మానస ఫిలింస్ బ్యానర్ పై శ్రీ కుమార్ దర్శకత్వంలో రాజశేఖర్ లంకా, దేవేందర్ కోలా సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘కాక్ టైల్’. రమేష్ ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయంకాబోతున్నారు. సానా డిజిటల్ రికార్డింగ్ స్టూడియోలో ముహూర్తపు షాట్ మరియు సాంగ్స్ రికార్డింగ్ తో ఈ రోజు (26.6.2014) ఈ చిత్రం ప్రారంభమయ్యింది.
ముహూర్తపు సన్నివేశానికి టర్బో సురేష్ బాబు క్లాప్ ఇవ్వగా, సి.వి.రమేష్ కెమెరా స్విచ్ఛాన్ చేసారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో…
డైరెక్టర్ శ్రీకుమార్ మాట్లాడుతూ – ”చక్కటి ప్రేమ కధాంశంతో ఈ చిత్రం రూపొందనుంది. కొత్త, పాత నటీనటులతో యూత్ ఫుల్, లవ్, కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాము. ఈ చిత్రం ద్వారా రమేష్ ని హీరోగా పరియచం చేస్తున్నాము” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాతలు రాజశేఖర్ లంక, దేవేందర్ కోలా మంచి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ని నిర్మించనున్నామని తెలిపారు.
సాంకేతిక నిపుణులు
సినిమాటోగ్రఫీ – హిమంత్ నాయుడు, సంగీతం – రాజ్ కిరణ్, ఎడిటింగ్ – సత్య, గిడుతూరి, కో-డైరెక్టర్ – హరనాధ్ రెడ్డి.కె, రచన, దర్శకత్వం – శ్రీ కుమార్.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.