Loading...
You are here:  Home  >  Specials  >  Current Article

శివరాత్రి

By   /  February 23, 2015  /  No Comments

    Print       Email

 cartoon_1

శివరాత్రి జాగరణలకు అర్థం మారింది. పురాణాల ఇతిహాసాల సారాశంలో ఉన్న వెసులుబాటు అటువంటిది. శివరాత్రి పర్వదినాన శివునికి సమర్పించిన
పూజలలో చిత్తశుద్ది కరువైనా పూజాఫలం దక్కుతుందని శివ భక్తులు విశ్వాస౦. గుణనిధి లాంటి మహా చోరుడికే శివరాత్రి రోజున మరణానంతరం
కైలాస ప్రాప్తి కలిగింది.

InCorpTaxAct
Suvidha

శివరాత్రి పర్వదినాన గుణనిధి తనకు తెలియకుండానే చేసిన ఉపవాస జాగారాలను నిష్టగా అతడు తనకర్పించిన పూజగా భావిస్తాడు శివుడు. ఇంట్లో
తను చేసిన దొంగతనం కోసం తండ్రికి తెలిసిపోయాకా, తండ్రి తనను దండిస్తాడేమోననే భయంతో… ఇల్లు వదిలి పారిపోయి గౌతమీ నదిలో ఈదుకుంటూ,
ఊరి శివార్లలో ఉన్న శివాలయంలో తండ్రికి కనిపించకుండా తల దాచుకుంటాడు. శివ భక్తుల సందడి సద్దుమణిగాక, శివాలయంలో భక్తులు శివుడికి
సమర్పించిన ప్రసాదాలను కాజేయాలని అవకాశం కోసం ఓ మూల నక్కి ఆకలితో రాత్రంతా కాచుకు కూర్చుంటాడు. జాగరణ చేస్తున్న భక్తులు
నిద్రావస్థలోకి జారుకున్నాక శివాలయంలో దీపం కొండెక్కి ఆలయం లోపల కఠిక చీకటి అలముకుంటుంది. అదే అదనుగా భావించి గుణనిధి ఆలయం
లోనికి చొరబడి ప్రసాదాలను కాజేయ చూస్తాడు. ఆలయంలో అన్ని వైపులా కళ్ళు పొడుచుకున్నా కానరాని కఠిక చీకట్లు అలముకుని ఉన్న కారణంగా,
వెలుతురు కోసం తన పై వస్త్రాన్ని చించి వత్తిగా చేసి, అక్కడే ఉన్న నూనె ప్రమిదలో పోసి దీపం వెలిగిస్తాడు. ఆనక కడుపు నిండా ప్రసాదం భుజించి,
కొంత ప్రసాదాన్ని ఓ పాత్రలో నింపి వేకువ కాక మునుపే ఆలయం విడిచి వెళ్లి పోవాలనే కంగారులో ఆలయ ప్రాంగణంలో నిద్రిస్తున్న ఓ భక్తుని కాలు
తొక్కి, తమాయించుకోలేక నందీశ్వరుని రాతి విగ్రహం మీద పడి తలకు గాయమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతాడు.

శివరాత్రి నాడు గుణనిధి ఊరొదిలి పారిపోవాలనే కంగారులో పవిత్ర గౌతమీ నది దాటే ప్రయత్నంలో ఈదుతూ తనకు తెలియకుండానే పుణ్య స్నానాలు
ఆచరిస్తాడు. భక్తుల సద్దుమణిగితే ఆలయం లోపల చొరబడి ప్రసాదం సేవించాలనే ఆలోచనలో ఆకలి కడుపుతో శివాలయంలో సగం రాత్రి వరకూ కాచుకు
కూర్చుంటాడు. ఉపవాసం, జాగరణ, ఆలయంలో దీపం పెట్టడం, ఇవన్నీ గుణనిధి శివార్చన కోసం చేయకపోయినా… ఆ రోజు శివరాత్రి పర్వదినం కావడం
మూలంగా అతనికి కైలాస ప్రాప్తి కలుగుతుంది.

శివరాత్రి రోజు మాంసాహారం భుజించి జాగరణలు చేసే వాళ్ళూ ఉన్నారు. బహుశా భక్త కన్నప్ప శివునికి మాంసాన్ని నైవేధ్యంగా పెట్టిన వైనం ప్రభావం
అయ్యుంటుంది. టెలివిజన్స్ అందుబాటులో లేని రోజులలో సినిమా థియేటర్స్ యాజమాన్యం రాత్రి సెకండ్ షో అనంతరం భక్తుల కోసం మరో షో
చూపించేవారు. ఆ షో పూర్తయ్యే సరికి తెల్లారేది. భక్తులు థియేటర్నుండే కట్టుబట్టలతో నదీ, సముద్ర స్నానాల కోసం కాలి నడకన తరలిపోయేవారు. శివ
స్నానాలు చేసే యువతులను తిలకించడం కోసం ఆకతాయి కుర్రకారు కొందరు జాగరణ పేరుతో రాత్రంతా మెళకువగా ఉండి ఉదయాన్నే శివస్నానాలు
కోసం తరలిపోయే స్త్రీలను వెంబడించే వారు. ఒక విధంగా చెప్పాలంటే శివరాత్రి నాడు రాత్రంతా చేసే జాగారాలలో భక్తి తక్కువా, వినోదం ఎక్కువగా
వుంటుంది. జాగరణలో భాగంగా రాత్రంతా స్త్రీలు అష్టాచమ్మాలాడితే వారి వారి భర్తలు వాళ్ళకు అండగా ఉండడం కోసం రాత్రంతా మద్యం సేవిస్తూ
పేకాటాడుతూ జాగరణ చేసే వైనాలు ఉన్నాయి.

కాదేమాధ్యమం జాగరణకు అనర్హమని మనం చాటేందుకు ఇప్పుడు ఫేస్బుక్ లాంటి సోషల్ నెట్ వర్క్ వెబ్సైట్లలోనూ శివరాత్రి రోజు మూకుమ్మడి
జాగరణలు చేయడానికి భక్తి గ్రూపులూ మరియు గ్రూపు ఛాటింగులు అందుబాటులోకి వచ్చాయి. దేవుళ్లలో బహుశా శివుడొక్కడే తనకు అర్పించే
పూజల స్వరూపం ఏ రూపంలో ఉన్నా భక్తులను బ్రోచువాడేమో? శివ శివా.

~ పుక్కళ్ళ రామకృష్ణ

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Shailesh Lakhtakia’s Journey

Read More →