ఇంతవకు బోధించిన బొధను నీవు పాటించలేకపోయినా, లక్ష్యమును చేరుటకై నీవు చేయదగ్గది ఒకటి గలదు.
అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే|
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం||9-22||
నన్ను ఆరాధిస్తూ, నన్నే ధ్యానిస్తూ, నేను తక్క ఇతరమును కోరకుండా, నిరంతరముగా నన్నే ఆరాధించే మానవుల యోగ క్షేమముల బాధ్యతను నేను వహించెదను.
ఈ వాక్యము ద్వారా భగవానుడు అర్జునునకు ఈ విధమగు హామీనిచ్చుచున్నాడు:
నీ మనస్సు రాగద్వేషములతో నిండియుండుట చేతనే ఈ బోధను నీవు తెలుసుకొనలేక పోవుచున్నావు.నీవు రాగద్వేషముల పట్టును సడలించుకొనదగును. నీ జీవితమును నాకు సమర్పించుము. నేనే సర్వమునకు కారణమనే సత్యమును గుర్తించుము. కర్మల ఫలములనిచ్చువాడను (కర్మఫలదాత) నేనేనని గుర్తించుము. కర్మలను చేయుట వరకు మాత్రమే నీకు యోగ్యత (అధికారము) గలదు. కర్మల ఫలమును ఇచ్చేది నేను. నీవు నన్ను గుర్తించినా, గుర్తించకపోయినా , నీ కర్మలను బట్టి నీకు అర్హమైనదానిని మాత్రమే నేను నీకు ఇచ్చెదను. ఫలములు వచ్చుచుండగా వాటిని స్వీకరించుము. కర్మలను చేయు సమయములో నన్ను ధ్యానించుము కర్మను పూర్తి చేసిన తరువాత కూడ నన్నే ధ్యానించుము. నీ యోగక్షేమముల బాధ్యతను నేను వహించెదను.
మనము జీవితములో సాధించగోరే సర్వమును యోగము,క్షేమము అనే రెండు వర్గములుగా వుభజించవచ్చును. మనవద్ద లేనిదానిని పొందుట (అప్రాప్తస్య ప్రాపణం) యోగమనబడును. ఒక వ్యక్తి ఒక వస్తువును పొందగోరి, దానిని పొందలేక పోయిన కారణముగా దుఃఖితుడగుచున్నాడు. ఇది యోగమునకు సంబంధించిన సమస్య. మనవద్ద ఇదివరకే ఉన్నదానిని రక్షించుకొనుట (ప్రాప్తస్య రక్షణం) వేమమనబడును. ఒక వ్యక్తి తన కొడుకు ప్రమాదములో చిక్కుకున్నందులకు దుఃఖితుడైనాడు.ఇది క్షేమమునకు సంబంధించిన సమస్య. జీవితములో మూడవ రకమునకు చెందిన దుఃఖము లేదు. మనము ఒక వస్తువు కావాలని కోరుతాము, లేదా ఉన్నదానిని పోగొట్టుకొనకూడదని కోరుకుంటాము. ఈ యోగక్షేమముల వెంటబడుటలోనే సంసారి జీవితము గడిచిపోవును. ఈశ్వరుడే కర్మ ఫలదాతయని గుర్తించి, ఎవరైతే ఈశ్వరుని శరణువేడి యున్నారో, వారికి ఈ రెండు అవసరములను తాను భద్రపరిచెదనని భద్రపరిచెదనని భగవానుడు అర్జునునకు హామీనిచ్చుచున్నాడు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.