
ఆయన నిరాహార దీక్ష చేస్తున్నది తుని ఘటనలో నేరస్తులుగా పేర్కొని,అరెస్ట్ చేసిన వారందరినీ విడుదల చేయమని!ముద్రగడ పద్మనాభం గారు నిజాయితీపరులు,నిబద్ధతకల నాయకుడు.అందులో ఏ మాత్రం సందేహం లేదు.అయితే ఆయనకు ఒక ఉద్యమాన్ని దీర్ఘకాలం నడిపే దక్షత లేదని ఇటీవల సంభవించిన పరిణామాలు తెలియచేస్తున్నాయి.
తుని సంఘటన వలన ఉద్యమం సైడ్ ట్రాక్ అయింది.అరెస్ట్ అయిన అందరినీ బైల్ మీద వదిలివేయగానే దీక్ష విరమిస్తామని ఆయనే చెప్పాడు. ఆయన మొదటి సారి దీక్ష చేపట్టినప్పుడు వచ్చిన స్పందన ,ఈసారి అంతగా రాలేదు!మరొకసారి దీక్ష చేపడితే ఎవరూ పట్టించుకోరేమో!కిర్లంపూడిలో ఆయన నిరాహార దీక్ష విరమించే అవకాశముందంటూ స్వయానా ఆయన వియ్యంకుడు వ్యాఖ్యానించడం గమనార్హం.ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.అక్కడే ఆయన దీక్షను కొనసాగిస్తున్నారు. నాలుగు,అయిదు రోజుల క్రితమే ఆయనకు సెలైన్, ఫ్లూయిడ్స్ ఎక్కించేయడంతో, నైతికంగా ఆయన దీక్ష విరమించేసినట్లేనని నా అభిప్రాయం.
ముద్రగడ సన్నిహితులు మాత్రం ఆయన దీక్ష విరమించలేదని చెబుతున్నారు.సెలైన్, ఫ్లూయిడ్స్ ఎక్కించుకొని చాలారోజులు దీక్ష చేయొచ్చు!గతంలో కేసీర్ అలానే చేసారు.ఇక్కడ చెప్పుకోదగ్గ మరొక ముఖ్య అంశం-ఆయన ఆరోగ్యం మీద ప్రభుత్వం విడుదల చేస్తున్న బులిటెన్లు. ఒక క్రానిక్ డయాబెటిక్ పేషెంట్ యొక్క సుగర్ లెవెల్స్ ఇన్నిరోజులు తర్వాత కూడా సాధారణ స్థాయిలో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.ప్రభుత్వ వైద్యులు విడుదల చేస్తున్న బులిటెన్లు తప్పుడివా?సరైన సమాచారం కుటుంబ సభ్యులు ఇవ్వవచ్చు కదా!కుటుంబ సభ్యులు కూడా ప్రభుత్వ వైద్యుల ప్రకటనలను విశ్వాసంలోకి తీసుకుంటున్నారనే భావించాలి! ఇన్ని రోజులపాటు నిరాహార దీక్ష చేయడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తే తప్ప ఇలాంటి దీక్షలు సాధ్యం కావన్నది ప్రజల్లో వినిపిస్తున్న వాదన. అసలు రాజమండ్రి ఆసుపత్రిలో ఏమి జరుగుతుందో ప్రజలకు తెలియదు.ముద్రగడ కుటుంబ సభ్యులు కూడా పూర్తి నిజాలు వెల్లడించటం లేదు.మొత్తమ్మీద ముద్రగడ దీక్ష కాపుల రిజర్వేషన్ కోసం కాకుండా, ఆ రిజర్వేషన్ల కోసం జరిగిన పోరాటంలో భాగంగా చోటు చేసుకున్న తుని సంఘటనలో అరెస్ట్ అయినా వారిని విడుదల చేయటంతో ముగుస్తుంది.
ముఖ్యమైన అంశం మూల పడిపోతుంది. గుజరాత్ లోని పటేళ్ల ,హర్యానాలోని జాట్ల, మరొక చోట గుజ్జర్ల ఉద్యమాలు కూడా నీరుకారాయి.ఇక కాపు నాయకులుగా చెప్పుకొని హైదరాబాద్ నుంచి ప్రకటనలు గుప్పిస్తున్న వారి మీద కాపు యువతకే నమ్మకం ఉండదేమోనాని నా అభిప్రాయం!కనీసం వారు దీక్ష జరుగుతున్న స్థలానికి వచ్చి తమ సంఘీభావం తెలపాలి.ఎవరి వ్యాపార హడావిడిలో వారు ఉన్నారు.అదీకాక,వీరిలో అంబటి రాంబాబు లాంటి ఒకరిద్దరికే ప్రజా ఉద్యమాలతో సంబంధం ఉంది.మిగిలిన వారు పేపర్ పులులే!అత్యంత రహస్యంగా ముద్రగడ పద్మనాభం దీక్ష జరుగుతుండడం చూస్తుంటే ప్రజలకు చాలా సందేహాలు కలుగుతున్నాయి! ప్రభుత్వం వేసిన ఉచ్చులో ఆయన పడిపోయాడు!మెయిన్ డిమాండ్ ను వదలి ,ప్రక్కదారి పెట్టినప్పుడే ఉద్యమం నీరుగారింది!మనం కొత్త కోరికల కోసం ఆందోళనలు చేస్తుంటే ,ఉన్న హక్కులను లాక్కోవటం ప్రభుత్వాల,యాజమాన్యాల వ్యూహం.కొత్త కోరికల సంగతి మరచిపోయి,ఉన్న హక్కులని restore చేయమని పోరాడి అలసిపోతాం!అవి సాధించటమే విజయంగా భావిస్తాం!ఇక కొత్త కోరికల ఊసు ఎత్తే ఓపిక ఉండదు.ట్రేడ్ యూనియన్స్ ఉద్యమాల్లో పాల్గొన్నవారికి ఇవి అనుభవాలే! ఒక ఉద్యమాన్ని సమర్ధవంతంగా నడపటానికి నాయకుడికి దీక్ష ,దక్షతతో పాటుగా సుదీర్ఘ వ్యూహం ఉండాలి!ఈ ఉద్యమాన్ని నడిపే వారికి ఆ వ్యూహం లేదాని చెప్పొచ్చు!అయితే,కాపుల reservation అంత తేలికయిన విషయం కాదు!దానికి చాలా ప్రాసెస్ ఉంది.అది అనుకున్నంత తొందరగా రాదు!అసలు వస్తుందో రాదో?కాపులకు reservation ఇస్తానని,వారిని బీసీలలో చేరుస్తానని ఆచరణయోగ్యం కానీ హామీని ఇచ్చిన చంద్రబాబు 2019 ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకుంటాడు.అదే ముద్రగడ దీక్షకు ఫలితం!
టీవీయస్.శాస్త్రి
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.