Loading...
You are here:  Home  >  Community News  >  Telugu Community News  >  Current Article

శ్రీ రామ గీత – part 2

By   /  April 10, 2015  /  No Comments

    Print       Email

Lord-Sree-Ramaకొందరు వితర్కవాదులు జ్ఞానకర్మలను సముచ్చయముగా ఇట్లు చెప్పుదురు – జ్ఞానము పురుషార్థ సాధకమగునట్లు, కర్మకూడా పురుషార్థ సాధనమే! అని వేదము చెప్పుచున్నది కదా. కావున, ప్రతిప్రాణి తప్పక కర్మను ఆచరించవలయును. అందువలన ఆచరింపబడు కర్మలు జ్ఞానమునకు సహాయకము లగును. కర్మను ఆచరించకుండుట దోషమని కూడా శ్రుతి చెప్పుచున్నది. కావున,మోక్షము కోరువాడు కూడా ఎల్లప్పుడు కర్మను ఆచరించుచుండవలెను. ఒకవేళ వేరే ఎవరైననూ – జ్ఞానను స్వతంత్రమైనది. అది తప్పక ఫలము నిచ్చునది. అంతేకాదు, మనసులోకూడ మరియొక సాధనమును సహాయకముగా అపేక్షించనిది జ్ఞానము అని చెప్పినచో అతనిమాట సరియైనది కాదు.
న సత్యకార్యో2 పి హి యద్వదధ్వరః
ప్రకాంక్షతే2 న్యానపి కారకాదికాన్|
తథైవ విద్యా విధితః ప్రకాశితై-
ర్విశిష్యతే కర్మభిరేవ ముక్తయే|

ఏలనన, వేదవిహితములగు యజ్ఞాదికర్మలు సత్కర్మలే అయినప్పటికినీ, వాటికి అంగభూతములైన కారకాదులను అపేక్షించినట్లుగా, విధ్యుక్తమైన కర్మలను ఆచరించుట ద్వారానే జ్ఞానము ముక్తి లభించుటకు సాధకమగును. అందువలన కర్మపరిత్యాగము యుక్తము కాదు.

InCorpTaxAct
Suvidha

ఇట్టి యుక్తిచే కొందరు వితర్కవాదులు ఈ విధముగ వాదింపవచ్చును.కాని అది సముచితమైనదికాదు. దీనిలో అనగా- కర్మాచరణము ఆవశ్యకమను వాదనలో ప్రత్యక్ష విరోధము ఉండుటవలన ఔచిత్యము కనిపించుటలేదు. దేహాభిమానమువల్లనే కర్మ జరుగును. జ్ఞానము అహంకారము నశించిన పిదప లభించును. కావున జ్ఞానకర్మ సముచ్చయవాదము సరికాదు.

విశుద్ధ విజ్ఞానము కలిగించు వేదాంతవాక్యములు పరిశీలించుట వలన అభించిన చివరి ఆత్మవృత్తి అనగా ‘ బ్రహ్మాకార – అంతః కరణవృత్తియే విద్య అనబడును . అట్టి విద్యతో కర్మచేరి నిలువజాలదు. అంతేగాక, కర్మ సకల ఉపకరణములతో కూడియున్నపుడే పూర్తియగును. కాని, విద్య అన్ని ఉపకరణములను నిరాకరించును.

ఈ రీతిగ విద్యకు విరోధియగుట వలన కర్మకు విద్యతో పొత్తు కుదరదు. కావున, బుద్దిమంతుడైన పురుషుడు శేషము లేకుండా పూర్తిగా కర్మలను త్యజించవలెను. తరువాత ఇంద్రియ విషయములన్నిటి నుండి నివృత్తుడై నిరంతరము సచ్చిదానంద రూపమైన ఆత్మానుసంధానమున నిమగ్నుడై యుండవలెను.

యావచ్ఛరీరాదిషు మాయయాత్మధీ-
స్తావద్విధేయో విధివాదకర్మణాం|
నేతీతి వాక్యైరఖిలం నిషిధ్య తజ్-
జ్ఞాత్వా పరాత్మానమథ త్యజేత్ర్కియాః|

మాయామోహితుడైయున్న కారణమున శరీరాదుల యందు ఆత్మభావమును కలిగియుండునంతవరకు విధ్యుక్త కర్మానుష్ఠానము చేయుచునే యుండవలెను. “నేతి” “నేతి” అను వాక్యములతో సంపూర్ణంగా అనాత్మ వస్తువులను నిషేధించుకొనుచు పోయి, పరమాత్మ తత్త్వమును తెలిసి అతడు సమస్త కర్మలను త్యజించి వేయవలయును.

ఎప్పుడైతే ఆత్మపరమాత్మల భేదమును తొలగించునట్టి ప్రకాశమయ విజ్ఞానము అంతఃకరణమునందు స్పష్టముగా భాసించునో, అప్పుడే ఆత్మకు సంసారమును ప్రాప్తింపచేయు మాయ అనాయాసముగా కారకాదులతో లయమైపోవును.

 

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Shailesh Lakhtakia’s Journey

Read More →