స్వధర్మ మపి చావేక్ష్య నవికంపితు మర్హసి|
ధర్మ్యాద్ధి యుద్ధా చ్చ్రేయో2న్యత్ క్షత్రియస్య న విద్యతే||
నీ ప్రస్తుత స్థితినుంచి కూడా నీవు వెనుకంజ వేయడానికి తగవు. “స్వధర్మం” క్షత్రియునకు యుద్ధం ధర్మంగానే పరిగణింపబడుతుంది. తనకున్న శక్తిని ప్రదర్శించుకునే, అక్రమాలతో. కూడిన యుద్ధం న్యాయనిష్టగల యుద్ధంగా చెప్పదగదు. ఒక సైన్యం వచ్చి, మనదేశం పైపడి, మనల్ని దోచుకోబొతుంటే, మనం తప్పక యుద్ధం చేసి దేశాన్ని కాపాడుకోవాలి. అది ధర్మంతో కూడిన యుద్ధం అవుతుంది. దానికి విరుద్ధంగా గనుక మనం ప్రవర్తించినట్లయితే మనతో పాటు, మన తర్వాతితారాల వారు కూడా దాని ఫలితాన్ని అనుభవించవలసివుంటుంది. “స్వధర్మం అపి చ అవేక్ష్య”. కావున ప్రజల స్వేచ్ఛను కాపాడవలసిన ధర్మం నీది,అనగా క్షత్రియుడిది. గతకాలంలో క్షత్రియుడి కర్తవ్యాన్ని కొత్త రీతిలో రాజకీయనాయకులు, కార్యనిర్వాహకులు ఈకాలంలో నిర్వహిస్తున్నారు. వారు ప్రజలను కాపాడుతూ వారికి సేవ చేయాలి. ఎవరో ఒకరు ఆ కార్యాన్ని నెరవేర్చాలి.
ఈ ధర్మాన్ని రాజకీయనాయకులు, పాలకులు నిర్వర్తించాలి. క్షత్రియ కార్యనిర్వహణ, దేశపరిరక్షణ రెండూ అతని కర్తవ్యాలు ప్రజలను రక్షించాలి. ఈ విధంగా రాజకీయాలు, దేశపరిరక్షకులు, రక్షణ వ్యవస్థ అంతాకూడా క్షత్రియ తరగతికి చెందుతుంది. వారు వారి శక్తిని ప్రజాసేవకు వినియోగించాలి. అప్పుడు అది స్వధర్మం అవుతుంది. ఈ స్వధర్మాన్ని చక్కగా అనుష్టి౦చడ౦ ద్వారా వారు ఆత్మోన్నతిని పొందగలరు.
మహాభారతం నందు శాంతి పర్వంలో, యుధిష్టిరుడు యుద్ధానంతరం రాజ్యాన్ని త్యజిస్తున్నాను అని చెప్పినప్పుడు వ్యాసుడు ‘ దండ ఏవహి రాజేంద్ర క్షత్రధర్మో న ముండనం’ క్షత్రియుడి లక్షణం, అధికారంతో సేవచేయడం కానీ, గుండు చేయించుకొని సాధువు కావడం కాదు. నీ పని అది కాదు. ప్రపంచంలో కొన్ని వర్గాలు ఏర్పడినాయి. దానిలో నీవు క్షత్రియుడవు అయినావు. అందువల్ల నీవు ఆచరించు.
ధర్మయుద్ధం క్షత్రియునికి గొప్ప అవకాశం. రాజైనవాడు తన బుద్ధికుశలతను, తన సామర్ధ్యాన్ని ప్రజలపట్ల తనకున్న ప్రేమను చూపటానికి ధర్మయుద్ధాన్ని ఒక అవకాశంగా భావించవచ్చును. మానవ విలివలను పెంపొందించడానికీ, వ్యక్తి స్వేచ్ఛ, గౌరవం, ఔనత్యాన్ని పరిరక్షించడానికి చేసే యుద్ధం ధర్మ సమ్మతమైనదే అవుతుంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.