Loading...
You are here:  Home  >  Literature  >  Short Stories  >  Current Article

సార్ధక యాత్ర – ఆదూరి హైమావతి

By   /  April 21, 2015  /  No Comments

    Print       Email

Saardhaka_Yatra_SS

 

InCorpTaxAct
Suvidha

‘ మైసూర్ వెళ్ళే ఎక్స్ ప్రెస్ ఐదో నెం. ప్లాట్ ఫాం మీద బయలు దేరుటకు సిధ్ధముగాఉన్నది’ అనే రైల్వే ఎనౌన్స్ మెంట్ విని, వీణ చేయి పట్టుకుని నడకను పరుగ్గామార్చి మెట్లమీంచీ ప్లాట్ ఫాం మీదికి ఉరికాను.వెంట వస్తు న్న రైల్వేకూలీ”ఇటుసార్” అంటూ,మా రిజర్వేషన్ బోగీలోకి మాసామాను విసిరేసి ,నేను విసిరిన నోటు లాఘ వంగా అందుకున్నాడు.నేను వీణనులోపలికి నెట్టి, కదులుతున్న బోగీలోకి గెంతాను. రైల్ స్పీడందు కుంది.

“చూశావా!మీవాళ్ళెంత ఆలస్యంచేశారో నిన్నుసాగనంపను !మరో ఐదు నిముషాలు ఆలస్యమైతే ట్రైన్ మిస్స య్యేది! అంతా ఎడ్యూకే టెడే , బట్ నిల్ టైం సెన్స్!.” మెల్లిగానే ఐనా కోపంగా అన్ననామాటలకు ,నిన్ననే వివాహమై, తన కేరాఫ్ ఎడ్రెస్ నాకు భార్యగా, తన ఇంటిపేరు నాఇంటిపేరుగా మార్చుకున్నవీణ , కళ్ళలో నీరు తిరగటం నాకంట పడకపోలేదు.నాతొందర పాటుకు నన్నునేనే తిట్టుకున్నాను, మొదట్లోనే ఇలా మాట్లాడి వీణ ను బాధించి ఉండవలసింది కాదని, ప్రేమగా చేయిపట్టుకుని నొక్కి మా బెర్తులు ఎక్కడున్నాయో వెతుకుతూ, వెంట తీసుకెళ్ళాను. మమ్మల్నిచూసి “చూడూ! మనపెళ్ళిరోజున నీవిలాగే ఉండేదానివి రివటలా, తెల్లగా మల్లె పూలు సిగ్గు పడేంత నాజూగ్గా, అచ్చంనీలాగే ఉంది చూడూ భర్త చిటికెన వ్రేలు పట్టుకుని ‘ఇహనాజీవితమంతా నీనీడలోనే ‘అన్నట్లు బెదురు చూపులతోఉన్న ఆపిల్లను చూడూ, బుగ్గచుక్కకూడా మసగ్గా కనిపిస్తూనేఉంది, నిన్ననో ఈరోజో వివాహమై ఉంటుంది.” అనే మాటలు మెల్లిగా వినిపించిన వైపు చూశాము ఇద్దరం. షుమారు గా 75,ఏళ్ళ ముదుసలిజంట మాకేసి చూస్తోంది . వారుకూర్చున్నవే మా బెర్తులు! దగ్గరగా వెళ్ళి చూశాను.

” ఏమోయ్! మనవడా! మీ బెర్తులా ఇవి?మేం టీనేజర్లమని మాకు అప్పర్ బెర్తు లిచ్చింది రైల్వేశాఖ, మీరిద్ద రూ అక్కడ సర్దుకుంటే మేం ఇక్కడే సెటిలవుతాం. మీరు అప్పర్ బెర్తుల్లో మీ ప్రేమ సామ్రాజ్యానికి పునాదు లేసుకోవచ్చు.కాదూకూడదంటే మా ఇద్దర్నీపై కెక్కించి పుణ్యం కట్టుకోండి, ఐతే మధ్య మధ్యలో క్రిందికి దించే పాపమూ వస్తుంది సుమా!” అంటూ తన తెల్ల బొర్ర మీసాల చాటున నవ్వేనవ్వు నాకు కనిపించక పోలేదు.   అక్కడి బెర్తుల్లోవారంతా ఫక్కున నవ్వారు. వీణ తలవంచుకుని చిరునవ్వు నవ్వటమూ చూశాను. హమ్మయ్య తన మూడ్ మార్చిన తాతగారికి మనస్సులోనే కృతఙ్ఞతలు చెప్పుకుని,తేరిపార చూశాను . అక్కడ ముసలి తాత జంట తో పాటుగా మధ్య వయస్కు లైన షుమారుగా 55,45,ఏళ్ళ వయస్సుండ వచ్చు మరో రెండు జంటలున్నాయి.45ఏళ్ళజంట కేసి చూసి తాతగారు ” అబ్బాయ్ !మీరిహ మీసైడ్ బెర్తుల్లోకి సర్దుకోండి, మేమంతా మాబెర్తుల్లో సెటిలవుతాం.” అనగానే వారు లేచి తమ బెర్తుల్లో కెళ్ళారు.

” చూడ చక్కని జంట, మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు.మన దృష్టే తగులు తుందేమో!” అంటూ ఆ మామ్మ గారు తన రెండు అరచేతుల్నీమడిచి చెవుల పక్కన ఉంచి ఠప్పున మెటికలు విరిచింది. తాత పకపకా నవ్వాడు. “చాల్ చాల్లేవోయ్ ! నీవు ఇప్పుడు మాత్ర మేం తక్కువ అందంగా ఉన్నావా! నీకూ నేను దృష్టి తుడవద్దూ? ” అంటూ తానూఆమె చేసినట్లే చేశాడు. ” మీకు వయసవుతున్నది కానీ మనసింకా టీనేజిలోనే ఉంది సుమీ!”

” అందుకే నోయ్!మనకు అప్పర్ బెర్తు లిచ్చిందీ! అక్కడైతే మనం పక్క పక్కనే కూర్చుని నన్నునీవూ నిన్ను నేనూ..”… తాతనోటికి తన చేయి అడ్డుపెట్టి “చాలు స్వామీ! ఇహ మాట్లాడకండి” అంది. అక్కడే సామాన్లు సర్దుకుంటున్న మాకు ఆమాటలు వద్దన్నా వినిపించాయి.నేను వీణ వైపు చూడగానే తాను తల వంచు కుంది సిగ్గుపడుతూ. ఆసిగ్గే అతివల కందమనుకుంటా! వీణ సిగ్గులో మరీ అందంగాఉంది. ” ఏం మనవడా!కాస్తంత సేపు మాతోకూర్చుని ఆతర్వాత మీ ప్రేమ సామ్రాజ్యంలో అడుగిడతారా!” అంటూ నవ్వాడు తాత. నేను తల ఊచి సర్దుకుని కూర్చోగా, వీణకూడా కూర్చుంది మామ్మ గారిపక్కనే.                                                                     “ఏమోయ్ మనవడా! స్వంత విషయం అడుగుతున్నానని అనుకోకు , నీపేరేంటి? ఎక్కడ ఉద్యోగం? వివాహం ఎప్పు డైంది? నీ అర్ధాంగి పేరేంటీ? బహుశా నా అంచనా ప్రకారం మీరిరువురూ ఇప్పుడూ ’ తేనెవెన్నెల ప్రయా ణానికి ’అదేనోయ్’ ప్రేమయాత్రకు,’ హానీమూన్’ కు వెళ్తున్నారు. ఔనా!” అన్నారు తాతగారు.

