Loading...
You are here:  Home  >  Community News  >  Telugu Community News  >  Current Article

శ్రీ రామ గీత – part 4

By   /  April 13, 2015  /  No Comments

    Print       Email

ప్రత్యక్పరోక్షాదివిరోధమాత్మనో-
ర్విహాయ సంగృహ్య తయోస్చిదాత్మతాం|
సంశోధితాం లక్షణయా చ లక్షితాం
జ్ఞాత్వా స్వమాత్మానమథాద్వయో భవత్|

ఈ తత్ త్వం అను రెండిటిలో చేతనత్వమున ఏకరూపమైన కారణమున ‘జహతీ లక్షణావృత్తి ‘ సంభవము కాదు. పరస్పరముగా ప్రత్యక్షమనెడు వైరుధ్యము కారణముగా ఇచట ‘ అజహల్లక్షణావృత్తి ‘ కూడ పొసగదు. కావున “సో2యం” లోని రెండు పదముల అర్థమువలె తత్ త్వం పదములందు కూడ భాగత్యాగలక్షణావృత్తి నిర్దుష్టముగా సిద్ధమగును.

InCorpTaxAct
Suvidha

పృథివ్యాది పంచీకృత భూతములవలన ఉత్పన్నమైనదియు,సుఖదుఃఖాది కర్మభోగములకు ఆశ్రయస్థానమై పూర్వోపార్జితములైన కర్మఫలముగా అనగా ప్రారబ్దమువలన ప్రాప్తించునదియు, మాయామయము ఐనదియు, ఆద్యంతములుగలదియునగు ఈ సరీరమును విజ్ఞులు ఆత్మయొక్క స్థూలమైన ఉపాధి అని చెప్పుదురు.

సూక్ష్మం మనోబుద్ధిదశేన్ర్దియైర్యుతం
ప్రాణైరపంచీకృతభూతసంభవం |
భోక్తుః సుఖాదేరనుసాధనం భవే-
చ్ఛరీరమన్యద్విదురాత్మనో బుధాః|

మనస్సు,బుద్ధి,దశేంద్రియములు, పంచప్రాణములు అను పదునేడు అంగములతో కూడినది. ఈ అపంచీకౄత భూతముల వలన – సూక్ష్మ భూతములచే ఉత్పన్నమైనది. భోక్తకు సుఖదుఃఖాదులను అనుభవించుటకు సాధనముగా నుండునది సూక్ష్మశరీరము అగును.దీనిని ఆత్మయొక్క రెండవ దేహముగా భావింతురు.

అనాద్యనిర్వాచ్యమపీహ కారణం
మాయాప్రధానం తు పరం శరీరకం|
ఉపాధిభేదాత్తు యతః పృథక్ స్థితం
స్వాత్మానమాత్మన్యవధారయేత్ర్కమాత్|

అనాదియై, అనిర్వాచ్యమైనట్టి మాయామయమైన కారణశరీరము వేరొకటి కలదు. అది జీవునకు మూడవ దేహము అనబడును. ఇట్లు శరీరత్రయమును తెలియవలెను. ఈ విధముగా ఉపాధి భేదములకంటె సర్వదా భిన్నముగా నుండు తమ ఆత్మస్వరూపమును క్రమముగా హృదయములో నిశ్చయము గావించుకొనవలెను. తెలియవలెను.

కోశేష్వయం తేషు తు తత్తదాకృతి-
ర్విభాతి సంగాత్స్ఫటికోపలో యథా|
అసంగరూపో2 యమజో యతో2ద్వయో
విజ్ఞాయతే2స్మింపరితో విచారితే|

స్ఫటికమువలె ఆత్మకూడా అన్నమయాది కోశములందు వాని సంపర్కమువలన తదాకారముగా కనవచ్చుచుండును. కావున దీనిని గురించి చక్కగా విచారము చేసినయెడల ఇది అద్వితీయమైన కారణమున సంగరహితము, జన్మరహితము ఐనదని నిశ్చితమగును.

త్రిగుణాత్మకమైన బుద్ధికి స్వప్న, జాగ్రత్, సుషుప్తులనబడు మూడు విధముల వృత్తులు కనిపించుచున్నవి. కాని,ఈ మూడువౄత్తులయందు ప్రతియొకటి రెండవదానియందు కలియు కారణమున ఈ ముడును నిస్సంగుడు, కల్యణరూపుడు, నిత్యుడు అగు పరబ్రహ్మము నందు మిథ్యయైయున్నవి.

దేహేన్ర్దియప్రాణమనశ్చిదాత్మనాం
సంఘాదజస్రం పరివర్తతే ధియః|
వృత్తిస్తమోమూలతయాజ్ఞలక్షణా
యావద్భవేత్తావదసౌ భవోద్భవః|

దేహము, ఇంద్రియములు, ప్రాణములు, మనస్సు, చేతనమైన ఆత్మ వీని సమూహరూపమువలన బుద్ధి యొక్క వృత్తియే నిరంతరము పరివర్తితమగుచుండును. ఈ వృత్తి తమోగుణమువలన ఉత్పన్నమగు అజ్ఞానరూపమైనది. కావున, ఇది ఎంతవరకు ఉండునో, అంతవరకే ఈ లోకములో జన్మ ప్రాప్తించును.Lord-Sree-Rama

“నేతి”, “నేతి” మొదలగు శ్రుతి ప్రమాణవాక్యముల వలన సమస్త సంసారమును త్రోసిపుచ్చి, హృదయమున చిద్ఘనామృతమును ఆస్వాదించు చుండవలెను. దాహము కలిగినవాడు కొబ్బరిబొండములోని నీరుత్రాగి ఫలమును పారవేయు విధముగా, సమస్త జగత్తులోగల సారరూపమగు సత్ రసమును గ్రహించి, ఇతరమును త్యజించి వేయవలెను.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Shailesh Lakhtakia’s Journey

Read More →