Loading...
You are here:  Home  >  Spiritual  >  Current Article

మహా శివరాత్రి

By   /  February 16, 2015  /  No Comments

    Print       Email

 

త్రిపురాంతక త్రిదశేశ్వర గణనాయక శివ తే

InCorpTaxAct
Suvidha

శరణం భవ కృత సాగర ఫణికంకణచరణమ్|

వృషవాహన విషదూషణ పతితోదర శరణం

శివ శంకర శివ శంకర హర మే హర దురితమ్||

శివరాత్రిని శాస్త్రోక్త విధానంలో నాలుగు విధాలుగా చెపుతారు.

1.నిత్య శివరాత్రి: ప్రతి పగలు రాత్రి నిష్టతో పరమశివ పూజనం చేసినట్లైతే ఆది నిత్య శివరాత్రిగా చెప్పబడుతుంది.

2.మాస శివరాత్రి మనకు తెలిసినదే, ప్రతి నెలా బహుళ చతుర్ధశి నాడు ఉపవాస దీక్షతో కల్పోక్త విధానంగా పరమ శివున్ని ఆరాధించాలి.

౩.యౌగిక శివరాత్రి అనగా సోమవారం నాడు ఆమావాస్య తిధితో కూడిన చతుర్ధశి రోజున ఉపవాసం ఉండి శివారాధన చేయడం.

4.మహా శివరాత్రి
అర్ధరాత్రియుతా యత్ర మాఘకృష్ణచతుర్ధశీ|
శివరాత్రివ్రతం తత్ర సోశ్వమేథఫలం ప్రాజేత్||

పై ప్రమాణం ప్రకారం మాఘమాసంలో కృష్ణ చతుర్ధశి రోజున వచ్చేది మహాశివరాత్రి. బ్రహ్మ విష్ణువుల మధ్య కలహ నివారనార్ధం పరమ శివుడు జ్యోతిర్లింగ స్వరూపంగా ఆవిర్భవించిన రోజు. క్షీరసాగరమధనవేళ మహాదేవుడు కాలకూటవిషాన్ని స్వీకరించినది కూడా ఈ రోజే కావడం విశేషం.

మహాశివరాత్రి రోజున చేయవలసిన విధులు:

1.ఉపవాసం: భక్తి లేకుండా నిరాహారంగా రోజంతా గడిపినట్లైతే అది ఉపవాసమనిపించు కోదు. జీవాత్మను పరమాత్మ సన్నిధికి తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నించండి. మన మనస్సు, మాట, చేష్ట సమస్తమూ పరమ శివున్ని గురించే ఆలోచించాలని, మరో భావనకు చోటివ్వరాదని ఆగమ శాస్త్రం తెలియజేస్తుంది. జీవాత్మ పరమాత్మల ఐఖ్యావాసమే ఉపవాసం.

2.జాగరణ౦: శివ భక్తి సాధనలో మోక్షగాములెందరో, మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము అనే అంతఃకరనాలు నాలుగింటినీ శివభావాత్మకాలుగా జాగృతం చేసి జీవచైతన్యాన్ని విశ్వచైతన్యంలో ఐఖ్యం చేయడమే జాగరణ౦.

3.అభిషేకం: పరమేశ్వర జ్యోర్లింగ ఉద్భవమ్ పైన చెప్పుకున్నట్లుగా మహాశివరాత్రి నాటి అర్ధరాత్రి సంభవించిందని, ఆ సమయంలో బ్రహ్మాధిదేవతలందరు పరమశివుని అనంతకోఠి బ్రహ్మాండ నాయకునిగా పట్టాభిషిక్తుడిని గావించిన సమయంలో అభిషేకం నిర్వహించిన కారణంగా మనం కూడా ప్రతి మహాశివరాత్రికి అభిషేక విధిని నిర్వహిస్తాం.
-సప్తగిరి మాసపత్రిక సౌజన్య౦తో.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

AMANA – Andhra Pradesh Muslim Association of North America

Read More →