Loading...
You are here:  Home  >  Spiritual  >  Current Article

మను చరిత్రము కథ, పద్యాల సొగసులు – Chapter 15

By   /  May 19, 2015  /  No Comments

    Print       Email

ఎక్కడియూరు కాల్ నిలువకింటికిఁ బోయెద నంచుఁ బల్కెదీ

వక్కట, మీకుటీరనిలయంబులకున్ సరిరాకపోయెనే

InCorpTaxAct
Suvidha

యిక్కడి రత్నకందరము లిక్కడి నందన చందనోత్కరం

బిక్కడి గాంగసైకతము లిక్కడి యీ లవలీ నికుంజముల్    

 

ఊరు, ఊరని పలవరిస్తున్నావు. అదేం ఊరయ్యా? కాలునిలబడకుండా ఉంది! ఇంటికిపోతానంటావు. ఇక్కడి మా మణిమయములైన గుహలూ, ఈ ఉద్యానములందలి మంచి గంధపుచెట్లూ, ఇక్కడి గంగానదదీ తీరాన ఉన్న ఇసుకతిన్నెలూ, వెన్నెల తీగెల పొదరిళ్ళూ, మీ గుడిసెకొంపలకి సరిరావా ఏమిటి?

 

అంధునకు గొఱయె వెన్నెల

గంధర్వాంగనల పొందు గాదని సంసా

రాంధువునఁ బడియె దకట, ది

వాంధము వెలుఁగు గని గొంది నడఁగిన భంగిన్.

 

అయ్యో (అకటా)! గ్రుడ్డివానికి వెన్నెల ఎలా పనికి వస్తుంది? పగటిపూట వెలుతురు చూడలేని గుడ్లగూబ (దివాంధము) కలుగులో (గొందిన్) దూరి దాక్కున్నట్లు (అడగిన భంగిన్) – గంధర్వాంగననైన నాతో సంభోగం కాదని సంసారమనే నూతిలో (సంసార+అంధువునన్) పడతానంటావేమిటి?

వరూధిని ఎంతగా బ్రతిమాలినా, ప్రలోభపెట్టినా ప్రవరుడు లొంగలేదు.

 

ప్రాంచద్భూషణ బాహుమూలరుచితోఁ బాలిండ్లు పొంగార బై

యంచుల్ మోవఁగఁ గౌగలించి యధరం బాసింప “హా! శ్రీహరీ”

యంచున్ బ్రాహ్మణుఁ డోరమో మిడి తదీయాంసద్వయం బంటి పొ

మ్మంచున్ ద్రోచెఁ, గలంచునే సతులమాయల్ ధీరచిత్తంబులన్

 

వరూధినికి మోహం ఉప్పొంగిపోయింది. కామంతో పొంగారిన కుచాగ్రభాగాల్ని తగిలిస్తూ   వరూధిని ప్రవరుని కౌగిలించి ముద్దుపెట్టుకోబోగా, అతడు “హా, శ్రీ హరీ!” అంటూ పెడమొహంతో (ఓరమోమిడి) “పో” అని తన మునివ్రేళ్ళతో ఆమెభుజాల్ని – త్రోయడానికి ఎంత అవసరమో అంతమాత్రమే వ్రేళ్ళు ఆనించి అని – త్రోసేశాడు. స్త్రీల కపటకృత్యాలు ధీర చిత్తులయిన వారి మనస్సులని కలత పెట్టగలవా? లేవు అని అర్థం.

ఆమె చివరి ప్రయత్నంగా అతనితో ఇలా అంది.

 

వెలిపెట్టిరే బాడబులు పరాశరుఁ బట్టి

     దాశకన్యాకేళిఁ దప్పుసేసి

కులములో వన్నె తక్కువ యయ్యెనే గాధి

     పట్టికి మేనక చుట్టఱికము

ననుపుకాఁడై వేల్పు నాగవాసముఁ గూడి

     మహిమ గోల్పడియెనే మాందకర్ణి

స్వారాజ్య మేలంగ నీరైరె సుర లహ

     ల్యా జారుఁడైన జంభాసురారి

 

వారికంటెను నీమహత్త్వంబు ఘనమె

పవన పర్ణాంబు భక్షు లై నవసి యినుప

కచ్చడాల్ గట్టుకొను ముని మృచ్చులెల్ల

తామరస నేత్రలిండ్ల బందాలు గారె.

 

ఏమయ్యా, పరాశరుడు దాశరాజు కూతురు సత్యవతితో కూడినందుకు మీ బ్రాహ్మణులు ఏమైనా అతన్ని తప్పుబట్టి వెలివేశారా? మేనకరితో చుట్టరికం పెట్టుకున్నందుకు విశ్వామిత్రుడికి కులంలో వన్నెతగ్గిందా? అనేకమంది అప్సరసలమేళంతో సంభోగించినా మాందకర్ణి తన మహిమ ఏమాత్రమైనా కోల్పోయాడా? అహల్యకోసం విటుడుగా మారిన ఇంద్రుణ్ణి దేవతలు స్వర్గలోకం ఏలనీయం అన్నారా? లేదే?

వాళ్ళందరికన్నా నువ్వు గొప్పవాడివా? గాలి (పవన) ఆకులు (పర్ణ) నీరు (అంబు) మాత్రమే సేవించి కృశించిపోయి, ఇనుపగోచీలని (ఇనుప కచ్చడాల్) కట్టుకొనే దొంగమునులందరూ, మా అందగత్తెల ఇళ్ళలో బందీలుగా పడిఉండేవారే కదా !!

బాలాంత్రపు వేంకట రమణ

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Shailesh Lakhtakia’s Journey

Read More →