Loading...
You are here:  Home  >  Community News  >  Telugu Community News  >  Current Article

శ్రీరామ హృదయం-part 2

By   /  April 2, 2015  /  No Comments

    Print       Email

రామౌ న గచ్ఛతి న తిష్ఠతి నానుశోచ-
త్యాకాంక్షతే త్యజతి నో న కరోతి కించిత్|
ఆనందమూర్తి రచలః పరిణామహీనో
మాయాగుణాననుగతో హి తథా విభాతి|

శ్రీరాముడు సర్వ వ్యాపకుడు కావడం వల్ల ఆయనకు గమనాగమనములు లేవు, అందువల్ల ఆయన ఒక చోట ఉండువాడు కాదు.నిత్యానంద స్వరూపుడు కావడం వల్ల ఆ మహానుభావునికి శోకాదులులేవు, పూర్ణకాయుడు కావడం వల్ల ఆకాంక్షారహితుడు. ప్రియము అప్రియము అనే ద్వంద్వ భావములులేని కారణంగా ఆయనకు రాగద్వేషములు ఉండవు. ఏ క్రియను చేయనివాడు, ఆనంద స్వరూపుడు, అచలుడు, పరిణామ రహితుడు, నిర్గుణుడు, మాయా గుణములను అంగీకరించి లీలలు లొకానుసారిగా ప్రతీతమగుచున్నాడు అని సీతాదేవి హనుమంతునకు తత్త్వోపదేశము చేసెను.

InCorpTaxAct
Suvidha

సీతాదేవి చెప్పిన పిదప తన యెదురుగా నిలచిన హనుమంతుని చూచి శ్రీరామచంద్రమూర్తియే స్వయంగా చెప్పనారంభించెను,” హనుమా! నేను నీకు పరమాత్మ,ఆత్మ,అనాత్మతత్త్వాలను గురించి తెలియజేస్తాను సావధానంగా విను” అంటూ

ఆకాశస్య యథా భేద స్త్రివిధో దృశ్యతే మహాన్ |
జలాశయే మహాకాశస్తదవచ్ఛిన్న ఏవ హి |
ప్రతిబింబాఖ్యమపరం దృశ్యతే త్రివిధం నభః ||

ఈ విషయాన్ని ప్రతిపాదించే నిమిత్తమై ఆకాశమును దృష్టాంతముగా వివరిస్తున్నారు,”ఆకాశము మూడు విధములైన మహా బేధములతో ఉన్నట్టుగా అనిపిస్తుంది. వాటిలో మొదటిది,”మహాకాశము” ఇది పైన అంతట వ్యాపించి యుండును. రెండవది “జలాశయావచ్చిన్న ఆకాశం” ఇది కేవలం జలాశయానికి మాత్రమే పరిమితమైయుంటుంది. ఇక మూడవది “ప్రతిబింబ ఆకాశము” ఇది జలాశయమునందలి నీతిలో ప్రతిబింబించుచుండును. పై విధంగా ఆకాశము మూడు బేధములతో గోచరించుచుండును.

అదే విధంగా చైతన్యము కూడ మూడు విధములుగా కనబడుతుంది. వాటిలో మొదటిది ” పరిపూర్ణ చైతన్యము”, ఇది యెల్లెడల వ్యాపించి పరిపూర్ణమై యుండును. రెండవది “బుద్ధివచ్ఛిన్న చైతన్యము”, ఇది బుద్ధి యందు పరిమితమై యుండును, ఇక మిగిలినది ” అభాస చైతన్యము” దీని అర్ధం – ఇది బుద్ధియందు lord-sri-ramaప్రతిబింబితమైన చైతన్యము. దీనిని ‘ చిదాభాసము ‘ అని అంటారు. ఈ మూడింటిలోను కేవలం ‘అభాస చైతన్యమూ తో కూడిన బుద్ధియందు మాత్రమే కర్తృత్వము ఉండును. అనగా చిదాభాస బుద్ధియే సర్వములు నిర్వర్తిస్తుంది. అజ్ఞానులు భ్రాంతి అవిచ్ఛిన్నము, అవికారము, సాక్షి అయిన ఆత్మ యందు కర్తృత్వన్ని మరియు జీవత్వాన్ని ఆరోపిస్తారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Shailesh Lakhtakia’s Journey

Read More →