Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

స్పిరిచ్యువల్ స్టో రీ..ఆధ్యాత్మిక కథ..0012.”అస లైన సంపద..!”

By   /  July 16, 2016  /  No Comments

    Print       Email

” ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురది ఎట్లన్నన్..తెప్పలుగ చెరువు నిండిన కప్పలు పదివేలు జేరు గదరా సుమతీ..!”పద్యాన్ని పదేపదే చదువుతున్నాడు నోటికి నేర్చుకోవాలని ఐదేళ్ళ ‘కశ్యప్’.
కళ్ళు మూసుకుని వల్లెవేస్తున్న పిల్లాణ్ణి చూసుకు మురిసిపోతోంది తల్లి ‘మహిత’.
చుబుకం(గెడ్డం)క్రింద చేయి ఆన్చుకు పుత్రరత్నాన్ని ఎగాదిగా చూస్తూ ఆనందిస్తున్న ఆమెను వీధిగుమ్మం నుండే గమనించిన భర్త ‘అత్రి’ అడుగు ముందు కేయకుండా నిలచిపోయాడు చిత్తరువులా..మునుముందుగా తేరుకున్న మహిత కళ్ళు మూసుకు ఆలకిస్తున్న భర్తను..మెల్లగా తాకుతూ..” ఎంతసేపైందండీ వచ్చి ..” సన్నగా నవ్వుతూ పలకరించింది.
” పుత్రోత్సాహము తండ్రికి..హహ్హహా..”అంటుండగా తండ్రి గొంతు విన్న ‘కశ్యప్’..
”నాన్నా.. నాన్నా..”అంటూ తండ్రి ఒళ్లోకి ఎక్కి మెడచుట్టూ చేతులు వేసాడు గారంగా..
మరో ఇరువదేళ్ళు ఎలా గడచిపోయాయో మరి..పెళ్ళిపీటల మీంచి లేచి..
‘కశ్యప్’ తన భార్య ‘దివిజ’తో కలిసి తల్లి దండ్రులకు వంగి నమస్కరిస్తుండగా..ఆ తండ్రి..
‘అత్రి’ కళ్ళల్లోంచి రెండు అశ్రువులు రాలి ‘కశ్యప్’ శిరసు మీద పడ్డాయి.’కశ్యప్’ అది గుర్తించక పోలేదు..అతని కళ్ళల్లోని భావన తల్లిదండ్రులను ముగ్ధులను చేసింది.తల్లి ‘మహిత’ మదిలో
చెప్పలేని ఆనందం.
‘దివిజ’ అణకువ..పని తీరు..మాట తీరు..వాళ్ళను చకితుల్ని చేసింది.
మరో నెల గడిచింది.సాయంత్రం ఏడు గంటల వేళ..ఆ రోజు శుక్రవారం..అప్పుడే ‘దివిజ’ ఆఫీసునుండి ఇంట్లో అడుగు పెట్టింది.
” అత్తయ్యా ..”అంటూ ఓ పాకెట్ ఆమె చేతిలో ఉంచి ఆమె పాదాలకు నమస్కరిస్తుంటే ఆశ్చర్యంగా ”ఏమిటమ్మా ఇది ..!”అడుగుతూ ఆమెను దగ్గరికి తీసుకుంది.
”నా మొదటి జీతంతో మీకు మామయ్యగారికి బట్టలు తెచ్చాను..” చెప్పింది ‘దివిజ’ మెల్లగా.
అప్పుడే లోపలినుండి వచ్చిన ‘అత్రి’
” అమ్మా దివిజా నీవు మీ అమ్మానాన్నలకు పెద్ద కూతురువి నీకింకో చెల్లెలుంది..మాకు ‘కశ్యప్..’ ఒక్కగానొక్క కొడుకు.మీరే..మీ ఇద్దరి ఆనందమే మా అసలైన సంపద.నీ జీతం పూర్తిగా మీ చెల్లాయి పెళ్ళి ఖర్చుకని మీ నాన్నగారికివ్వు..తెలిసిందా..”అనేసరికి ” మీరే మీ ఇద్దరి ఆనందమే మా అసలైన సంపద..” అన్న ఆ మాటలు ఆమె చెవుల్లో అమృతమధురంగా మారుమ్రోగాయి.!

 

InCorpTaxAct
Suvidha

 

Author:

Madhav Rao Koruprolu

13254167_896390973822258_3568960880258876080_n

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →