Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

స్పిరిచ్యువల్ స్టో రీ..ఆధ్యాత్మిక కథ..0022.” అ సలు మిఠాయి”

By   /  July 29, 2016  /  No Comments

    Print       Email

gulab-jamun2బస్ స్టాప్ ఎదురుగా ‘వివేక్ మిఠాయ్ బండార్’ స్వచ్ఛమైన నేతి మిఠాయీలు..అందునా ఆవునేయి మిఠాయీలు..!
ఇంజనియరింగ్ సెకండియర్ చదువుతున్న ‘మిథిల్’ తన గర్ల్ ఫ్రండ్ ‘మౌన’తో నవ్వుతూ కబుర్లు చెబుతూ ఆ మిఠాయ్ బండార్ లో ఎంటరయ్యాడు..!
” ‘మిథిల్’ మిల్క్ గులాబ్ జామ్ తిందామా..! ” అడిగింది ‘మౌన’..!
” ఓకే..యాజ్ యూ లైక్..! ” అనేసి ఆర్డర్ చేసాడు ‘మిథిల్..’!
” అవును మిథిల్..ఈ మధ్య జనాలకి హెల్త్ కాన్షస్ బాగా పెరిగింది కదూ..! ”
” టెన్షన్స్..రోగాలు పెరిగి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుంటే మరి మొదలవ్వాల్సింది ఆ కాన్షసేగా..! ”
” యా..యూ ఆర్ రైట్ మై డియర్..”
” అది సరేలే..ఇంతకీ హాటేమీ వద్దా..!? ”
” అంటే నేను తిండిపోతునా..?! ” కొరకొరా చూస్తూ అడిగింది ‘మౌన’..!
” మిల్క్ గులాబ్ జామ్ పని చేయడం స్టార్టయిందే..” నవ్వుతూ అంటే..
” అంటే ఇప్పుడిక ఉడుకుమోతునవుతానో లేదో చూద్దామనా..! ” కళ్ళెగరేస్తూ అందామె..!
” తిండిపోతు..తిరుగుబోతు..తాగుబోతు..ఉడుకుమోతు..అసలీ  పోతు పదాలు ఆడవాళ్ళకి ఎలా సరిపడతాయ్ మౌనా..! ”
” థాంక్యూ దెన్..మరి గప్ చుప్ ..అదే పానీ పూరీ తిందామా..! ” చాలా ఆసక్తిగా అడిగింది మౌనా..!
****       ****        ****       ****       ****       ****
మరి అలా సరదాగా వారి ఇంజనియరింగ్ పూర్తికావచ్చింది..!
” మనం త్వరలో వివేక్ మిఠాయీలకు దూరమౌతున్నామంటే నీకేమనిపిస్తోంది..!?” అడిగాడు ‘మిథిల్’.. ”
” హహ్హహా..సూటిగా అడగచ్చుగా మిథీ..మనం విడ్కోలు చెప్పుకోవలసిన రోజు దగ్గర పడుతుంటే ఎలా ఉందని..! ”
గలగలా నవ్వుతూ అంది మౌనా..!
” నువ్ భలే ఈజీ గోయింగ్ రా మౌనా..! “తడి తొంగి చూసింది మిథిల్ గొంతులో..!
” ఓ నైస్..మిథీ..అలాగా..మరి నువ్ లేకుండా నేనుండలేను అనేది ఫ్రండ్ షిప్ అవుతుందా మిథీ..! “లవ్లీగా అంది మౌనా..!
” సో గ్రేట్ మౌనా..అందుకే..అందుకే నువ్ నాకు కావాలి..” స్థిరంగా ఉన్న మిథిల్ మాటలకు పడిపడీ నవ్వేసి సరిగ్గా ఇప్పుడే మనం దూరంగా వుండగల్గాలి మిథీ..!”
” సుపర్బ్ మైడియర్ మౌనా..యాజ్ యూ లైక్..! ” అనేసి ఓ కిలో మిఠాయీలు పాక్ చేయుంచి మౌనాకిచ్చి..” ఓకే యాజ్ యూ లైక్..మౌనీ..! ” చెప్పాడు మిథిల్ తనను తాను గమనించుకోవడంలో నిలచి..!
” హలో..దిసీజ్ వివేక్ మిస్టర్ మిథిల్..! ” పలకరించాడు మిఠాయి షాప్ ఓనర్..!
” ఓ..చెప్పండి వివేక్..! “చేయి కలుపుతూ అడిగాడు మిథిల్..!
” నా మిఠాయి పొట్లం పని చేసింది..మిత్రమా..! “అంటున్న వివేక్ మాటలకు ఆశ్చర్యపోతూ..
” మిఠాయి పొట్లమేంటి..పని చేయటమేంటి..?! “అడిగాడు మిథిల్ కళ్ళింతలు చేసుకుని..!
” అది..ఆ సంగతి మీ మౌనాగారు చెప్తారు..! ” మరో ట్విస్ట్ ఇచ్చాడు వివేక్..!
ప్రశ్నార్థకంగా చూస్తున్న మిథిల్ కి ఓ పాంప్లేట్ ఇచ్చింది మౌనా..!
” అద్భుతః..! ఓ వెరీ వండ్రఫుల్..! మిఠాయీలతో పాటు మీరు పంచే ఈ పాంప్లేట్స్ నేను గమనించనే లేదు..సో.. మీ ఆవునేతి మిఠాయీల రహస్యం ఇదన్నమాట..ఈ మానవాళి ఆరోగ్యం కోసం కంకణం కట్టుకున్న ఈ మీ ధ్యానమార్గం వివేకాన్ని విచక్షణనూ చక్కగా పెంపొందిస్తుందన్నది రుజువైంది మిత్రమా..! నేనేమో అనుకున్నాను..నా మౌనా ఎంత మౌన ధ్యానంతో నన్ను నాన్ వెజ్ మానేలా చేసేసి నా నిదానానికి ఎంత సాయం చేసింది..! ” ఆనందంగా వివేక్ కి షేక్ హాండ్ ఇచ్చి..
” మౌనా..థాంక్యూ సోమచ్..ఈ క్షణం నుండి మనం పంచవలసింది ‘ఆనాపాన సతి’ అంటే ” శ్వాస మీద ధ్యాస ” మిఠాయి పొట్లాలనే..!

 

InCorpTaxAct
Suvidha

 

 

Author:

Madhav Rao Koruprolu

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →