Loading...
You are here:  Home  >  Community News  >  Telugu Community News  >  Current Article

శ్రీ రామ గీత – part 5

By   /  April 15, 2015  /  No Comments

    Print       Email

కదాచిదాత్మా న మృతో న జాయతే
న క్షీయతే నాపి వివర్ధతే2 నవః|
నిరస్తసర్వాతిశయః సుఖాత్మకః
స్వయంప్రభః సర్వగతో2 యమద్వయః|

ఆత్మ ఎన్నడు మరణించదు,జన్మించదు, క్షీణించదు,వృద్ధిచెందదు. అది పురాతనము, సమస్త దేహేంద్రియాదుల కన్న అతిశయము, సుఖస్వరూపము, ఉత్కృష్టము, స్వయం ప్రకాశకము,సర్వగతము,అద్వితీయము ఐనది.

InCorpTaxAct
Suvidha

ఇంతటి ఆత్మయందు ఈ దుఃఖమయమగు సంసారము ఎటుల కనవచ్చును? ఇది అధ్యాసము కారణముగా అజ్ఞానమువలననే కానవచ్చును? ఇది అధ్యాసము కారణముగా అజ్ఞానమువలననే కానవచ్చుచున్నది. ఇది ఎట్లు నశించును? అనగా వెలుతురు కలిగినవెంటనే చీకటి నశించునట్లు, జ్ఞానము కలిగిన తత్ క్షనమే అజ్ఞానము సమసిపోవును. ఏలయన, జ్ఞానమునకు అవిద్య కు విరోధమున్నది కదా!Lord-Sree-Rama

భ్రాంతివశమున ఒకదానియందు మరొకటి గోచరించుటవలన దానిని విద్వాంసులు అధ్యాసము అని చెప్పిరి. త్రాటి యందు సర్పము తోచునట్లు, ఈశ్వరునియందు సంసారము తోచును.

వికల్పరహితము, మాయావిరహితము, సర్వకారణ భూతము, నిరామయము, అద్వితీయము, చిత్స్వరూపము, సర్వవ్యాపకము అగు పరమాత్మ పరబ్రహ్మమునందు తొలుత ఈ అహంకార రూపమగు అధ్యాసమే కల్పితమగును. ఇచ్ఛ,అనిచ్ఛ, రాగద్వేషములు, సుఖదుఃఖములు మొదలగునవి బుద్ధివృత్తులు ఆత్మధర్మములు కావు. కనుక వీటిచే ఆత్మకు సంసారహేతువు అనుట చెల్లనేరదు. ఏలననగా, సుషుప్తిదశయందు పరమై సర్వసాక్షిగా నుండి ఆత్మయందు పైన చెప్పబడిన బుద్ధివృత్తులు ఏవియును ఉండుతలేదు.అప్పుడు ఆత్మసుఖస్వరూపము అని తెలియుచున్నది కదా!

అనాద్యవిద్యోద్భవబుద్ధిబింబితో
జీవః ప్రకాశో2 యమితీర్యతే చితః|
ఆత్మా ధియః సాక్షితయా పృథక్ స్థితో
బుద్ధ్యా2పచ్ఛిన్నపరః స ఏవ హి|

అనాదియగు అవిస్యవలన ఉత్పన్నమైన బుద్ధియందు ప్రతిబింబించిన ఈ చైతన్యప్రకాశమే ‘జీవుడూ అనబడుచున్నాడు. ఆ ఆత్మ,బుద్ధికి సాక్షిరూపముగా వేరుగానున్నది. బుద్ధిలక్షణములచేత పరిచ్ఛిన్నుడు కాదు. కావున ఆ జీవుడు పరమాత్మయే.

చిదాభాసము,సాక్షియైన ఆత్మ మరియు బుద్ధి ఒకేచోట ఉన్న కారణమున అగ్నిచేత తప్తమైన లోహమువలె అన్యోన్య అధ్యాసము ఏర్పడుచున్నది, ఇట్టి అధ్యాస వశముచే క్రమముగా బుద్ధిలోని జడత్వము ఆత్మలో, ఆత్మలోని చైతన్యము బుద్ధియందు ప్రతీతమగును.అనగా ఉదాహరణకు తాదాత్మ్యము చెందియుండుటచే లోహముయొక్క ఆకారము అగ్నిలో, అగ్నియొక్క ఉష్ణత లోహములో అగుపించును. ఆవిధముగనే బుద్ధి,ఆత్మల తాదాత్మ్యము కారణముగా ఆత్మయొక్క చేతనత్వము బుద్ధియందు, బుద్ధియొక్క జడత్వము ఆత్మయందు కనిపించును. కావున, అధ్యాసవశమున బుద్ధి మొదలు శరీరము వరకు, అనాత్మ వస్తువులనే ఆత్మయని భావించుట జరుగుచున్నది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Shailesh Lakhtakia’s Journey

Read More →