Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

​Will bring jobs back to US from China: Donald Trump

By   /  August 13, 2016  /  Comments Off on ​Will bring jobs back to US from China: Donald Trump

    Print       Email

donald trump 2ఉద్యోగాలు వెనక్కి తీసుకొస్తా: డోనాల్డ్ ట్రంప్

 

InCorpTaxAct
Suvidha

చైనా వంటి దేశాల నుంచి అమెరికా ఉద్యోగాలను తిరిగి తీసుకొస్తానని అమెరికా అధ్యక్షబరిలో నిలిచిన రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ ప్రసంగించారు. అమెరికాలోని ఉద్యోగాలన్నీ తిరిగి వెనక్కి తెస్తానిని హామీలు గుప్పించారు. దేశవ్యాప్తంగా నిర్మాణ రంగంలో ఉద్యోగాలు తగ్గిపోయాయని ఈ సందర్భంగా అన్నారు.
పలు దేశాలు అమెరికా కంపెనీలను, ఉద్యోగాలను తీసేసుకుంటున్నాయని అన్నారు. కంపెనీలు అమెరికా నుంచి ఇతర దేశాలకు తరలిపోకుండా తాను కృషి చేస్తానన్నారు.డెమోక్రటిక్‌ పార్టీ నేతలు చెప్తున్న అబద్ధాలతో ప్రజలు విసిగిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. చాలామంది అమెరికన్లు తమ ఉద్యోగాలు కోల్పోయి విసిగిపోయారని అన్నారు. కంపెనీలు ఇతర దేశాలకు తరలిపోవడంతో విసుగెత్తిపోయార్నారు. చైనా చర్యలతో కూడా విసిగిపోయారని అన్నారు.ఏదైనా మోసం జరిగితే తప్ప తాను పెన్సిల్వేనియాలో ఓడిపోనని అన్నారు. నవంబరులో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం తనదేనని ధీమా వ్యక్తం చేశారు. ట్రంప్ ప్రసంగం సందర్భంగా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →