మన సనాతన ధర్మంలో స్త్రీలకు అత్యంత విశేషమైన గౌరవం ఇవ్వబడినది. ” యత్ర నార్యస్తు పూజంతే రమ౦తే తత్ర దేవః” ఎక్కడైతే మహిళలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు ఆనందిస్తారు అని మనువు తన ధర్మ శాస్త్రంలో చెప్పినట్టుగా తెలుస్తుంది. దీనర్ధం ఏ ఇంట స్త్రీలు గౌరవ మర్యాదలు పోందుతారో ఆ కుటుంబాలను దేవతలు ఆశీర్వదిస్తారు.
” యధా తద్యతో అర్థావ్యదధాత్”
మనం ఏ రకమైన పాపము చేయుచున్నామో దాని ఫలితమే నేడు ఈ ప్రపంచం ఎదురుకుంటున్న సమస్యలకు మూలకారణం. సాక్షాత్తు దేవీ స్వరూపము, మాతృస్వరూపము అయిన స్త్రీలకు అగౌరవము మరియు వారి పట్ల జరుగుతున్న హింసల పర్యవసానమే ఇదంతా అని మనం గ్రహించాలి. ఈ ఇబ్బందుల నుండి బయట పడటానికి స్త్రీలను సముచిత రీతిలో గౌరవించడం అనివార్యం యదార్ధానికి పరబ్రహ్మ పరతత్వంలో స్త్రీ పురుష భేధమనేదేలేదు. వ్యావహారికంగానే ఈ రకమైన అంతరం ఏర్పడింది. మన దేశంలో ఆదర్శస్త్రీ అన్నదానికి పర్యాయపదం మాతృమూర్తి.
ఎన్ని బాధలు అనుభవించినా ఎల్లప్పుడూ క్షమించే గుణం ఒక తల్లికే సాధ్యం. ప్రేమకు ఆదర్శమే మాతృమూర్తి. మాతృత్వం నుండే అపరిమితమైన బాధ్యత జనిస్తుంది. నేడు లేదా గతంలో అత్యున్నత స్థాయికి ఎదిగిన ప్రతి ఒక్కరూ దానికి కారణాన్ని వారి మాతృమూర్తి యొక్క ఆశీర్వాదంగా భావిస్తారు. ఎన్నడూ తీర్చలేనంతగా మనం తల్లికి రుణపడి ఉంటాం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.