Loading...
You are here:  Home  >  Community News  >  Telugu Community News  >  Current Article

సాక్షాత్కారం

By   /  March 21, 2015  /  No Comments

    Print       Email

సాక్షాత్కారమంటే అక్షరాలా భగవంతుని దర్శించటమే. భగవంతుడు ప్రత్యక్షంగా – అక్షరాలా వ్యవహరించదనీ; పరోక్షంగానో,సంకేత మాత్రంగానో వ్యవహరిస్తాడనీ అనుకోవడమే పెద్ద పొరపాటు.

ఒక గాజు పెంకుపైన రంగులు పూసి, బొమ్మలు వేసి బైస్కోపులో పెట్టి చూపితే ఆ గాజు పెంకు పైన చిత్రింపబడిన రంగులూ, బొమ్మలూ కనబడతాయి కదా. అవి కనబడటానికి వాడే దీపాన్ని వెలిగించక పోతే ఆ రంగులుగాని, బొమ్మలుగాని తెరమీద కనబడవు కదా.
రంగులు ఎలా ఏర్పడతాయి? తెల్లని కాంతికిరణాన్ని ప్రిజమ్లో ప్రసరింపజేయడ౦ వలన. మనిషి స్వభావం కూడా అంతే. జీవనజ్యోతి(భగవంతుడు) మనిషిలో అతని చేష్టల ద్వారా ప్రకటితమవుతుంది. మనిషి నిద్రిస్తున్నా, మరణించినా అతని నైజం తెలియదు. ఆ జీవనజ్యోతి వలన ప్రభావితమైనపుడు, అసంఖ్యాకమైన అతని చేష్టల ద్వారా, బాహ్యప్రపంచానికి అతని ప్రతిస్పందన ద్వారా ఆ నైజం బయటపడుతుంది. ఇంతకుముందు మనం అనుకొన్నట్లు దీపం ఎదుట రంగుల గాజు పెంకులు పెట్టకపోతే తెరమీద రంగులూ, బొమ్మలూ, కనబడేవి కావు తెల్లని కాంతి మాత్రమే కనబడేది. ఒక విధంగా చూస్తే, ఆ తెల్లని కాంతిలోని స్వచ్చత, ఆ రంగుల ప్రసారం వలన కొంత దెబ్బ తిన్నది.
మామూలు మనిషి విషయంలోనూ అంతే. అతని మనస్సు తెరవంటిది. ఆ తెరపై స్వచ్ఛమైన కాంతి మార్పు చెంది, కాంతి తగ్గి పడుతోంది. దీనికి కారాణమిది: అతనికీ, భగవంతుని జ్యోతికీ నడుమ ప్రాపంచిక విషయాలు అడ్డురావటం. అతనికి దీని పర్యావసానాలే తెలుసు, అసలు కారణం ( భగవంతుడు) తెలియదు. తెరమీద రంగులు పడినట్లు అతని మనస్సు మీద కూడా ఫలితాలే పడుతాయి. ప్రిజమ్ను తీసివేస్తే స్వచ్ఛమైన తెల్లని కాంతే మిగులుతుంది. గాజుపలక మీద రంగులను తీసివేసినా, తెల్లని కాంతే ప్రసరిస్తుంది. దృశ్యమానమైన ప్రపంచాన్ని మన మనోనేత్రం నుండి తొలగిస్తే మనకి తెలిసేది ఒక్క జ్యోతి ( భగవంతుడు) మాత్రమే.
గురువు కళ్ళూ, చెవులూ తెరుచుకొని ఉన్నా, ధ్యానంలో ఎప్పుడూ సర్వద్రష్టపైనే ఏకాగ్రత ఉండటంవల్ల ఏదీ వినబడదు, కనబడదు. భౌతిక భావమే ఉండదు. మానసిక స్పృహ కూడా ఉండదు. అంతా ఆధ్యాత్మికమే!
మనకి సందేహాలను కలిగించి, మన మనస్సుని మబ్బువలె కమ్మివేసే ప్రపంచాన్ని తీసివేస్తే – భగవంతుడు అనే జ్యోతి స్పష్టంగా ప్రకాశిస్తుంది. ప్రపంచాన్ని తీసివేయటమెలా? ఒక ఉదాహరణ: ఎవరినైనా చూసినప్పుడు అతడు కేవలం ‘మనిషి’ అనుకోకుండా ” దేహధారి అయిన భగవంతుడు” అనుకోవాలి. ఆ దేహం భగవంతుని ఆదేశానుసారం పరిపూర్ణంగాగాని, మరో విధంగాగాని వర్తిస్తుంది. అంటే నావికుని ఆజ్ఞానుసారం పోయే నావలాగ.996StandingVisnu

InCorpTaxAct
Suvidha
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Shailesh Lakhtakia’s Journey

Read More →