మనిషిలో సహజంగావున్న సంపూర్ణత్వం యొక్క వ్యక్తీకరణయె విద్య. జ్ఞానమన్నది బయటినుండి రాదు, అది సహజంగానే మనిషిలో ఉంటుంది. అందువల్ల మానవుడు తెలుసుకుంటున్నాడు అనుకోవడం కంటే, కనుగున్నాడు అనుకోవడం సమంజసం అవుతుంది. దీనర్ధం మనం మనసుని కప్పియున్న అజ్ఞానపు తెరలను తొలగించుకుంటే మనకు జ్ఞాన దర్శనం అవుతుంది. ఈ రకంగా అనేకమంది అనేక విషయాలను మనస్సు నుండే గ్రహించడం జరిగింది. ఈ అజ్ఞానపు తెర ఎంత ఎక్కువ తొలగితే అంత ఎక్కువగా మనలో జ్ఞాన వికాసం కలుగుతుంది. సహజంగా జ్ఞాన సమృద్ధి కలిగిన మానవులు ఇతరుల చేత భోదింపబడేపనిలేదు. మనకు మనమే నేర్చుకోగలుగుతాం. అయితే విద్యావ్యవస్థలోని ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఉపన్యాసకులు తదితర బాహ్య భోదకులు మనయందలి అజ్ఞానపు తెరలను తొలగించుకుని వికసించడానికి తగ్గ సూచనలు ఇస్తారు. తద్వార మన వ్యక్తిత్వం నిర్మితమౌతుంది.
దురదృష్టవశాత్తు నేటి మన విద్యావిధానం. శిక్షణ, వ్యక్తిత్వ వికాసానికి బదులు పై పై మెరుగులు దిద్దడానికి మరియు ప్రదర్శనకు మాత్రమే ఉపయోగ పదుథొన్ది. అందువల్లనే విశ్వవిద్యాలయాల నుండి అనేక విద్యార్హతలు సాధించిన అనేక మంది వ్యక్తులలో వారికి, సమాజానికి ఉపయోగపడే వ్యక్తిత్వం కనిపించక పోవడం మనం గమనిస్తూ ఉంటాం. దానికోసం వారు ప్రత్యేకించి కొందరు మేధావుల ద్వారా వ్యక్తిత్వ నిర్మాణ, వికాస పద్ధతులను నేర్చుకోవడం గమనిస్తూ ఉంటాం. అయితే మన దేశపు ఆధ్యాత్మిక వ్యవస్థ, యోగ శాస్త్రము వ్యక్తిత్వాన్ని వికసి౦పచేసుకునే పద్దతులని వివరిస్తాయి. ఈ యోగసూత్రాలని అభ్యసిస్తే ఎట్టి వారైనా వారి వ్యక్తిత్వాన్ని అభివృద్ధి పరచుకోవచ్చు. ఇది అనుభవపూర్వకమైనది అనేకమంది ద్వారా రుజువైనది. అందువల్ల ఏ విధమైన వ్యవస్థలో ఉన్నవారైనా మన సనాతన శాస్త్రజ్ఞానం ద్వారా వారి వారి వృత్తులు, ప్రవృత్తులు మరియు జీవన విధానంలో విశేషమైన పరిణతిని మరియు వికాసాన్నిపొంది తద్వారా వారికి స్వయంగాను మరియు సమాజానికి వినియోగపడే పరిస్థితి కలుగుతుంది. మన జాతి యొక్క భౌతిక, పారమార్ధిక విద్యలను మనవశంలో ఉంచుకోవాలి, అంతేగాక తపించాలి అప్పుడే మనకు యదార్ధ విద్యలభించి వ్యక్తిత్వ నిర్మాణం సాధ్యపడుతుంది. అందుకే మనకు పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని ఇచ్చే మతం( విధానం) కావలసి ఉన్నాయి. దానికి వ్యవస్థాపరంగా ప్రభుత్వాలు అధికారులు శాసనాలు చేయాలి తద్వారా వ్యక్తిత్వాన్ని అభివృద్ధి పరచుకునే విద్యను అందరికి అందుబాటులోకి తేవాలి.
మనం నేడు మాట్లాడుకునే వ్యక్తిత్వవికాసం, నైపుణ్యాభివృద్ధి సహజంగా అభివృద్ది చెందాలంటే విద్యార్ధులలో జిజ్ఞాస, ప్రశ్నించే గుణం పెంపొందించాలి. మనం గమనించి నట్లైతే మన పురాణేతిహాసాలన్ని కూడా గురువును శిష్యుడు ప్రశ్నించే ప్రక్రియ ద్వారానే వెలువడ్డాయి. అందువల్ల గతంలో నుండి ఈ అద్భుత విధానాన్ని మనం మరో మారు గ్రహించి వ్యవస్థ అభివృద్ధికి తోడ్పడాలి. ఇందుకు అధ్యాపకులు, విద్యావ్యవస్థల యాజమాన్యం మరియు ప్రభుత్వాలు పూనుకుంటే ఆ లక్ష్యం నెరవేరుతుంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.