Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

భ‌ద్రాచ‌లం ఆల‌యానికి రూ.100 కోట్లు

By   /  April 15, 2016  /  Comments Off on భ‌ద్రాచ‌లం ఆల‌యానికి రూ.100 కోట్లు

    Print       Email
DSC_0486భ‌ద్రాచ‌లం ఆల‌యానికి రూ.100 కోట్లు
సాగునీటిపై ప్ర‌తిప‌క్షాలవి అవ‌గాహ‌న లేని మాట‌లు
తెలంగాణ వ్యాప్తంగా కోటి ఎక‌రాలు నీళ్లు ఇస్తాం
విలేక‌రుల స‌మావేశంలో సీఎం కేసీఆర్‌
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని, అందులో భాగంగానే ఒక్కొక్క‌టిగా అన్నీ అభివృద్ధి చేసుకుంటూ పోతున్నామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు అన్నారు. శ్రీ‌రామ న‌వ‌మి సంద‌ర్భంగా శుక్ర‌వారం ముఖ్య‌మంత్రి స‌తీ స‌మీతంగా భ‌ద్ర‌చ‌లం వెళ్లి సీతారాముల క‌ల్యాణం కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ అంద‌రితో పాటు కిందే కూర్చున్న ముఖ్య‌మంత్రి క‌ల్యాణం మొత్తం  తిల‌కించారు. అనంత‌రం కేసీఆర్ విలేక‌రుల‌తో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. భ‌ద్రాల‌యం ఆలయ అభివృద్ధి కోసం రూ. 100 కోట్లు కేటాయిస్తామ‌న్నారు.  సాగునీటిపై ప్రతిపక్షాలు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నాయని, తెలంగాణ వ్యాప్తంగా కోటి ఎకరాలకు నీరందించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.
ఖమ్మం జిల్లాకు రెండు సాగునీటి ప్రాజెక్టులు మంజూరయ్యాయని వెల్లడించిన ముఖ్యమంత్రి సీతారామ ప్రాజెక్టు పూర్తయ్యాక అద్భుతాలు జరుగుతాయని పేర్కొన్నారు. భద్రాచలం ఆలయ అభివృద్ధిపై చినజీయర్‌స్వామితో మాట్లాడ‌తాన‌ని ఆల‌యాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసేందుకు కృషి  చేస్తాన‌న్నారు. ప్ర‌జ‌లు త‌న‌పై పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని వ‌మ్ముచేయ‌న‌ని స్ప‌ష్టం చేశారు.
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →