Loading...
You are here:  Home  >  Community News  >  Telugu Community News  >  Current Article

శ్రీ రామ గీత – part 1

By   /  April 5, 2015  /  No Comments

    Print       Email

శ్రీ రామ చంద్ర మూర్తి ఒకనాడు ఏకాంతముగా ఉండెను. ఆ సమయంలో పరిశుద్ధాంతఃకరణుడయిన లక్ష్మణుడు, ఆయన వద్దకు చేరి భక్తిపూర్వకంగా నమస్కరించి అత్యంత వినయంతో

త్వం శుద్ధబోధో2సి హి సర్వదేహినా
మాత్మాస్యధీశో2సి నిరాక్రుతిః స్వయం|
ప్రతీయసే జ్ఞానదృశాం మహామతే
పాదాబ్జ భృంగాహితసంగసంగినాం||

InCorpTaxAct
Suvidha

మహానుభావా నీవు శుద్ధ జ్ఞానస్వరూపుడవు, సమస్త జీవులకు ఆత్మవు, అందరికి స్వామివి, నియామకుడవు, నిరాకారుడవు, నీ చరణ కమలములందలి మకరందాన్ని గ్రోలెడి తుమ్మెదలవంటి పరమభాగవతోత్తములైన వారి సాంగత్యము చేయు వారికి మాత్రమే నీవు జ్ఞానదృష్టి ద్వారా అగుపిస్తావు. ప్రభూ! యోగులచే నిరంతరము ధ్యానింపబడు, సంసార బంధములను తొలగించు నీ పాద పద్మములకు దాసుడనై వేడుకొనుచున్నాను. మహానుభావా! ఈ అగాధ సంసార సాగరాన్ని సులువుగా దాటేందుకు అనువయిన సదుపదేశాన్ని నాకు అనుగ్రహింపుమని” కోరినాడు.

అంత లక్ష్మణుని పలుకులు విన్న శరణాగతత్రాణుడయిన శ్రీరామచంద్రమూర్తి వేదవిహితము, అజ్ఞాన తిమిరాన్ని తొలగించే విజ్ఞానమును శ్రద్ధాభక్తులతో కోరిన లక్ష్మణునకు చెప్పసాగాడు.

ఆదౌ స్వవర్ణాశ్రమవర్ణితాః క్రియాః
కృత్వా సమాసాదితశుద్ధమానసః |
సమాప్య తత్పూర్వముపాత్తసాధనః
సమాశ్రయేత్సద్గురుమాత్మలబ్ధయే||

మానవుడు మొదట తమతమ వర్ణాశ్రమాలకు సంబంధించి శాస్త్రముచే నిర్దేశించబడ్డ క్రియలను యధావిధిగా ఆచరించవలెను. తద్వారా చిత్తశుద్ధి కలుగుతుంది. పిదప శమదమాది సాధనాలద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందడానికి సద్గురువును ఆశ్రయించాలి. మనంచేసే కర్మలు మరల దేహాంతర ప్రాప్తి మానవులవలన ఇష్టానిష్టములు అనే రెండు క్రియలు జరుగుతాయి. అయితే ఇష్టమయిన దానిని స్వీకరించడం అయిష్ట మయినవాటిని త్యజించడం లాంటి కర్మల ద్వారా ధర్మాధర్మములు ప్రాప్తిస్తాయి. వాటివలన మరల శరీర ప్రాప్తి సంభవిస్తుంది. ఈ రకమయిన కర్మలను ఆచరించడం చేత సంసార చక్రము పరిభ్రమిస్తుంది.

అజ్ఞానమేవాస్య హి మూలకారణం
తద్ధానమేవాత్ర విధౌ విధీయతే|
విద్యైవ తన్నాశవిధౌ పటీయసీ
న కర్మ తజ్జం సవిరోధమీరితం||

ఈ చక్రరూప మయిన సంసారానికి అజ్ఞానమే మూలకారణం. అజ్ఞానం వీడడమే ముక్తికి మార్గమని తెలుపబడినది. విద్యమాత్రమే అజ్ఞానాన్ని నశింపజేయుటకు సమర్ధమైనది.

Lord-Sree-Ramaకాని, సకామకర్మ మాత్రం కాదు. ఎందువల్లననగా కర్మ అజ్ఞానం వల్ల ఉత్పన్నమవుతుంది. అందువల్ల కర్మ అజ్ఞానాన్ని వృద్ధి పరుస్తుందేగాని తొలగించదు అన్న విషయం తెలుసుకోవాలి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Shailesh Lakhtakia’s Journey

Read More →