మా బడి (ఓ ప్రవాసుని అంతరంగం)
అర్ధశతాబ్దమవుతున్నా ఆ అనుభూతులింకా నిత్యనూతనమే,
అమెరికా, ఆస్ట్రేలియ, ఎన్నిదేశాలు తిరిగినా ఆ మట్టివాసన ఇంకా చిరపరిచితమే.
పొట్టిలాగు, గళ్ళచొక్కావేసుకొని
ఓ చేతిలో పుస్తకాలసంచి
మరోచేతిలో కేరేజి పట్టుకుని
దోస్తులతో కబుర్లాడుతూ
కాళ్లకు చెప్పులైనా లేకుండా
రెండుమూడుమైళ్ళు నడచి
బడికి రావడంలోని అనుభూతి
ఇప్పుడు తిరిగే ఎ.సి. కార్లలో
రమ్మన్నా వస్తుందా?
తెలుగు మాష్టారి విద్వత్తు,
డ్రాయింగ్ మాష్టారి వాత్సల్యం,
సైన్స్సర్ ధారణాపటిమ,
హెడ్మిస్ట్రెస్ నిర్ణయాత్మకత,
సానుకూల దృక్పధమే గదా!
నేటి నా విజయాలకు స్ఫూర్తి, పునాది.
మట్టినేల నేడు కాంక్రీట్ అయినా
పెంకుటి క్లాస్‌రూమ్‌లు
పక్కాభవనాలయినా
కబడ్డీ, కోతికొమ్మచ్చి స్థానే
క్రికెట్, రగ్బీలు చోటుచేసుకున్నా,
నాబడి, నా బడే
ఇటచేరితే చాలు నాకు
తల్లివడిలో సేదతీరినట్లే.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.