరిస్కారం కోసం కృషి చేసిన కృషీవలుడు డాక్టర్ వైఎస్సార్! పేదల ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి పేదల గుండెల్లో గుడి కట్టించుకున్న మహాత్ముడు డాకటర్ వైఎస్సార్!! జలయజ్ఞం, రైతు రుణ మాఫీ, పావలా వడ్డీ, ఫీజు రీయింబర్సుమెంట్, వృద్దాప్య పింఛన్లు ఒకటేమిటి తన హయాంలో 8కోట్ల ఆంధ్ర ప్రదేశ్ ప్రజల్లో ప్రతిఒక్కడికి ఏదో ఒక పథకంతో లబ్ది చేకూర్చిన మహానేత వైఎస్సార్! ఐదున్నరేల్ల తన పాలనలో ఒక్క సారంటే ఒక్క సారి కూడా బస్ చార్జీలు, కరెంట్ చార్జీలు పెంచని చేసిన ప్రమాణాన్ని తూచ తప్పక పాటించిన మాటతప్పని మడమతిప్పని ఉద్దండుడు వైఎస్ రాజశేఖర రెడ్డి!
డాక్టర్ వైస్ రాజశేఖర రెడ్డి – మనమధ్య పుట్టిన ఒక కోహినూర్ వజ్రం, ఒక అద్భుతం, తెలుగుజాతి చేసుకున్న సుకృతం! కోట్ల గుండెల్ని స్పృశించిన ఒక అమృత హస్తం. తెలుగు ప్రజలకి వైఎస్సార్ లాంటి నాయకుడు దొరకడం నభూతో నభవిష్యతే! ప్రజా సక్షేమానికి పలు బృహత్పధకాలను ప్రవేశపెట్టి నిర్విఘ్నంగా నిర్వహించిన ధీరుడు! తెలుగునేలని సస్యస్యామలం చేయడానికి జలయజ్ఞం చేసిన అపరభగీరధడు! సాటి మానవుడంటే ఆయనకున్న కరుణ, ప్రేమా అనంతం! అచంద్రార్కంగా నిలిచిపోయే ఆయన నాయకత్వ శైలి, సమస్యలకి వెన్నుచూపక మూలాల్లోకి సూటిగా చూడగలగిన ధైర్యం, నమ్మిన సిద్ధాంతం కోసం ఓడిపోవడానికి కూడా సిద్దపడగలిగే వ్యక్తిత్వం! తన ప్రాణానికి ప్రాణమైన తండ్రిని చంపిన హంతకులని కూడా క్షమించగలిగిన ఉన్నత హృదయం, ఎంతటి కఠినుడి మనసునైనా ఇట్టే గెల్చుకోగలిగిన చమత్కారి, శతృవుకి కూడా సాయపడగలిగిన మహా సంస్కారి! డాక్టర్ వైఎస్సార్ అనే మనిషిని వినగలిగి, చూడగలిగి, కలవగలగడం మనం చేసుకున్న అదృష్టం! ఆయన స్మృతులని నెమరేసుకోవడానికి ఆయన జయంతి, వర్ధంతి మనకిచ్చే రెండు సదావకాశాలు! డాక్టర్ వైఎస్సారుని ప్రేమించే ప్రతి మనిషి ఆయనాశయాలకోసం పునరంకితం అవ్వడమే ఆయనకిచ్చే ఘన నివాళి!
జోహార్ వైఎస్సార్!!
— గురవా రెడ్డి, అట్లంటా (కన్వీనర్ – వైఎస్సార్సీపీ ఎన్నారై కమిటీ)
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.