సీతాదేవి జీవితం అనుపమానమైనది. ఆమెతో సరి తూగగల లేదా సరిపోల్చగల వ్యక్తిత్వం భారత పురాణేతిహాసాల్లో మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. ఆ మహాసాధ్వి జీవితం నుంచే స్త్రీత్వ పరిపూర్ణతను నిర్ణయి౦చే భారత ఆదర్శాలన్నీ పుట్టుకువచ్చాయి. అట్టి మహాద్భుతమయిన సీతాసాధ్వి పవిత్రలలో కెల్లా పవిత్రయై, సహనానికి ప్రతి రూపమై నిలిచింది. పతివ్రతయై దేవమానవులకు ఆదర్శప్రాయంగా ఆ మహాతల్లి ప్రకాశిస్తోంది. ఆ మహాసాధ్వి సీత మన జాతికి అధిష్టాన దేవతగా ఎప్పుడూ సుస్థిరంగా నిలచి ఉండవలసిందే.
వాల్మీకి మహర్షి సుస్పష్టముగా ఈ విధంగా తెలియజేశారు.
” ఏకోవిభావసిరామత్వ౦మాయయా బహు రూపయా|
తథాయోగమాయాపిసీతేతి||”
ఏకైక సత్య స్వరూపం శ్రీ రాముడే బహురూపిణియగు మాయను స్వీకరించి విశ్వరూపంగా భాసిల్లుతున్నాడు. ఇక ఆయోగమాయయే సీత. మరో విధంగా చెప్పాలంటే యోగమాయయైన సీత ద్వారానే శ్రీరాముడు విశ్వరూపుడుగా వెలుగొ౦దుతున్నట్లుగా అర్ధమవుతుంది. అంతేకాక శ్రీరాముని ఆదేశంతో భక్త శ్రేష్టుడయిన ఆంజనేయునికి తత్త్వజ్ఞానాన్ని ప్రసాదించే సందర్భంలో విస్వమొహిని, హరినేత్రకృతాలయ అయిన సీతాదేవి ఈ విధంగా తెలియజేసింది;
” మాం విద్ధిమూలకృతిమ్ సర్గస్తిత్వ౦తకారిణీం|
తస్య సన్నిధిమాత్రేణ స్రుజామిదమత౦ద్రితా||”
(అధ్యాత్మరామాయణం)
దీనర్ధం,” సీతాదేవి యగు నన్ను సృష్టి, స్థితి, సంహారకారిణి యైన మూల ప్రకృతిగా తెలుసు కొనుము. శ్రీరాముని సాన్నిధ్యమునందే నిలచి నేను ప్రమాదరహితనై ఈ సర్వ సృష్టిని గావిస్తాను”, అనగా పరమయగు సీతామాతయే ఆది పరాశక్తి అవతారంగా తెలుస్తోంది.
అంతేకాక జగజ్జనని, భగవతియైన శ్రీసీతామాత మహిమ అపారమైనది, అంతులేనిది. వేద,శాస్త్ర పురాణ, ఉపనిషత్తులలో సీతామాత యొక్క అనంతమైన లీలలు వర్ణింపబడ్డాయి. ఆమె భగవానుడగు శ్రీరామచంద్రుని ప్రాణప్రియయైన ఆద్యాశక్తి. ఈమె భృకుటివిలాస మాత్రము చేతనే ఉత్పత్తి స్థితి సంహారాదికార్యములు జరిగిపోవు చుండునని శ్రీరామోత్తర తాపినీ ఉపనిషత్తునందు తెలుపబడినది.

గోస్వామి తులసీదాసు తమ రామచరితమానసమునందు సీతామాతను క్రింది విధంగా స్తుతించారు.
” ఉద్భవస్థితి సంహారకారిణీమ్ కేశహారిణీమ్|
సర్వశ్రేయస్కరీం సీతాంనతో2హంరామవల్లభామ్||”
శ్రీ రామచంద్రుని ప్రియపత్ని సీతాదేవి. ఆ మహా సాధ్వి సృష్టి, స్థితి, లయ కారిణియైన మహాశక్తి స్వరూపిణి. అవిద్యాది సమస్త క్లేశములను నశి౦పజేయునది. సకల శుభములు ప్రసాదించు సీతామాతకు నా మనస్సుమాంజలులు.

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.