Loading...
You are here:  Home  >  Community News  >  Telugu Community News  >  Current Article

మూడు రకముల భక్తులు

By   /  April 28, 2015  /  No Comments

    Print       Email

మూడు రకముల భక్తులు గలరు. ఆపదలో చిక్కుకున్న భక్తుడు ఆర్తభక్తుడు. లాభాపేక్షలోనున్న భక్తుడు ఆర్థార్థి. ఈశ్వరుని తెలియగోరు భక్తుడు జిజ్ఞాసువు. వీరందరికీ ఈశ్వరుడు ఉన్నాడు అనే పాక్షిక జ్ఞానము గలదు. కాని, ఆ ఈశ్వరుడు తమకంటె భిన్నముగా లేడనే జ్ఞానము వారికి లేదు.

ఆపదలో సతమతమగుచున్న భక్తుడు ఆర్తుడు. తన జీవనము బుగ్గిపాలు కాగా, ఆర్తుడు చేతులను పైకి యెత్తి తనను రక్షించుమని భగవంతుని ప్రార్థించును. తాను చేరుకున్న భయంకరమగు పరిస్థితి నుండి కేవలము భగవానుడు మాత్రమే కాపాడగలడనే నమ్మకము ఆ భక్తునకు ఉండును. భగవంతుడు సర్వశక్తిమంతుడని స్వీకరించిన ఆ భక్తుడు భగవానుని సహాయమునర్థించును.

InCorpTaxAct
Suvidha

రెండవ రకము భక్తుడు అర్థార్థి, అనగా లాభాపేక్ష గల వ్యక్తి. జీవితములో దేనిని సాధించాలన్నా కష్టపడాలనియు, కేవలము ఈశ్వరునిపై భారము వేసి కూర్చుండరాదనియు ఈ భక్తునకు తెలియును. కాని, లక్ష్యమును చేరుకొనుటకు భగవంతుని కృప అత్యావశ్యకమని కూడ ఈ భక్తునకు విదితమే. ప్రార్థన కూడ ఒక కర్మ. కర్మ ఫలమునిచ్చి తీరును. కావున, ప్రార్థన కూడ ఫలమునిచ్చును. ప్రకృతినియమములు ఈశ్వరుని అధీనములో పని చేయుననియు, సర్వకర్మలకు ఫలమునిచ్చేది ఈశ్వరుడే(కర్మ ఫలదాత) అనియు ఆ భక్తునకు తెలియును. కావున, భగవానుని కృపను కోరి చేసే పూజ ఏదైనా తప్పక ఫలమునిచ్చును. భక్తులు చేసే ప్రార్థన కాయికము గాని, వాచకము గాని, లేక మానసికము గాని కావచ్చును. పుష్పములను సమర్పించుట మొదలైన కర్మలను భక్తుడు తన దేహముతో చేయును గాన, అట్టి కర్మ కాయికమనబడును. భక్తుడు భగవానుని మహిమలను కీర్తించును. ఇది వాచిక కర్మ. భగవంతుని మనస్సులో ధ్యానించుట మానసిక కర్మ. భగవంతునకు అర్పించబడేది ఏది అను విషయము ప్రముఖము కాదు. శ్రీకృష్ణ భగవానుడు ఈ క్రింది విధముగా చెప్పినాడు:

పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయుచ్ఛతి|
తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మనః||9-26||

భక్తితో దేనిని సమర్పించినా దానిని నేను ఆనందముగా స్వీకరిస్తాను. భక్తుడు సమర్పించేది ఆకు గాని, పండు గాని, నీరే గాని కావచ్చును. భక్తుదు పరిశుద్ధమగు హృదయముతో సమర్పించిన చాలును.

ఆర్త,అర్థార్థి భక్తులవలె జిజ్ఞాసు భక్తుడు కూడ ఈశ్వరుని యథార్థ స్వరూపము తెలిసినవాడు కాడు. కాని జిజ్ఞాసువు ఆ రెండు రకముల భక్తుల వలె అల్పములగు ఫలములను కోరువాడు కాడు. అతనికి కావలసినది ఈశ్వరుడు, జీవుడు, జగత్తు అను మూడింటి యథార్థ స్వరూపము యొక్క జ్ఞానము. జిజ్ఞాసువు అనగా అపరోక్ష జ్ఞానమును కోరువాడు. అట్టి జ్ఞానమును పొందుటకు ఆతడు భగవానుని కృపను అర్థించును.

ఈ ముడు రకముల భక్తులకు పాక్షికమగు జ్ఞానము గలదు. భగవంతుని ఉనికి ముగ్గురికి స్వీకార్యమే. వారిలో మొదటి వాడు ఆపదలో తనను భగవానుడు ఆదుకోవాలని కోరగా, రెండవ వాడు భగవానుడు తనకు ఒక విశిష్టమగు ఉన్నతిని కలిగించాలని కోరును. కాని, మూడవ వాడు భగవానుని యథార్థస్వరూపముయొక్క జ్ఞానమును కోరుచున్నాడు.Slide95

ఈ ముగ్గురిలో జిజ్ఞాసువు భాగ్యవంతుడు. ఏలయనగా, జీవితములో అల్పములగు లక్ష్యములను సాధించుట వలన చిన్న సమస్యలు మత్రమే పరిష్కరించబడునని ఆతనికి తెలియును. జీవితములో ఎంత ఉన్నతిని సాధించినా మౌలికమగు అల్పత్వము వెంట బడినారు. తాను స్వరూపముచే స్వతంత్రుడను అనే జ్ఞానముచే వ్యక్తి స్వేచ్ఛను పొందగల్గును. ఈ సత్యము జిజ్ఞాసువునకు విదితము. జిజ్ఞాసువు తనకు భగవానునకు గల అభేదమును తెలియగోరుచున్నాడు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Shailesh Lakhtakia’s Journey

Read More →