” మీకు చాదస్తం మీరి పోతోందండీ! ఆపిల్లల్ని స్వంత విషయాలడిగి ఆటపట్టించాలా!”అంది మామ్మగారు . ” ఫరవాలేదండీ!” అంటూ అన్నిప్రశ్నలకూ సమాధానాలు చెప్పాను. బోగీ అంతా హడావిడిగా ఉంది.పక్క సెక్షన్ లోపిల్లలేడుస్తు న్నారు. అన్నీ సర్దావా జాగ్రత్తగా, దిగేప్పుడు లెక్కెట్టుకుని దించుకోవాలి.’అంటూ మగడు భార్య తో అంటున్నాడు.కాస్త సర్దుకోండి ,ఇప్పుడే పైకెక్కలేం. అంటూ ఎవరో అంటున్నారు.పేపర్ అమ్మే వాళ్ళూ, పిన్నీ సులూ, సూదులూ అమ్మేవారూ, చొక్కావిప్పి క్రింద తుడిచి చేయిచాచే పిల్లలూ, ఇలాఎందరో!అంతా గోల గోల. నాకిలాంటిప్రయాణా లంటే చాలా ఇష్టం. అమ్మనాన్నాఉద్యోగస్తులు కావటాన , ప్లేక్లాసులు, డేకేర్లూ, స్కూల్ నుంచీ, హాస్టల్, కాలేజ్ తో నాచదువు ముగిసి ఉద్యోగంలో చేరగానే వీణతో వివాహం. కుటుంబప్రేమలు ఎలా ఉంటాయో, భార్య భర్తల బంధం ఎలా ఉంటుందో, ఉండాలో తెలీదు. నేనొక్కడ్నే అవటాన నాకు క్లాస్ మేట్స్ తప్ప స్వంత వారితో ఎలామెలగాలోకూడా తెలీదు.ఎప్పుడో సెలవుల్లో ఇంటికెళ్ళిన అతి కొద్దిరోజుల్లో ఆ అను బంధం గురించీ అంతగా ఆకళింపు కానేలేదు. నాకు ఏసీ త్రీ టైర్ ,టూ టైర్ రైల్వే బోగీల కంటే ,మధ్య తరగతి బోగీనే ఇష్టం. అక్కడ ప్రేమ పలకరింపులూ ఆత్మీయ చిలకరింపులూ ఉంటాయ్. అందుకే నేనెప్పుడూ నాన్ ఏసీ. ల్లోనే ప్రయాణిస్తాను. కాలేజీకి శలవు లిచ్చాక కొన్నిరోజులకు హాస్టల్ మూసేవారు, ఇంటి కెళ్ళినా అమ్మ నాన్నా ఆఫీసులకెళ్ళి పోతారు, వంటరిగా ఉండవలసిందే!అందుకే మా స్నేహితుల తో హాస్టల్ మూసిందాకా ఉండి వారానికో పదిరోజులకో ఇంటి కెళ్ళేప్పుడంతా ఇలా మూడోతరగతి బోగీలో బెర్త్ రిజర్వ్ చేసుకుని అంతా గోలగోలగా మాట్లాడు కుంటుంటే వింటూ వెళ్ళడం నాకు సరదా.

“ఏమోయ్ ! నీకు కమ్మని పిల్ల తెమ్మెరలు ఇష్టం కదా! ఇలావచ్చిఈవిండోపక్కన కూర్చుంటావాఏం” అంటూ తాతగారు మామ్మ గారి కేసి చూశాడు. “మీకూనూ ఇష్టమేగా ఈ పిల్లతెమ్మెరల కమ్మదనం మీరూనూ కాస్తం తసేపు ఆస్వాదించండి” అంది, ఆమె ప్రేమ గా భర్తను చూస్తూ.’ఈవయస్సులోనే వీరికి ఒకరిపై ఒకరి కెంత ప్రేమ!’ అనికోకుండా ఉండలేక పోయను.. మేము సర్దుక్కూర్చుని ,అన్నీ వింటూ చూస్తూ, కమ్మని గాలిని అనుభవిస్తూ ఉన్నాం. ఆకమ్మని గాలికి నామనస్సూ శరీరమూ తేలిపోసాగింది.ఇలా హాయిగా మాట్లాడు కుంటుంటే వినడం నాహాబీ.

“ఏమోయ్ ! నీ చాయ్ టైం అవలేదూ!వెళ్ళిపట్టుకు రానేంటీ!” తాతగారుతన ప్రియ సఖిని అడిగాడు.

” చాల్చాలు ఆగండి! మీ ఆగడాలు ఎక్కు వౌతున్నాయ్. మీరెళ్తే నేను కంగారుకు రెండు చాయ్ లు తాగాల్సి వస్తుంది, ఎక్కడ తూలి పడ్డారోని” అనిమామ్మగారు అంటుండగానే ‘ చాయ్ చాయ్’ అంటూ చాయ్ వాలా రానే వచ్చాడు. ” మీ ఆరాటమే చాయ్ వాలాను తీసుకొచ్చినట్లుంది.” అని ” రెండు చాయ్ లివ్వు బాబూ!” అంటూ మామ్మగారు తన చేసంచీ లోంచీ డబ్బుతీసి చాయ్ వాలాకిచ్చి, ఒకచాయ్ తాతగారికి అందించి, మరోకప్పు తాను అందుకుని,” మీరు చాయ్ తాగరా అమ్మాయ్!” అంటూ వీణ వైపుచూసింది.

” మేము తాగేవచ్చాం.నాకు వద్దు.మీక్కావలిస్తే తాగండి ” అంటూనన్ను చూసింది వీణ. నేనూ వద్దన్నట్లుగా తల అడ్డంగా ఊచాను. మాబెర్త్ లో విండోపక్కన కూర్చున్న నడిపిజంటలో భర్త, ” ఏమే! వెళ్ళి కాఫీతాపో! నా కాఫీ టైమైందనే ఙ్ఞాన ముందా! వెళ్ళి పాంట్రీ కార్లో కెళ్ళి ఫ్రెష్ కాఫీతాపో” గర్జించినట్లే అంటూన్న ఆస్వరానికి నేను తలత్రిప్పి చూడకుండా ఉండలేక పోయాను.                                                                        “చల్లారిపోతుందేమోనండీ!”భయ భయం గానే అందాఇల్లాలు.

“ఏం ఫ్లాస్క్ తేలేదా!” మరోగర్జన ” తొందర్లో మరచానండీ! ఐనా రైల్ బోగీల్లో కాఫీ,టీలు వస్తూనే ఉంటాయిగా అనీ”     “ఏడ్చావ్! నీకంతా బధ్ధకమే!ఎప్పుడు ఏపని సరిగ్గా చేసి చచ్చావు గనకా! వెళ్ళి అఘోరించుపో” అంటూ పదిరూ.తీసి ఇచ్చాడు పర్స్ లోంచీ.’ కాఫీకప్పు పది రూ. అంటే ఆమెకు లేదన్నమాట! ఆమె భుజం చుట్టూ కప్పుకున్న కొంగు తో కళ్ళూ,ముఖం తుడుచు కుంటూ తల వంచుకు వెళ్ళింది. అంతా గమనిస్తూ కళ్ళు మూసుక్కూర్చున్నాను. వీణా అంతే. తాతగారూ ,మామ్మ గారూ చిన్నగా నవ్వారు.ఇంతలో సైడ్ బెర్త్ భార్య భర్తతో” ఏమయ్యా! అంతా కాఫీలూ, చాయ్ లూ తాగుతుంటే బొమ్మలా బయటికి చూడకపోతే పోయి నాకూ కాఫీ తేరాదుటయ్యా!ఆకిటికీలోంచీ ఎవరు కనిపిస్తున్నారూ!నీవు చేసుకోవాలని తప్పిపోయిన నీరజా!!” అంది ముల్లు గుచ్చుతున్నట్లున్న మాటలతో. ఆమాటలు వినేవారికే బాధగా ఉంటే పాపం అతని కెంత బాధ కలిగించాయో!!’ అను కున్నాను. ఆమె స్వరం మాత్రం పురుష కంఠానికి దీటుగా ఉంది.

కాస్తసేపయ్యాక “రావోయ్!ఇక్కడ చల్లని గాలి చాలా హృద్యంగా ఉంది, నీవూ కాస్త సేపు ఆస్వాదించు, అంతా నాకేనా! సహ ధర్మచారిణివి కాదుటోయ్! “అంటూ తాతగారు, మమ్మగార్ని తన పక్కకు పిల్చికూర్చో బెట్టు కున్నారు.” నిజంగానే సుమండీ! నేను మీపక్క కు రాక పోతే చాలానే మిస్సయ్యే దాన్ని!ఈ పిల్లగాలి మరీ ఇంత కమ్మగా ఉంటుందను కోలేదుసుమండీ!” అంది గారంగా భర్త వేపు చూస్తూనూ.

“అందుకే ‘మగనిమాట వినాలిమరి” అంటూ ఆమెతలపై చిన్నగా తట్టాడు.వారిద్దరి నీ చూస్తుంటే భార్యాభర్తలెలా ఉండాలో తెల్సి వస్తున్నది నాకు కాస్త కాస్తగా. ఎండ వేగంగా పెరగ సాగింది.

“ఏమోయ్!నీకు ఎండ పడదు, నీవిటు జరుగు, నేనా విండో పక్కకెళతాను.”అంటూ తాతగారు బలవంతంగా మామ్మగార్ని ఇటు జరిపి తాను అటువెళ్ళారు.

కాఫీ త్రాగి కాస్తసేపు నిద్రించిన ఆభర్త నరసింహం ఎండ ముఖమ్మీద పడగానే ,”ఏమే నాకు ఎండ పడదు. నీ విటురా!”అంటూ ఆమెను విండో వైపు వెళ్ళమన్నాడు . ఆ తర్వాత తాతగారు మా బెర్తు లోని జంటల పేర్లు నరసింహం, నాగమణి అనీ, సైడ్ బెర్త్ లోని ప్రయాణీకులపేర్లు, సుందరి, సుబ్రహ్మణ్యమనీ ,తమతో ఉన్నఆమూ డు జంటలూ మాలాగే మైసూర్ సందర్శనార్ధం బయల్దే రారనీ,అక్కడ మహారాజా ప్యాలెస్,బృందావన్ గార్డెన్స్ , శ్రీ రంగ పట్నం , కావేరి ఆనకట్ట, చాముండి హిల్స్ మీది చాముండి ఆలయం, జగన్మోహన్ పాలసు , లలితా మహల్ ఇంకా ఎన్నెన్నో దర్శనీయ స్థలాలు చుట్టుకు రానున్నారనీ తెలిసింది. ‘నాకిలా అందరితో కలసి ప్రయా ణించడం ఇష్టం, బహుశానీకు కష్ఠంగా ఉందేమోని మెల్లిగా వీణకు అడిగాను.

“వీణా!ఇలా మధ్యతరగతి బోగీప్రయాణం కష్టంగా ఉందా! ,ఏసీలోకి మారి పోదామా!” అనిఅడిగాను”లేదండీ ఇక్కడేబావుంది. అందరి తోకల్సి ప్రయాణించడం.ఇలా ఒకరి నొకరు పలకరించుకోడం, మాట్లాడుకోడం, ఏసీ ల్లోఅంతా నిశ్శబ్దంగా ఉంటారు. ఎవరికి వారే యమునా తీరేలాగా!”అంది మెల్లిగా. ఐనా వీణ మాటలు తాతగారికీ, మామ్మగారికీ వినిపించినట్లు న్నాయ్.

“ఓహో! వీణ రాగాలనుమీటు తున్నదే! మీ అమ్మా నాన్నగార్లు నీవు పుట్టినపుడు ఎలాపెట్టరోగానీ ‘ వీణ ‘ అనే పేరు సార్ధక మైందమ్మా! నీమాటలు వింటుంటేనూ” అన్నారు ఆదరంగా.

ఇంతలో “ఏమే! ఎనిమిదైంది, ఆకలేస్తుందని తెలీదుటే!ఏంతెచ్చి చచ్చావో, తీసి నాముఖాన తగలెట్టు.”అనే గర్జన నరసింహం నుండీ వచ్చింది. ఆవిడ నోరువిప్పకుండానే తన సీటు క్రిందిబ్యాగ్ లోంచీ పూరీలూ,కూర తీసి ఓక ప్లేట్లో పెట్టి అందించింది, అతగాడికి. నోట్లో పెట్టుకోగానే “తుప్!”అంటూక్రింద ఊశాడు.” నీముఖంలాఉంది దీన్లో ఉప్పేదే!”అంటూఉరిమాడు. పాపం ఆమె ముఖం కత్తి వేటుకు నెత్తురుచుక్క లేకుండాపోయింది.

