Loading...
You are here:  Home  >  Community News  >  Telugu Community News  >  Current Article

మను చరిత్రము కథ, పద్యాల సొగసులు – Chapter 5

By   /  May 4, 2015  /  No Comments

    Print       Email

శోభనంనాటిరాత్రి మనోరమ అన్యమనస్కంగా ఉండడం చూసి, స్వరోచి కారణం అడిగాడు. అందుకు ఆమె “ప్రాణనాథా, అక్కడ అడవిలో నా ప్రియతమ చెలికత్తెలిద్దరూ దుర్భరమైన క్షయరోగంతో బాధ పడుతూంటే, ఇక్కడ నేను నీతో సుఖాలెలా అనుభవించగలను?” అని దుఃఖంతో పలికింది. వెంటనే స్వరోచి మనోరమని తీసుకొని అరణ్యానికి వెళ్ళి, ఇందీవరాక్షుడివద్ద నేర్చుకున్న ఆయుర్వేదవిద్యా ప్రభావంతో, మనోరమ సఖులైన కళావతి, విభావసిలకు చికిత్సచేసి, వాళ్ళని సంపూర్ణ అరోగ్యవంతురాళ్ళగా చేశాడు. దానితో ఆ ఇరువురు కన్యలూ తమ పూర్వపు సౌందర్యాన్ని తిరిగి పొంది, తమ దగ్గఱ వున్న దివ్య గంధర్వ విద్యల్ని అతనికి ఇచ్చి, తమని కూడా పరిణయమాడమని కోరారు. స్వరోచి మనోరమ సమ్మతితో వారిరువురినీ వివాహమాడాడు.

 

InCorpTaxAct
Suvidha

స్వరోచి అటుపిమ్మట తన ముగ్గురు భార్యలతో చాలా కాలం సర్వ సుఖాలనీ అనుభవించాడు.

 

ఒకనాడు స్వరోచి వేటకి వెళ్ళి, అక్కడ ఒక అడవి పందిని చంపబోగా, ఒక ఆడులేడి ఎదుటికివచ్చి “రాజా, దానిని చంపకు దాని వలన నీకు ప్రయోజనం లేదు. నన్ను చంపు” అని మనుష్యభాషలో పలికింది. స్వరోచి ఆశ్చర్యచకితుడై “నేను నిన్ను ఎందుకు చంపాలి?” అని అడిగాడు. అప్పుడు ఆ లేడి “ఇతర అంగనలతో సుఖిస్తున్న వానిని కోరడం కన్నా, చావడమే మేలు కదా!” అంది. “నువ్వు ఎవరిని మోహించావు?” అని అడిగాడు. “నిన్నే!” అంది లేడి.

స్వరోచి విభ్రాంతుడై “నేను మానవుడిని, నువ్వు మృగానివి. అదెలా సాద్యం?” అని అడిగాడు. అంతట ఆ లేడి “నువ్వు నన్ను కౌగలించుకో, అదే చాలు” అంది. స్వరోచి ఆ లేడిని కౌగిలించుకోగానే, ఆ లేడి ఒక అధ్బుతసౌందర్యవతియై అతని ఎదుట నిలిచింది. అతనితో “ఓ రాజా! నేను ఈ వనదేవతని. సమస్తదేవతలూ నీవలన మనువుని కనాలి అని నన్ను ప్రార్థించగా, ఇలా వచ్చాను. నువ్వు అదృష్టవంతుడివి. నన్ను అంగీకరించు” అని చెప్పింది. స్వరోచి పరమానంద భరితుడై, మిగతా ముగ్గురి భార్యల అంగీకారంతో, ఆమెని భార్యగా స్వీకరించాడు.

 

***

 

కొన్నిదినాలకి ఆ వనదేవత గర్భంధరించి, నవమాసాలు నిండిన పిదప ఒక చక్కని కుమారుణ్ణి కంది. అతనికి “స్వారోచిషుడు” అని నామకరణంచేశారు. అతడు సకల సద్గుణసంపన్నుడై, సమస్తవిద్యలనీ అభ్యసించి, యుక్తవయసులోనే శ్రీ మహావిష్ణువు గుఱించి ఘోరమైన తపస్సు చేశాడు. శ్రీ హరి ప్రత్యక్ష్యమైనాడు.  స్వారోచిషుడు అనేక విధాల శ్రీమన్నారాయణుని స్థుతించి, మోక్షాన్ని ప్రసాదించమని వేడుకున్నాడు. అందుకు ఆ భక్తజనావనుడు “నువ్వు కోరినట్ట్లే మోక్షం ఇస్తాను. కానీ కొంతకాలం ద్వితీయ మనువువై భూమిని పాలించి, నీతినీ, ధర్మాన్నీ చక్కగా ధరలో నెలకొల్పు” అని ఆనతినిచ్చాడు.

 

స్వారోచిషుడు దామోదరుని ఆఙ్ఞ ప్రకారం రెండవ మనువై సకల ధరామండలాన్నీ పాలించాడు. ధర్మసంస్థాపన చేశాడు. అతని పాలనలో సమయానికి వానలు కురిశాయి. పంటలు పుష్కలంగా పండాయి. ప్రజలు సంతానవంతులై, భోగ భాగ్య సంపదలతో సంపూర్ణాయుస్కులై జీవించారు. అగ్నివల్లా, చోరులవల్లా భయంలేకుండెను. వ్యాధులు లేకుండెను. పళ్ళు, పాలు, సుగంధద్రవ్యాలూ, పుష్పాలూ సమృద్ధిగా లభించాయి. ప్రజలు ఈతి బాధలు, అకాలమరణాలు లేకుండా తామరతంపరలుగా వృద్ధిచెందారు.

 

ఫలశ్రుతి.

 

ఈ స్వారోచిషమనుచరిత్రమును కోరికతో విన్నా, వ్రాసినా, చదివినా, ధనధాన్య-అరోగ్యాదులు కలిగి సంతానవంతులై, పిదప నిశ్చయంగా దేవత్వాన్ని పొందుదురు.

 

పూర్వం మార్కండేయుడు ప్రియశిష్యుడైన క్రోష్టి అనే మునికి చెప్పిన ఈ పుణ్యచరిత్రను పక్షులు జైమినికి చెప్పాయి.

 

ఇదీ “స్వరోచిషమనుసంభవం” యొక్క కథాసంగ్రహము..

—                                           —                                           —

బాలాంత్రపు వేంకట రమణ

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Shailesh Lakhtakia’s Journey

Read More →