Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

చుక్కలు పాడే శుభమంత్రం

By   /  May 3, 2016  /  Comments Off on చుక్కలు పాడే శుభమంత్రం

    Print       Email

చుక్కలు పాడే శుభమంత్రం

Kalyana MantapamDevulapalli
చిత్రం–: కళ్యాణ మంటపం(1971)
సంగీతం : పి.ఆదినారాయణరావు
గానం : పి.సుశీల
రచన: దేవులపల్లి కృష్ణశాస్ర్తి
*****
చుక్కలు పాడే శుభమంత్రం
దిక్కులు నిండే దివ్యమంత్రం
ఎక్కడనో ఎపుడో ఎవరో పలికిన వేదమంత్రం
ఇక్కడనే ఇపుడే ఎవరో…
నా చెవిలో ఊదిన మంత్రం, మధు మంత్రం
చుక్కలు పాడే శుభమంత్రం
రెక్కలపై ఆ గువ్వల జంట… ఆ…
రేకులలో ఆ పువ్వుల జంట… ఆ…
సాగుచునే… ఊగుచునే…
మధుర మధురముగ మక్కువగ
చదువుకునే ఆనంద మంత్రం
చుక్కలు పాడే శుభమంత్రం
కన్నులు ఒకపరి మూసుకొని…
నీవన్నది మరి మరి తలచుకొని…
ఒక్కతినే నేనొక్కతినే
అదే పనిగనే సదా మనసులో
ఆలపించే ప్రియ మంత్రం
చుక్కలు పాడే శుభమంత్రం
కోవెల దైవం పిలిచేదాకా… ఆ…
ఆవలి ఒడ్డున నిలిచేదాకా… ఆ…
నాలోనే… లోలోనే…
నాతిచరామి నాతిచరామి
అది నా ప్రాణ మంత్రం
 
ఈ మధుర గీతాన్ని ఇక్కడ https://www.youtube.com/watch?v=4AJ7-1Xx0Qo వినండి
టీవీయస్.శాస్త్రి   
TVS SASTRY
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →