తస్మా దుత్తిష్ట కౌన్తెయ యుద్ధాయ కృతనిశ్చయః||
‘హతో వా ప్రాప్య్ససి స్వర్గం’ నీవు ఒకవేళ యుద్ధంలో మరణించినట్లైతే వీరస్వర్గాన్ని పోందుతావు. మనం ఈ రోజుకీ రాజపుత్రవీరులను, వారి వీరత్వాన్ని, గొప్పదనాన్ని ఏ విధంగా చెప్పుకుంటామో అదే విధంగా ‘జిత్యావా భోక్ష్యసే మహీమ్’ ఒకవేళ గెలుపొందినట్లైతే, ప్రపంచంలో గొప్ప ఆధిపత్యాన్ని పోందుతావు. ఆ విధంగా నీకు రెండు రకాలుగాను నష్టం వాటిల్లదు అని వీరులందరినీ ఉద్దేశించి చెప్పాడు. ‘తస్మా దుత్తిష్ట కౌన్తెయ’ అందువల్ల లేచి నిలబడు అర్జునా! ‘కౌన్తెయ’ అంటే కుంతి కుమారా! అర్జునా! అని, ‘యుద్ధాయ కృతనిశ్చయః’ యుద్ధం నుంచి విరమించుకోకుండా, సమస్యకు ఎదురు నిలుస్తానన్న కృత నిశ్చయంతో పరిస్తితిని ఎదుర్కో. లేచి నిలబడు. ఇంతకుముందు నేను చెప్పినట్లుగా అర్జునుడు యుద్ధ రంగంలో ఉన్నాడు. కానీ మనం , జీవితమనే యుద్ధంలో సమస్యలనే కౌరవుల ముందు ఉన్నాము. మన శక్తినంతా కూడగట్టుకొని ఈ సమస్యలను ఎదుర్కోవాలని యావత్ మానవాళికి తత్త్వబోధ చేస్తున్నది గీత. ఇది ఒక అర్జునికి మాత్రమే చెప్పింది కాదు.
మనిషిలో ధైర్యాన్ని, పౌరుషాన్ని నూరి పోస్తుంది గీత. అనంత జీవరాశిలో ఒక జీవుడిలాగా కాకుండా, మనిషికి తన ఔన్నత్యాన్ని చాటిచెప్పి తన చుట్టూ ఉన్న పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేటట్లు తీర్చిదిద్దుతుంది. దీనికంతకూ ఒక తత్త్వం కావలసి ఉంది. ఆ తత్త్వాన్ని శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు. ఇది అనుష్టానవేదాంతం. మనం దీనినే యోగం అంటున్నాం. ఇది జీవితం యొక్క యోగ మార్గం. కానీ యోగం అంటే ప్రాణాయామం, తలక్రింద, కాళ్ళు పైకి పెట్టే వ్యాయామం కాదు. జీవితసమరంలో ప్రతికూల పరిస్థితులను స్థైర్యంతో ఎదుర్కొని తద్వారా మనలోని దివ్యత్వాన్ని చేరుకోవడానికి మనలను సన్నద్దులను చేయడమే ఈ యోగం యొక్క ప్రధాన లక్ష్యం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.