Loading...
You are here:  Home  >  USA News  >  Current Article

నాట్స్ సంబరాలు ఫండ్ రైజింగ్ కు విశేష స్పందన

By   /  January 7, 2015  /  No Comments

    Print       Email

LA_Fund Raising3

 

InCorpTaxAct
Suvidha

అమెరికాలో  ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగవైభవంగా నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తెలుగు సంబరాలకు నాట్స్ చేపట్టిన ఫండ్ రైజింగ్ కు భారీ స్పందన లభించింది. లాస్ ఏంజిల్స్ వేదికగా ఈ సారి తెలుగు సంబరాలను కన్నుల పండువగా జరిపేందుకు నాట్స్ నిశ్చయించుకుంది.  శాంటా ఆనా  లోని అనహెమ్ కన్వెన్షన్ సెంటర్ లో నాట్స్ తెలుగు సంబరాలు అంబరాన్నంటేలా జరగనున్నాయి. ఈ సంబరాల కోసం నిధుల సేకరించేందుకు లాస్ ఏంజిల్స్ లోని కాలిఫోర్నియాలో నాట్స్  ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. తెలుగు ప్రజలు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో నాట్స్ ఫండ్ రైజింగ్ కు విశేష స్పందన లభించింది.

జూలై 2,3,4 తేదీల్లో నిర్వహించే ఈ సంబరాల్లో పాల్గొనేందుకు మేముసైత మంటూ చాలా మంది తెలుగువారు ముందుకొచ్చారు. తమ విరాళాలను ప్రకటించారు.. నాట్స్ సంబరాలకు కిక్ ఆఫ్ ఈవెంట్ లా జరిగిన ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని డా. రవి ఆలపాటి, డా. వీరయ్య చుండు ల సారధ్యంలో జరిగిన ఈ  వేదికపై మొత్తం  2.15 మిలియన్ డాలర్ల ( షుమారుగా 13 కోట్ల రూపాయలు) విరాళాలను దాతలు ప్రకటించారు. ఇదే వేదికపై లాస్ ఏంజిల్స్ నాట్స్ తెలుగు సంబరాల టీంను నాట్స్ పరిచయం చేసింది. నాట్స్ లాస్ ఏంజిల్స్ సంబరాలకు  ఛైర్మన్ గా  ప్రముఖ వైద్యులు రవి ఆలపాటికి బాధ్యతలు కట్టబెట్టింది. అలానే నాట్స్ తెలుగు  సంబరాలు 2015 కన్వీనర్ గా డా. వీరయ్య చుండు,  సంబరాల కో ఛైర్మన్ కుమార్ కోనేరు, కో కన్వీనర్లుగా కిషోర్ కంఠమనేని, ప్రసాద్ పాపుదేశి, ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ గా వెంకట్ ఆలపాటి,  డిప్యూటీ ఛైర్మన్ గా చందు నంగినేని, కార్యదర్శిగా నందన్ పొట్లూరి, సంయుక్త కార్యదర్శిగా శ్యామ్ గుండాల లను నాట్స్ ప్రకటించింది.

నాట్స్  తెలుగు సంబరాలకు ప్రకటించింది కేవలం విరాళం కాదు.. పెట్టుబడి అని నాట్స్ తెలుగు సంబరాల కమిటీ ఛైర్మన్ డాక్టర్ ఆలపాటి రవి అన్నారు. నాట్స్ సంబరాలను దిగ్విజయం చేసేందుకు ఆ పెట్టుబడి ఉపయోగపడుతుందని అది మనందరికి సంతోషాన్ని పంచుతుందని తెలిపారు.  సంబరాల నిమిత్తం నిర్వహించే పోటీలు తెలుగు చిన్నారుల్లో ప్రతిభను వెలికితీయడంతో పాటు వారిలోని ఆత్మ విశ్వాసాన్ని పెంచుతాయని తెలిపారు. నాట్స్ సలహాదారు, శ్రేయోభిలాషి,  ప్రముఖ వైద్యులు డాక్టర్ ముక్కామల అప్పారావు  లక్ష డాలర్ల నాట్స్ తెలుగు సంబరాలకు విరాళంగా ప్రకటించారు. డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి 25 వేల డాలర్లను నాట్స్ సంబరాలకు  విరాళమిస్తున్నట్టు తెలిపారు. చాలా మంది తెలుగు ప్రముఖులు నాట్స్ తెలుగు సంబరాల్లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపిస్తూ విరాళాల వర్షం కురిపించారు.నాట్స్ తెలుగు సంబరాలకు వచ్చే విరాళాల ద్వారా సంబరాలను అంబరాన్నంటేలా నిర్వహించడంతో పాటు తెలుగు ప్రజల కోసం ఎలాంటి సేవా కార్యక్రమాలను చేపడుతున్నామనేది  సంబరాల కన్వీనర్  వీరయ్య చుండు వివరించారు. సంబరాల్లో ఏర్పాటు చేయబోయే కార్యక్రమాలను కూడా వీరయ్య చుండు తెలిపారు.  ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన  సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ప్రముఖ వ్యాఖ్యత, నటుడు ప్రదీప్ మాచిరాజు  వ్యాఖ్యనంతో పాటు సూపర్ సింగర్స్ 8  ఫేమ్ సాకేత్, స్థానిక కళాకారిణి కృతి  పాడిన పాటలు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరిలో జోష్ నింపాయి. నాలుగు గంటల పాటు సాగిన ఈ ఫండ్ రైజింగ్ ఆద్యంతం ఆనందంగా, ఆహ్లద భరితంగా సాగింది. కృష్ణ సూరపనేని, శరత్ కామినేని, డాక్టర్ ప్రేమ్ రెడ్డి, డాక్టర్ రవి మాకం, డాక్టర్ సదాశివరావు కట్టా, డాక్టర్ కలారి రమేష్, డాక్టర్ రంగారావు తాళ్లూరి, డాక్టర్ శేషగిరిరావుతో పాటు చాలామంది అమెరికాలో తెలుగు ప్రముఖులు నాట్స్ సంబరాల ఫండ్ రైజింగ్ కు తమ మద్దతు ప్రకటించారు. వీరితో పాటు, స్థానిక తెలుగు సంస్థలైన TASC (తెలుగు అసోసియేషన్ అఫ్ సదరన్ కాలిఫోర్నియా) , LATA (లాస్ ఆంజెల్స్ తెలుగు అసోసియేషన్ ) , IYANA (ఇండియన్ యూత్ అసోసియేషన్ నార్త్ అమెరికా),  సిలికానాంధ్ర (మనబడి ) తదితర సంస్థలు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందిచటానికి ముందు కొచ్చాయి.

తెలుగు సంబరాల నిర్వహణకు సంబంధించి అనేక విభాగాల వారీగా నాట్స్  కొందరికి బాధ్యతలు కట్టబెట్టింది. అమెరికాలో తెలుగుజాతి కోసం, నాట్స్ కోసం ఉత్సాహంతో ముందుకొచ్చే ప్రతి ఒక్కరిని నాట్స్ ఎప్పుడూ స్వాగతిస్తూనే ఉంటుందని నాట్స్ ఛైర్మన్ మధు కొర్రపాటి అన్నారు. నాట్స్ లాస్ ఏంజిల్స్ తెలుగు సంబరాల టీం… తెలుగు వైభవాన్ని సంబరాల్లో చూపెడుతుందని.. నాట్స్ ప్రెసిడెంట్ రవి అచంట అన్నారు.  సంబరాల నిర్వహణ కోసం విలువైన సూచనలు, సలహాలను నాట్స్ బోర్డ్ డైరక్టర్ శ్రీధర్ అప్పాసాని వివరించారు. నాట్స్ తెలుగు సంబరాలు నిర్వహించేందుకు నాట్స్ కు సంబంధించిన ప్రతి ఛాప్టర్ తమ విలువైన సేవలు అందించేందుకు ముందుకొచ్చాయి.. అమెరికాలో తెలుగువారి  కుటుంబ పండుగ మాదిరిగా ఈ సంబరాలను నిర్వహించేందుకు ఈ ఫండ్ రైజింగ్ సక్సెస్ తో నాట్స్ ఉత్సాహంగా అడుగులు ముందుకు వేస్తోంది.

 

LA_Fund Raising4 4F3A4589 4F3A4653 4F3A4763 4F3A4875  4F3A5049 LA_Fund Raising1 LA_Fund Raising2

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email
  • Published: 6 years ago on January 7, 2015
  • By:
  • Last Modified: January 7, 2015 @ 5:03 pm
  • Filed Under: USA News

Leave a Reply

You might also like...

Shailesh Lakhtakia’s Journey

Read More →