” అయ్యోపాపం ఉప్పులేకుండా ఎలాతింటావుబాబూ! ఉండుండు నాదగ్గర రుచి ఉంది,ఇది కలిస్తేనే కదా రుచి వచ్చేదీ,అందుకే దీని పేరు’రుచి’ “అంటూ స్పూన్ తోలవణంతీసి ఆకూరలో కలిపింది మామ్మగారు. బామ్మగారు స్పూన్ కంటిన కూర నాలిక్కిరాచుకుని తమాషాగా అతగాడికేసి చూసి”ఇప్పుడు లవణం నీకు సరిపోయినంతగా ఉంది.”అని మెల్లిగా అతగాడికి మాత్రమే వినిపించేలా “ఊరికేఅల్లరి. కమ్మనికూరను ఉప్పు కసించేసుకున్నావ్! భార్యను ప్రేమతో దగ్గర చేసుకోవాలోయ్ !కోపం తోకాదుస్మీ!,” అని పెద్దగా “ఇహ తిను బాబూ! అంతకోపమైతే ఎలా, నేనూ ఎన్నోమార్లు మరుస్తూనే ఉంటాను. మరుపు మనిషికి సహజం.” అంటూ కాస్త మసాలా కూడా అంటించి వాష్ బేసిన్ కేసి నడిచారు. నరసింహానికి తినక తప్పలేదు.

ఇంతలో “టికెట్ టికెట్ ‘ ఏదీ మీటికెట్!” అంటూ టికెట్ కలెక్టర్ వచ్చాడు.అంతా తీసి చూపసాగారు.నరసింహం టికెట్ కోసం జేబులన్నీ వెతుక్కున్నాడు. లేదు,”బీరువాలో ఉంచేసినట్లున్నాను. ఐనా వచ్చేప్పుడు గుర్తుచే యొ ద్దుటే! నీఅ..” అంటూ బూతుమాట వాడి “సార్!” .. అంటూ టీ.సీ వేపుచూడగా,ఆయన “టికెట్ మర్చి పోతే మళ్ళాకొనుక్కోండి. డబ్బుతీయండి, టికెట్ రాస్తాను” అంటూ వివరాలు అడిగి డబ్బుకట్టించుకెళ్ళాడు.

“చూశావా! మీ ఆవిడ మతిమరుపుకు కోపగించావ్!”అన్నారు తాతగారు ఊరుకోకుండా.

వీణ బ్యాగ్ లోంచీ సాండ్ విచెస్ తీసి ఒక పేపర్ ప్లేట్ లో పెట్టినాకు ఇచ్చింది.తాతగారికి, మామ్మగారికీ కూడా ఇవ్వబోగా “మాకివి ఎక్కవ్ తల్లీ, చూడూమాఆవిడ నాకేంపెడుతుందో”అంటూండగానే ,ఆమె పులిహోర దాని లోకి నంచుకోను మెత్తని మేదు వడలూ , పెరుగ్గారెలూ ఒక పెద్దప్లెట్లో పెట్టి అందించిందాయనకు.విండోకేసి తిరిగి ఎత్తుగా పెట్టిన బ్యాగు మీద ఆప్లేట్ ఉంచుకుని మెల్లిగా తినసాగాడు.

” ఏమయ్యా! అందరూ టిఫిన్ లు తింటుంటే వెళ్ళి తేరాదూ, అలా కిటికీలోంచీ చుస్తూ కూర్చోకపోతే! నీకెటూ ఆకల్లేదు నాకు ఆకలేయదా!”అంటూసైడ్ బెర్త్ గొంతురంకె వినిపించింది.పాపం అతగాడు లేచి ఏదో స్టేషన్లో రైల్ ఆగ్గానే వెళ్ళి ఆరు దోసెలూ అరడజన్ ఇడ్లీలూ, ఆరువడలూ పొట్లం కట్టించుకొచ్చాడు.

“కాఫీ ఏదయ్యా!” అని మళ్ళీ ఉరిమింది. మళ్ళీవెళ్ళాడు . మామ్మగారు దగ్గరగావెళ్ళి “అమ్మాయ్! చెప్తున్నా నను కోకు, భర్తతో అలామాట్లాడకూడదమ్మా! అదీనీ ఇంతమందిలో అవమానిస్తే అతగాడే మనుకుంటాడు చెప్పు. ఏదైనా సమస్య ఉంటే మెల్లిగా చర్చించుకుని పరిష్కరించుకోవాలి. భార్యభర్తలన్నాక ఏవేవో ఉండనే ఉంటాయ్ ” అంది.

“కాదండీ! ఈయన నన్ను కట్నంకోసం చేసుకున్నాడు. తనతోపాటు ఉద్యోగం చేసే మరో పిల్లను ఇష్టపడి చేసుకుంటానని మాటిచ్చాట్ట. ఇంతలో ఈయన చెల్లిపెళ్ళికి కట్నం కావల్సివచ్చి, మానాయన ఇచ్చే ఐదు లక్షలకూ నన్ను చేసుకున్నాడు. మా అమ్మ చెప్పిందీ’ ఒసే మీఆయన్ని చెప్పుచేతుల్లో ఉంచుకో ,మాటలతో జయించు,లేకపోతే నిన్నొదిలేసి మళ్ళా ఆపిల్లను తగులుకుంటాడేమో! ‘ అని.! అందు కనినేనిలా మాట్లాట్టం మొదలెట్టాను. ఇంతకాలంగా.”అందామె.

“ఓస్ అదాకధ!మాపెళ్ళికి ముందూ మావారూ తన మరదల్నిపెళ్ళాడాల్ని మనసు పడ్దారు .ఐతే ఈయనచెల్లి పెళ్ళిఖర్చుకోసంమా నాయన గారిచ్చేకట్నం అవసరమై వీళ్ళపెద్దలు మాసంబంధం ఖాయం చేశారు.నాప్రేమతో వాళ్ళ మరదల్ని మరపించేసేశాను. ఇప్పుడు చూడూ ఇంత వయసైనా నామీదెంత ప్రేమో మా ఆయనకు. భర్తను మనస్సుతో కట్టిపడేయాలికానీ మాటల్తోకాదమ్మా! భర్తైనా భార్యైనా పరస్పరం అర్ధంచేసుకుని ఒకరి మనస్సు ఒకరు తెల్సుకుని జీవితాంతం కలివిడిగా ఉండాలి.అదే భారతీయ సంస్కృతి లోని, భార్యాభర్తల   సంబంధం.” అని వివరంగా చెప్పారు మామ్మగారు మెల్లిగా, అతడు కాఫీ తెచ్చేలోగా.

అంతా వింటున్నమాఇరువురికీ వివాహబంధం లోని అంతరార్ధం తెలిసింది. ఒకరికొకరు ఏమిచ్చిపుచ్చుకుంటే బంధం విడదీయ రానిదిగా అవుతుందో అర్ధమైంది. అలా మాప్రయాణమంతా అందరితోకలిసిసాగి ఎన్నో సంఘ టనలు చూసి, ఆకళింపుచేసుకుని, ఎంతోమంది తోమాట్లాడి,ఎన్నోమనస్తత్వాలు గ్రహించి, వివాహ జీవన యాత్ర సాగించను కావల్సిన అనుభవాన్నిపొందగలిగాం, ‘దేశ సంచారంచేసి, అనుభవం గడించిన తర్వాత,పూర్వం రాకుమారులు,రాజుగా సింహాసనం ఎక్కినట్లుగా, మాతేనే వెన్నెలయాత్ర , ప్రేమయాత్ర ,’సార్ధక యాత్ర’ ఐంది. .

————-రచన — ఆదూరి.హైమవతి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Today is PV Narasimha Rao’s Jayanthi

Read More →