Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

స్పిరిచ్యువల్ స్టో రీ..ఆధ్యాత్మిక కథ..0018. ” జ్ఞానోదయం..! ”

By   /  July 25, 2016  /  No Comments

    Print       Email
fishes” జ్ఞానోదయం..! ”

ఓ మాస్టర్..ఒక నది ఒడ్డున కూర్చుని నీళ్ళల్లోకి తదేకంగా చూస్తున్నాడు.చాలామంది యువతీ యువకులు ఆ మాస్టర్ తో ప్రక్కనే ఉన్నారు..! వాళ్ళంతా చాలా హుషారుగా ఆడుతూ పాడుతూ సరదాగా గంతులేస్తూ నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు..!

ఇంతలో ఓ క్రొత్త వ్యక్తి ఆ పిల్లల వద్దకు చేరి..ఓ కుర్రాడితో..
” మీ గురువుగారికి ఎంతమంది శిష్యులు..!? ”ఉత్సుకతగా అడిగాడు..!
” ఆ సంగతి మాకేలా తెలుస్తుంది..వారినే అడగండీ..నేరుగా..! ” నవ్వుతూ చెప్పాడు కుర్రాడు..!
అతను వెంటనే ఆ మాస్టర్ దగ్గరగా వెళ్లి..
గురూజీ..! మీకు ఎంత మంది శిష్యులు..!? ” అడిగాడు వినయంగా..!
ఆ మాస్టర్ అతనివైపు తిరిగి చూడలేదు..ఆయన ధ్యాసంతా నదిలో  ఆడుతున్న చేప పిల్లలపట్లే ఉంది..!
” ఓ గురూజీ..! మిమ్మల్నే..మీకెంతమంది శిష్యులూ..!? ” కొంచెం బిగ్గరగా చెవి దగ్గరగా వంగి
అడిగాడు..!
” అరె.. ఎవరు గురువు ఎవరు శిష్యుడు..?! చూడవయ్యా..ఆ చేప పిల్లల్ని చూడూ..ఎంత హాయిగా ఆడుతున్నాయో..! ”
అనేసరికి..అతనిలో ఏదో వెలిగినట్లనిపించింది..అతని మనసులో..
”అడవిలోని నెమలి కెవరు ఆట నేర్పిరీ..చెరువులోని చేప కెవరు ఈత నేర్పిరీ..! ” అనే పాట మెదిలింది..!
వెంటనే ” మరి ఈమనుషులకుస్కూళ్ళు..కాలేజీలు..యునివర్సిటీలు..ఆశ్రమాలు..గురువులు..
మాస్టర్లూ..దేనికో..!? ” ఆలోచనలో పడిన అతని భుజం మీద ఆ మాస్టారి చెయ్యి పడింది..మెల్లగా..!
” మనిషి సహజత్వాన్ని కోల్పోయాడు మిత్రమా..అందుకే దానిని తిరిగి ధ్యానం ద్వారా సొంతం చేసుకున్న గురువుల అవసరం ఏర్పడింది..! ” నవ్వుతూ చెప్పారా మాస్టారు..
వెంటనే అక్కడ చేరి ఆడుతున్న ఆ యువతీయువకుల బృందంలో తానూ కలసిపోయాడు..!
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →