Loading...
You are here:  Home  >  Community News  >  Telugu Community News  >  Current Article

శ్రీ రామ గీత – part 6

By   /  April 17, 2015  /  No Comments

    Print       Email

గురోః సకాశాదపి వేదవాక్యతః
సంజాతవిద్యానుభవో నిరీక్ష్య తం|
స్వాత్మానమాత్మస్థముపాధివర్జితం
త్యజేదశేషం జడమాత్మగోచరం|

అందువలన సద్గురువుల వద్ద నుండి వేదవాక్యముల ఉపదేశములచే ఆత్మజ్ఞాన అనుభవమును పొందినమీదట, హ్రుదయస్థమైన ఉపాధిరహితమైన, ఆత్మను సాక్షాత్కరించుకొనవలెను. ఆత్మరూపమున ప్రతీతమగు దేహాది సమస్త జడపదార్థములను పూర్తిగా త్యజించి వేయవలయును.

InCorpTaxAct
Suvidha

ప్రకాశరూపో2హమజో2హమద్వయో-
2సకృద్విభాతో2హమతీవ నిర్మలః|
విశుద్ధవిజ్ఞానఘనో నిరామయః
సంపూర్ణ ఆనందమయో2హమక్రియః|

“నేను ప్రకాశస్వరూపుడను, జన్మలేనివాడను,అద్వితీయుడను, స్వయంప్రకాశుడను,అత్యంత నిర్మలుడను,విశుద్ధ విజ్ఞానఘనుడను, నిరామయుడను,దేశకాలాది అపరిచ్ఛిన్నుడను,పూర్ణానంద స్వరూపుడను, నిష్క్రియుడను అనగా

సదైవ ముక్తో2హమచింత్యశక్తిమా-
సతీంద్రియజ్ఞానమవిక్రియాత్మకః|
అనంతపారో2హమహర్నిశం బుధై-
ర్విభావితో2హం హృది వేదవాదిభిః|

కర్తృత్వాభిమాన రహితుడను,నిత్యముక్తుడను,అచింత్యశక్తిశాలిని, అతీంద్రియుడను,జ్ఞానస్వరూపిని,అవికారిని, అనంతపారుడను అని వేదవిదులు అహర్నిశము నన్ను హృదయమున చింతింతురు”

ఏవం సదాత్మానమఖండితాత్మనా
విచారమాణస్య విశుద్ధభావనా|
హన్యాదవిద్యామచిరేణ కారికై
రసాయనం యద్వదుపాసితం రుజః|

ఈ విధముగా ఎల్లప్పుడు ఆత్మనుగూర్చి అఖండవృత్తితో చింతించువాని అంతఃకరణములో ఉన్న విశుద్ధభావన, నియమపూర్వకముగా సేవించబడుచున్న ఔషధము రోగమును నశింపజేయునట్లుగా వెంటనే కారకాదులతోపాటుగా అవిద్యను పూర్తిగా నశింపచేయును.

ఆత్మచింతన చేయువాడు ఏకాంతమున తనకు అనుకూలమగు ఆసన్మున కూర్చుండి, ఇంద్రియములను వాని వ్యాపరములనుండి మరలించి,అంతఃకరణమును అధీనము గావించుకొనవలెను. పశుద్ధమైన అంతఃకరణముగలవాడై ఆత్మజ్ఞానము దక్కమిక్తికి వేరొక సాధనము లేదని దృఢనిశ్చయము చెందవలెను. ఇట్టి నిశ్చయముతో కూర్చుండి ఆత్మలో స్థితుడై, నిర్వికల్ప సమాధిలో కేవలము జ్ఞానదృష్టితో ఒక్క ఆత్మనే భావన చేయవలయును.

ఈ విశ్వము అంతటను పరమాత్మనే దర్శింపవలెను. సర్వకారణరూపమైన ఆత్మలో దీనిని లీనము గావింపవలెను.ఈ విధముగా పూర్ణ చిదానంద స్వరూపస్థితిని అందినవానికి బాహ్యవస్థు పరిజ్ఞానముకాని, ఆంతరిక వస్తుపరిజ్ఞానము కాని ఉండనే ఉండదు.

సమాధిస్థితి ప్రాప్తించుటకు పూర్వము, ఈ సమస్త చరాచర జగత్తును కేవలము ఓంకారమాత్రమై యున్నది అని భావించవలయును. ఈ లోకము వాచ్యము, ఓంకారము వాచకము అనునది- అజ్ఞాన కారణముననే ప్రతీతమగును. జ్ఞానము కలిగిన పిదప ఇదేదియు ఉండదు.

ఓంకారమునందలి “అ”కారము విశ్వమునకు వాచకము,”ఉ”కారము తైజసునకు వాచకము, “మ”కారము ప్రాజ్ఞునకు వాచకమని చెప్పబడినది. ఈ స్థితి సమాధిని పొందుటకుగల పూర్వస్థితి, తత్త్వదృష్టితో చూచిన యెడల ఈ భేదము ఏదియూ ఉండదు.

అనేకవిధములుగా ఉన్న “అ”కారరూప విశ్వరూపుని, “ఉ”కారమందు-ఉకారరూప తైజసునియందు లీనము గావింపవలెను. పిమ్మట ఉకారమును – ఉకారవాచ్యుడగు తైజసుని ద్వితీయమైన ప్రణవము యొక్క అంతిమ వర్ణమగు మకారమునందు- మకారవాచ్యుడైన ప్రాజ్ఞునియందు లీనము గావింపవలెను.Lord-Sree-Rama

పిమ్మట కారణాత్మ ప్రాజ్ఞరూపమగు మకారమును, చిద్ఘనరూప పరమాత్మయందు లీనము గావింపవలెను. అంతేగాక, నిత్యముక్తుడు, విజ్ఞాన స్వరూపుడు, ఉపాధిరహితుడు, నిర్మలుడు అగు పరబ్రహ్మము “నేనే”యని తలంపవలయును.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Shailesh Lakhtakia’s Journey

Read More →