Loading...
You are here:  Home  >  Spiritual  >  Current Article

మను చరిత్రము కథ, పద్యాల సొగసులు : స్వరోచి జననం

By   /  February 19, 2015  /  No Comments

    Print       Email

స్వరోచి జననం

 

InCorpTaxAct
Suvidha

ప్రవరుడు వరూధినిని అలా తిరస్కరించి వెళ్ళాకా, ఆమె భరించలేని విరహవేదన పాలయింది. ఆమె చెలికత్తెలు ఆమెకి ఉపశమనం కలిగించడానికి శతవిధాలా ప్రయత్నించారు, కానీ ఉపయోగం లేకపోయింది. ఆమెకి దుఃఖం పొంగి పొంగి పొరలసాగింది.

 

ఇలా ఉండగా, అంతకుపూర్వం వరూధినిని మోహించి ఆమెచే తిరస్కృతుడైన ఒక గంధర్వుడున్నాడు. అతడు, ప్రవరుడు-వరూధినీల మధ్య జరిగిన ప్రహసనాన్నంతా గమనించాడు. వరూధిని విరహాన్నంతా తిలకించాడు. అతనికి తన చిరకాల వాంఛ తీరే మార్గం కనిపించింది.

 

అతడు కామరూపవిద్యాప్రభావంతో ప్రవరుడిరూపాన్ని ధరించి, వరూధిని కంటబడ్డాడు. ఆమె వెంటనే మహోత్కంఠతతో ఆ మాయాప్రవరుడి వద్దకు వెళ్ళి అతిదీనంగా తన కోరికని తీర్చమని ప్రార్థించింది.

 

గంధర్వుడు కూడా తన చిరకాలవాంఛ నెరవేరుతున్నందుకు మదిలో పరమానందభరితుడై, పైకి మాత్రం బలవంతాన ఆమె కోరికని తీరుస్తున్నట్టు నటిస్తూ, ఆమెకి కొన్ని షరతులు విధించాడు. అవేమిటంటే: ఒకటి, సంభోగసమయంలొ నువ్వు కళ్ళుమూసుకొని ఉండాలి. (ఎందుచేతనంటే, మరణసమయంలోనూ, సంభోగసమయంలోనూ కామరూపమహిమతొలగిపోయి, నిజరూపం వచ్చేస్తుందిట – అందుకే గంధర్వుడు ఈ నియమం పెట్టాడు. పైకి మాత్రం “ఇది మాదేశ ఆచారం” అన్నాడు).

 

ఇక రెండవ షరతు ఏమిటంటే “నేను నిన్ను సమ్మతింపచేసి వెళ్ళేదాకా నువ్వు నన్ను విడువకూడదు” అని. అతడు తనని అనుగ్రహిస్తే చాలు అదే మహద్భాగ్యం అని భావిస్తున్న వరూధిని ఆ మాయాప్రవరుడి షరతులకి వెంటనే అంగీకరించేసింది. ఆ తరవాత వారిరువురూ చాలాకాలం మన్మథ సామ్రాజ్యంలో ఓలలాడి సుఖించారు.

 

కొంతకాలానికి వరూధిని గర్భవతి అయింది. మాయాప్రవరుడు ఇకపై తన ఆటలుసాగవని గ్రహించి, వరూధినికి తన కపటనాటకం తెలిసిపోతే శపిస్తుందని ఎలాగో ఆమెను ఒప్పించి చల్లగా తన దారిన తాను జారుకున్నాడు.

పాపం వరూధిని తనతో ఇన్నాళ్ళూ కాపురం చేసింది ప్రవరాఖ్యుడే అన్న భ్రమలోనే ఉండిపోయింది.

..To be continued

బాలాంత్రపు వేంకట రమణ

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

AMANA – Andhra Pradesh Muslim Association of North America

Read More →