Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

స్పిరిచ్యువల్ స్టో రీ..ఆధ్యాత్మిక కథ..0010.”మై త్రీ కేతనం..!”

By   /  July 14, 2016  /  No Comments

    Print       Email

CBMS_2546229fఒక మాస్టర్ ఇండియా-పాకిస్తాన్ బార్డర్ కి వెళ్ళాడు..అతనొక టిబెట్ లామా(మహా గురువు).ఒక ఇండియన్ సైనికుణ్ణి తన వద్దకు పిలిచాడు నవ్వుతూ..అలాగే ఒక పాకిస్తానీ సైనికుణ్ణి కూడా పలకరించి తన వద్దకు రమ్మన్నాడు.అతను మాత్రం సరిగ్గా బార్డర్ మీద నిలబడి నవ్వుతూ మొదట పాకిస్తానీ సైనికునితో అడిగాడు..

” నువ్వు తీసుకుంటున్న గాలి ఇండియాదా..పాక్ దా..!”
అతను చెప్పాడు..” పిచ్చి ప్రశ్న మాస్టర్..డౌట్ లేకుండా పాక్ దే..ఎందుకంటే అది వాస్తవాధీన రేఖ దాటగానే పాక్ ది అవుతుంది..”
మాస్టర్ తిరిగి సన్నగా నవ్వుతూ ..” మరి భారత వీర సైనికా నువ్వేమంటావ్..!”
” పవిత్ర భారత పవనమే అంటాను..” కాస్త గర్వంగా చెప్పాడు.
”మిత్రులారా..! చాలా బాగా చెప్పారు..మీ మీ దేశభక్తికి జోహార్..మరి వాస్తవాధీన రేఖ దాటితే మీ మీ పేర్లు కూడా మారిపోతాయా..” అడిగారు మాస్టార్..
” నో..నో……………..” ఏక కంఠంతో అన్నట్లుగా వచ్చింది..వారిద్దరి నుండి ఒకేసారి.వాతావరణంలో సర్వవ్యాపకమైన గాలిని కూడా మనం విభజిస్తున్నందువల్లే..
మన మధ్యన యుద్ధాలు మిత్రులారా..!మనుషులే కాదు సకల ప్రాణులూ తీసుకుంటున్న గాలి ఒకటే..జీవిస్తున్న నేల ఒకటే..త్రాగుతున్న నీరు ఒకటే..ఉపయోగిస్తున్న అగ్ని ఒకటే..మన ఇంటికి చెదరని పైకప్పు ఆకాశమూ ఒకటే..మనమంతా ఒకటే..మిత్రులారా..! దయ చేసి మన్నించండి..కాస్త ఆలోచించండి..!సరదాగా హాయిగా ఆనందంగా జీవించండి..నాటకీయంగా యుద్ధాలు చేయండి..!చిన్నపిల్లల్లా ఆడుకోండి ఆయుధాలతో..అలాగే మీ ఈ జీవితాలతో..!
ఇది ఒక అద్భుతమైన అవకాశం..! వెర్రిగా మరోసారి మరణ శాసనం వ్రాసుకోవటానికి..”
ఆ గురువుగారి మాటలకు వారిద్దరికీ ఆశ్చర్యమేసింది..! వారిద్దరూ బిగ్గరగా ఒకరినొకరు కౌగిలించుకున్నారు..! వాస్తవాధీన రేఖ సాక్షిగా మైత్రీ కేతనం నవ్వింది..!
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →